OTT Movie : మలయాళం సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కి రావడమే ఆలస్యం, వీటిని వదలకుండా చూస్తున్నారు. అందులోనూ హారర్ సినిమాలను అస్సలు వదలట్లేదు. రీసెంట్ గా వచ్చిన ఒక హారర్ సినిమాను, తెలుగు ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ సినిమా ఒక కుట్టు మిషన్ చుట్టూ తిరుగుతుంది. కొత్తగా అద్దెకి దిగిన ఒక పోలీస్ కి ఈ మిషన్ చుక్కలు చూపిస్తుంది. దీని మిస్టరీ కనిపెట్టే ప్రయత్నంలో స్టోరీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వణుకు పుట్టిస్తుంది. మరెందుకు ఆలస్యం. హారర్ ప్రియులు మిస్ కాకుండా ఈ సినిమాపై ఓ లుక్ వేయండి. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘తయ్యల్ మెషిన్’ (Thayyal Machine) మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా. సి.ఎస్. వినయన్ దర్శకత్వంలో కాస్ట్కిచు టెల్లస్, గాయత్రి సురేష్, ప్రేమ్ నాయర్, శ్రుతి జయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 1న రిలీజ్ అయింది. అక్టోబర్ 17 నుంచి టెంట్ కొట్టా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది.
పోలీస్ ఆఫీసర్ శివ, అతని భార్య లీల, తమ కుమార్తెతో కొత్త ఇంటికి మారతారు. అందులో ఒక పాత కుట్టు మెషిన్ రాత్రి పూట స్వయంగా తనకు తాను పని చేసి, అందరినీ భయపెడుతుంటుంది. శివ ఫ్యామిలీ ఇంటికి వచ్చిన మొదటి రాత్రి నుండి వింత శబ్దాలు వస్తాయి. కుట్టు మెషిన్ మాత్రం సౌండ్ చేస్తూ తిరుగుతుంటుంది. లీలకు డ్రీమ్‌లో ఒక మహిళ ఆత్మ కనిపిస్తుంది. “నా రహస్యం తెలుసుకో” అని చెబుతుంది. శివ మొదట భ్రమ అనుకుంటాడు, కానీ ఆ మిషిన్ చూసి అతనికి కూడా భయం వేస్తుంది. శివ దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ మెషిన్ పాతకాలంలో ఒక మహిళది అని, ఆమె గ్రామంలో హత్య అయిందని తెలుసుకుంటాడు.
Read Also : ఊరికి మిస్టీరియస్ శాపం… స్కిన్ లేకుండా పుట్టే పిల్లలు… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు అస్సలు చూడకూడని హర్రర్ మూవీ
ఆ ఆత్మ మెషిన్‌లో ట్రాప్ అయి, రివెంజ్ కోసం చూస్తోందని అర్థం అవుతుంది. శివ పాత డైరీలు చూసి ఆ మహిళ గతం తెలుసుకుంటాడు. ఆ గ్రామంలోని ఒక వ్యక్తి ఆమె మీదఅ మోజు పడతాడు. ఒకరోజు ఆమె భర్త లేనప్పుడు ఆమెపై ఘోరంగా అఘాయిత్యం చేస్తాడు. ఆ తరువాత ఆమెను చంపుతాడు. శివ ఆ మెషిన్‌ను డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆత్మ బలంగా అతనిపై దాడి చేసి, ఫ్యామిలీని డేంజర్‌లో పెడుతుంది. శివకి ఇప్పుడు ఒక్కటే మార్గం ఉంటుంది. ఆ విలన్‌ను ఆత్మ ముందుకు తెచ్చి న్యాయం చేయాలి. శివ ఆ క్రిమినల్ ని పట్టుకుంటాడా ? ఆత్మకి న్యాయం చేస్తాడా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.