E-Paper
Advertisement

ఆ డ్రామా నా వల్ల కాదు.. భాగ్యరాజ్ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!

ఆ డ్రామా నా వల్ల కాదు.. భాగ్యరాజ్ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Urvashi Funeral: ప్రముఖ నటి ఊర్వశి …తన సినిమా జీవితాన్ని మలుపు తిప్పి లైఫ్ ఇచ్చిన ది గ్రేట్ కే. బాగ్యరాజ్ అంత్యక్రియలకి అటెండ్ కాలేదు.దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఆమెకి దాడికి దిగింది. జీవితాన్ని ఇచ్చిన గురువు చనిపొతే కనీసం చూడటానికి కూడా వెళ్ళనంత బిజీ అయిపోయావా అంటూ ఏకి పారేశారు.ఇలా తను వెళ్ళకూడదు అని తీసుకున్న నిర్ణయం నెట్టింట మంటలు పెట్టడంతో ఈ విషయంపై ఎమోషనల్ అవుతూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.

ఫ్రీజర్ బాక్సులో చూసే ధైర్యం చేయలేకే

Advertisement

తనకి లైఫ్ ఇచ్చిన బాగ్యరాజ్ గారు చనిపోయాడనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయానని,ఇక ఆయన్ని అలా నిర్జీవంగా ఫ్రీజర్ బాక్సులో చూసే ధైర్యం చేయలేకే అక్కడికి తాను వెళ్లలేదని తన మనసులోని మాటలని బయటపెట్టింది. అసలే తానూ చాలా ఎమోషనల్ అని,ఒకవేళ తానూ గనుక అక్కడికి వెళ్తే తనని తానూ అస్సలు కంట్రోల్ చేసుకోలేనని, అలా ఏడ్చి మీడియా ముందు డ్రామా క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదని అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది.

also read:రోజుకు 12 బాటిళ్ళు..వ్యసనానికి బానిసై..45 ఏళ్లకే తనువు చాలించిన విలక్షణ నటుడి కన్నీటి గాథ!

Advertisement

ఇక బాగ్యరాజ్ గారి కోరిక కూడా తానూ ఎప్పుడు నవ్వుతూ,నవ్విస్తూ ఉండటమే అని, తన కంటి నుండి కన్నీరు రావడం ఆయనకీ అసలు ఇష్టముండదని తెలిపింది.
తనకి గుర్తు ఉన్నంతవరకు ఆయన కోటు వేసుకొని ఉన్న రూపం తన మనసులో అలా నిలిచిపోవాలని,ఫ్రీజర్ బాక్సులో విగతజీవిగా చూడటం తన వల్ల కాదని మనసులోని ఆవేదనతో చెప్పుకొచ్చింది.

తొలిసారి వెండితెరకి పరిచయం చేసింది భాగ్యరాజానే 

ఇక ఊర్వశి, బాగ్యరాజ్ ల బంధం విషయానికి వస్తే ఇది ఎంతో స్పెషల్ అని చెప్పాలి.ఊర్వశిని తొలిసారి వెండితెరకి పరిచయం చేసింది బాగ్యరాజా గారే. అవును..1983లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘ముంధానై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’)తో తొలిసారి ఎంట్రీ ఇచ్చింది ఊర్వశి.ఆ సినిమాలో పరిమళం అనే పాత్రలో ఊర్వశి పండించిన అమాయకత్వం, నటన ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.అలా మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్నఊర్వశి ఆ తర్వాత భాగ్యరాజ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇలాంటి సెంటిమెంట్స్ ఇండస్ట్రీలో కామన్ 

అయితే ఊర్వశి ‘నేను అలా ఆయన్ని చూడలేను’అని చెప్పడంతో కొందరు ఆమె నిర్ణయానికి సపోర్ట్ చేస్తుంటే మరికొందరు వీలు చేసుకోలేక రాలేదని చెప్పొచ్చుగా అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్స్ గతంలో కూడా ఉన్నవే. టాలీవుడ్ కింగ్ నాగ్ కూడా నేను ఎవరైనా చనిపోతే వెళ్లనని, అలా నిర్జీవంగా వాళ్ళు అలా ఉండటం తానూ చూడలేనని, బతికి ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారో అదే మొహాన్ని తన మనసులో గుర్తు పెట్టుకుంటానని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. మొత్తానికి తన గురువు పై ఉన్న అమితమైన గౌరవంతోనే ఊర్వశి చూడడానికి వెళ్లలేదన్న మాట !

also read:శ్రీరాముడి లుక్‌లో సూపర్‌స్టార్? ‘వారణాసి’ బర్త్‌డే గ్లింప్స్‌పై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

Related News

‘ఇరుముడి’ థియేటర్లపై ఎగ్జిబిటర్ల ఆవేదన.. న్యాయమేనా?

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

నాని ‘ ప్యారడైజ్ ‘ కు ఆ టైం ఉండదా? ఇదేం ట్విస్ట్ మావా..

‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

ఇదేం ప్రమోషన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..  కిల్లింగ్ లుక్ లో హాట్ బ్యూటీ..

Big Stories

Advertisement
×