Bengaluru Crime: రోడ్డు ప్రమాదంలో యువకుడిని హత్య చేసిన కారణంతో బెంగళూరు పోలీసులు ఓ దంపతులను అరెస్టు చేశారు. మొదట్లో ఈ సంఘటనను రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూసేవరకు అసలు విషయం పోలీసులకు తెలియలేదు. అక్టోబర్ 25న రాత్రి పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ రామ్ మందిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అడ్డంగా దొరికిపోయారు ఆ దంపతులు
బెంగుళూరు సిటీలో ఈనెల 22న అర్ధరాత్రి దర్శన్, అతడి ఫ్రెండ్ వరుణ్ కలిసి శ్రీరామ లేఅవుట్‌లో బైకుపై వెళ్తున్నారు. వారిద్దరూ గిగావర్కర్లుగా పని చేస్తున్నారు. అదే సమయంలో పక్కగా వెళుతున్న కారు సైడు మిర్రర్‌ని ఆ యువకుల బైకు తాకడంతో పగిలిపోయింది. వెంటనే ఆపి కారులో ఉన్న మనోజ్‌కుమార్-ఆరతి శర్మ దంపతులు, దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లింది.
34 ఏళ్ల మనోజ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్. భార్య ఆరతికి 30 ఏళ్లు. తమను రోడ్డుపై నిలదీస్తావా అంటూ దంపతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న బైకును ఆ దంపతులు కారులో రెండు కిలోమీటర్లు వరకు వెంబడించారు. ఆ తర్వాత వెనక నుంచి బైకును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు దర్శన్-వరుణ్‌లు. వెంటనే స్థానికులు వారిని ఓ ఆసుపత్రిలో చేర్చారు.
కారు సైడ్ మిర్రర్‌ని బైక్ డ్యాస్ ఇచ్చిందని
ట్రీట్‌మెంట్ తీసుకుంటూ దర్శన్ మృత్యువాత పడ్డాడు. ప్రస్తుతం వరుణ్ ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఘటనా స్థలంలో కారు విడి భాగాలు కొన్ని పడిపోయాయి. ఈ ఘటన తర్వాత మనోజ్-ఆరతి దంపతులు ముఖాలకు మాస్కులు వేసుకుని, వాటిని తీసుకెళ్లారు. ఈ తతంగాన్ని ఆ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ALSO READ: కాళ్ల పారాణి ఆరకముందే.. వధువు ప్రమాదంలో మృతి
ఆ ఫుటేజీ ద్వారా నిందితులను పోలీసులు గుర్తించారు. ఆ దంపతులను జేపీనగర పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపై హత్య, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అభియోగాలు మోపారు. ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. బెంగళూరు సిటిలో ఉద్దేశపూర్వకంగా జరిగిన రోడ్డు ప్రమాదమని డిప్యూటీ కమిషనర్ చెప్పారు.
బెంగళూరులో ఘోరం!
డెలివరీ ఏజెంట్ ను కారుతో గుద్దించి చంపేసిన దంపతులు!
కేసు నమోదు చేసి కారులో ఉన్న వారిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు.#RoadRage #Bengaluru #Karnataka # pic.twitter.com/Xf4UfuBeC0
— NageshT (@NageshT93116498) October 30, 2025