Illu Illalu Pillalu Today Episode October 30 th : నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా అక్కడ ఉన్న కానిస్టేబుల్ తో మాట్లాడుతారు. ఏంటి ఏమైంది అనేది తెలుసుకోండి బాబాయ్ గారు మీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడుతారు. ఆ కానిస్టేబుల్ అసలు విషయాన్నీ కనుక్కొని వాళ్ళకి చెప్తాడు.. ధీరజ్ అన్నవరానికి క్యాబ్ బుక్ చేసుకుని ఉంది. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలోనే ఆ అమ్మాయిని అల్లరి చేయడం మొదలుపెట్టారు దాంతో అమ్మాయి బాధ పడుతుందని నేనే అమ్మాయిని మళ్లీ వాళ్ళ ఇంటిదగ్గర వదిలి పెట్టాను. అయితే ఆ తర్వాత మిస్సయింది అంటే నాకే అర్థం కావట్లేదు అని ధీరజ్ కానిస్టేబుల్ తో చెప్తాడు అదే విషయాన్ని ప్రేమ నర్మదతో చెప్తారు. వాళ్ల నాన్న వీడే కిడ్నాప్ చేశారు మళ్ళీ వాళ్ళు ఎవరో అని అంటారేంటి ఎందుకు మీకు ఆ నెంబర్స్ అని అడుగుతాడు. మీరు ముందు ఇవ్వండి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగి అమ్మ ఎలా వెళ్లిందో మేము చూసి చెప్తాము అని బ్రతిమలాడుతారు.. ఇక అతను ఆ నెంబర్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు.. ప్రేమ నర్మదా ఈ విషయాన్ని వెంటనే ఇంటికి వెళ్లి అత్తయ్యతో చెప్పాలి అని అనుకుంటారు.. వేదవతితో జరిగిన విషయాన్ని చెప్తారు నేను కూడా మీతో వస్తానని వేదవతి వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు అతని కోసం టిఫిన్ తెచ్చి ఇస్తాడు. నర్మదా ఆడవాళ్ళు ఇలా భయపడ్డామల్లే మగవాళ్ళు రెచ్చిపోతున్నారు.. ఆ అమ్మాయి నీ ఫ్రెండే కదా.. అమ్మాయిని కాపాడాలని నీకు లేదా ముందు ఆ నెంబర్లు చెప్పు అని అనగానే ఆ అమ్మాయి నెంబర్లు ఇస్తుంది.. బయటికి రాగానే నర్మదా ఒకరికి ఫోన్ చేస్తుంది. కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు కదా అని వేదవతి అంటుంది. అప్పుడే అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో నర్మదా మీ నోరుకొక దణ్ణం తల్లి ఏమంటే అదే జరిగిపోతుంది మీరు కాసేపు నోరు మూసుకొని ఉండండి అని అంటుంది..
చిన్న దొంగతనాలు చేసిన వాళ్లే ఊరు వదిలి పారిపోతున్నారు అలాంటిది ఇంత పెద్ద నేరం చేసిన వాళ్ళు ఫోన్ ఆన్ చేసుకుని ఎలా ఉంటారు అని అడుగుతుంది. ఫోను లాస్ట్ కాల్ లొకేషన్ ని పట్టుకొని మనం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు కదా కానీ ప్రేమ సలహా ఇస్తుంది.. ప్రేమ సలహా విన్న వేదవతి నా కోడలు ఎంత మంచిదో నా మేనకోడలు గ్రేట్ అంటూ పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. నర్మదను ఆ లొకేషన్ గురించి తెలుసుకోమని అడుగుతుంది. మొత్తానికి ఆ ఇద్దరు లొకేషన్ ని పట్టుకుంటారు.. ఇక్కడ ఏ ఇంట్లో ఉన్నారో చెప్పండి వాన్ని పట్టుకొని వచ్చి లాక్కొచ్చి మరి ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని వేదవతి అంటుంది.
ఏ ఇంట్లో ఉన్నారు చెప్పడం కష్టం ఏరియా ఒకటి చెప్పడం ఓకే అని నర్మదా అంటుంది.. గవర్నమెంట్ కోడలు వేయండి నువ్వు కూడా ఇలాంటివి చేస్తావ్ ఏంటి ఆ మాత్రం తెలుసుకోలేవా నువ్వు అని వేదవతి చులకన చేసి మాట్లాడుతుంది.. ఆ తర్వాత అందరూ అటు ఇటు వెతుకుతూ ఉండగా ఒక వ్యక్తి కనిపించడంతో అబ్బాయిని చూస్తే మంచి వాడిలా ఉన్నాడు కచ్చితంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చారు అని అడిగితే నిజం చెప్తాడు అని వేదవతి వెళ్లి అడుగుతుంది.. అయితే ఆ అబ్బాయి అవునండి నాకు తెలుసు అని అమాయకంగా మాట్లాడి వాళ్ళని బురిడీ కొట్టిస్తాడు.
నమ్మించి వాళ్ళని వెనకాల తీసుకెళ్లి ఒక ఇంట్లో బంధించేస్తాడు.. ఏంటి బాబు తలుపు రావడం లేదా నువ్వు లోపలికి రావేంటి అని వేదవతి అమాయకంగా అడుగుతుంది. ఇంకా మీకు అర్థం కావట్లేదు అత్తయ్య వాడు లోపల పెట్టి మనల్ని బంధించేశాడు. కిడ్నాపర్స్ లో వీడు కూడా ఒకడు అయ్యుంటాడు అని అనగానే వేదవతి అయ్యో ఇలా ఇరుక్కున్నావ్ ఏంటి అని బాధపడుతూ ఉంటుంది.. మీ వల్ల ఇదంతా జరిగింది వాడు అలాంటివాడు నాకు అర్థం అవుతూనే ఉంది అని నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతిని తిడతారు.
అతని కూడా చూడకుండా అలా తిడతారేంటి..? అక్క మాడకుండా ఉంటుందా ఏంటి? పొరపాటు జరగకుండా ఉంటుందా అని అంటుంది. అదేంటి నర్మదా అత్తయ్య గారిని అలా మాట్లాడుతున్నావ్ ఏంటి అని శ్రీవల్లి బయట నుంచి అడుగుతుంది. ఆ మాట వినగానే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తారు. సాగర్ చందు ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్లి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటారు రామరాజు.. ఏమైంది రా అని అనగానే లాయరు ఏమి చేయలేననిఏమి చేయలేనని చెప్తున్నాడు. మీరు ఒకసారి ఎమ్మెల్యే కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పండి అని అంటారు.
ఎమ్మెల్యే నేను బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తానని అంటాడు.. ఇక సేన సూట్ కేసులో డబ్బులు తీసుకొని ఆ ధీరజ్ ని ఎప్పుడు లాక్ చేసేద్దామని చూసుకుంటున్నాను.. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది పోలీసులకి డబ్బు ఇచ్చి వాడిని శాశ్వతంగా జైలుకే పరిమితం చేయమని చెప్తాను అని అంటాడు. భద్రావతి నీకు ఆశ్రమ అక్కర్లేదు రా వాడు అరెస్టు అయింది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో.. బయటికి రావడం చాలా కష్టమని పోలీసులు చెప్తున్నారు అని భద్రావతి అనగానే సేన సంతోషపడతాడు.
Also Read :పల్లవి పరువు తీసిన కమల్.. ఇంట్లో రచ్చ చేసిన పల్లవి..భానుమతి భోజనం అదుర్స్..
శ్రీవల్లి మాట వినగానే అందరూ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తారు.. అయితే నువ్వు ఇప్పుడు బయట ఉన్నావ్ మేము లోపల ఉన్నాము నీ ముద్దుల కోడల్ని తాళం పగల కొట్టి బయటికి తీసుకు రమ్మని అడుగు అని వేదవతితో అంటారు. అవును కదా నేను ఆ పని చేయొచ్చు కదా మీ ముద్దులు కూడా నేనే మరి అని శ్రీవల్లి అంటుంది. ఇక శ్రీవల్లి తాళం పగలగొట్టగానే నా ముద్దుల కోడలు వి నువ్వే అని వేదవతి శ్రీవల్లిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. మీ ముద్దుల ముచ్చట్లు తర్వాత పెట్టుకోవచ్చు ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతుకుదాం పదండి అని అందరూ కలిసి వెతకడానికి వెళ్తారు. ఒకచోట కూర్చుని ఆకలేస్తున్న కాలు నొప్పులు వస్తున్నా వెతుకుతున్నాం కదా ఆయన దొరకట్లేదు ఏంటి అని శ్రీవల్లి అంటుంది.. ప్రేమ ధీరజ్ ఇవాళ అమ్మాయి రాకుండా ఉంటే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అని ఏడుస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…