Guess The Actress : సెలబ్రిటీల ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నప్పుడు ఫోటోలు లేదా గతంలో తీసుకున్న ఫోటోలు బయటకు వచ్చేస్తున్నాయి. ఈమధ్య ఇలాంటివి ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ హీరోకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ ఫోటోలు కనిపిస్తున్న వ్యక్తి ఒకప్పుడు హీరోగా పలు సినిమాల్లో నటించాడు. అయితే ఏ ఒక్క సినిమా కూడా అతనికి మంచి క్రేజ్ ని అందించలేదు. దాంతో హీరోగా కాకుండా సైడ్ పాత్రలో నటిస్తూ వచ్చాడు. అవి కూడా అతనికి పెద్దగా కలిసి రాలేదు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి లవర్ బాయ్ ట్యాగ్ ను తగిలించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత బిజీ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం చేతుల సినిమాలు లేవు. అది సోషల్ మీడియాలో కూడా ఈ హీరో యాక్టివ్ గా లేరు.. ఒకప్పుడు బొద్దుగా చెబిగా ఉన్న ఈ హీరో ఇప్పుడు కాస్త స్లిమ్ అయ్యి గుర్తుపట్టలేని విధంగా మారాడు.. ఆ హీరో ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అన్నది మనం తెలుసుకుందాం..
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన కొందరు ఈమధ్య హీరోలుగా మరి సక్సెస్ అవుతున్నారు. హనుమన్ సినిమాతో తేజ సజ్జ బ్లాక్ బస్టర్ విజయని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే చాలామంది హీరోలు సినిమాల్లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. కానీ అదృష్టం కొందరిని మాత్రమే స్టార్స్ ని చేసింది. కొంతమంది మాత్రం ఇప్పటికి హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో తనీష్ ఒకరు.. ఆ ఫోటో అతనిదే.. క్యూట్ గా ఉన్న తనీష్ ఇప్పుడు చాలా మారిపోయాడు. గుర్తుపట్టలేనంతగా మారిపోవడంతో చాలామంది తనీష్ ఇతనేనా అని డౌట్ పడుతున్నారు. ఇక నచ్చావులే తో హీరోగా అతని మొదటి సినిమా. బాల నటుడిగా దేవుళ్ళు, మన్మథుడు లాంటి సినిమాల్లో నటించాడు..
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి హీరో ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబర్ దీప్తి సునైనా తో ప్రేమాయణం నడిపించాడు. వీరిద్దరి లవ్ ట్రాక్ సీజన్ కి హైలైట్ గా నిలిచింది. బయటికి వచ్చిన తర్వాత ఎవరికి వారే అన్నట్లు ఎవరి లైఫ్ని వారు లీడ్ చేసుకుంటూ బిజీగా వెళ్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రేమంటే ఇదేరా మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత ‘దేవుళ్లు’, ‘మన్మథుడు’ ఇలా పలు సినిమాల్లో నటించాడు. 2008లో ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగాను సైడ్ క్యారెక్టర్లలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించాడు. చివరిగా 2021లో మరో ప్రస్థానం సినిమాలో నటించాడు.. ఈ హీరో ప్రస్తుతం సినిమాలు చేసినట్లు కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. మరి ఆయన ఏం చేస్తున్నాడు తెలియాల్సి ఉంది.