Varanasi Update: అన్నీ వస్తున్నాయ్ ..వారణాసి నుండి అసలైన అప్ డేట్ తప్ప.అప్పుడెప్పుడో రుద్ర గ్లిమ్ప్స్ వదిలి మురిపించిన జక్కన్న ఇక దానితోనే సర్దుకొండి అన్నట్టుగా అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క అప్ డేట్ కూడా వదలలేదు.దీంతో మళ్ళీ మా ఆకలి తీర్చే ఆ అసలైన అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసెలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఈ సినిమా RRRవంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తుండటంతో అంచనాలు స్కై లెవెల్ లో పెట్టేసుకున్నారు ఫ్యాన్స్.ఇక మీడియా కూడా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ విజువల్ వండర్ అంటూ తెగ ఊదరగొట్టేస్తుంది.కానీ ఆ అసలైన అఫీషియల్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో ఆ శ్రీ రాముడికే తెలియాలి.
ఇక అడపా దడపా పలు ఇంటర్వ్యూలలో జక్కన్న వదులుతున్న లీక్స్ బట్టి ఈ సినిమా షూటింగ్ లో దాదాపు 80 శాతం కంప్లీట్ అయిందని,మిగతా 20 శాతం ప్యాచ్ వర్క్ ని కూడా ఈ ఏడాది ఆక్టోబర్ నాటికే ఎట్టి పరిస్థితితుల్లో కంప్లీట్ చేయాలని తెగ కష్టపడిపోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ అద్దడం కోసం ఇప్పటికే హాలీవుడ్ గ్రాఫిక్ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగారు.అంతా బాగానే ఉంది.కానీ ఇలా ఆ లీకులు ఈ లీకులు కాకుండా మామలు ఆడియన్స్ కి అర్థం అయ్యేలా ఒక చిన్న పోస్టర్ అయినా వదులుతారా లేదా అంటూ తలలు పట్టుకున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.అప్పుడెప్పుడో పోయిన బర్త్ డే కి ‘రుద్ర’ ప్రీ-గ్లింప్స్ అంటూ వదిలారు.అసలు రామాయణానికి ఈ గ్లింప్స్ ఎలా కనెక్ట్ చేశాడో తెలుసుకుందామంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక చిన్న ముక్క కూడా వదలలేదు జక్కన్న.
ఇక వచ్చే నెల ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే కానున్న సందర్భంలో అందరి కళ్ళు వారణాసి నుండి వచ్చే అప్ డేట్ పైనే ఉన్నాయి. ఒక వైపు సోషల్ మీడియాలో మహేష్ బాబు శ్రీరాముడి గెటప్‌లో ఉన్న ఫ్యాన్-మేడ్ ఎడిటింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు తెగ సర్క్యులేట్ అవుతున్నాయి,మరికొందరు ఏకంగా మహేష్ శ్రీరాముడి గెటప్ లో ఉన్న విగ్రహాలు చేయించేస్తున్నారు కూడా.ఒకరకంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ చేత పోస్టర్ డిజైన్స్ చేయించుకున్న క్రెడిట్ జక్కన్నదేనేమో.మరి ఘట్టమనేని అభిమానులు ఆశపడుతున్నట్టుగా మహేష్ శ్రీరాముడి గెటప్ లో ఉండే అఫీషియల్ లుక్ లేదా మూవీ నుండి ఏదైనా సాలిడ్ గ్లింప్స్ వదులుతారా లేక సింపుల్ గా హ్యాపీ బర్త్ డే మహేష్ అని సింపుల్ గా పోస్టర్ వేసి చేతులు దులుపుకుంటారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.
ఒకవేళ అభిమానుల కోరికని నెరవేరుస్తూ గ్లింప్స్ వదిలితే మాత్రం సోషల్ మీడియా షేక్ అయిపోవడం కాయం.
ఇక ఈ సినిమా కోసం ఆస్కార్ విన్నర్ ఇప్పటికే క్రేజీ ట్యూన్స్ కడుతున్నారట.మరో వైపు వచ్చే ఏడాది 2027 ఏప్రిల్ 7న తెలుగు,ఇంగ్లీష్ మాత్రమే కాకుండా చైనీస్, జపనీస్ బాషలలో కూడా ఈ సినిమా రిలీజ్ అవబోతుందంటూ వినిపిస్తుంది.మరి మగదీర ,ఈగ, బాహుబలి, RRR వంటి విజువల్ వండర్స్ తో సత్తా చాటిన జక్కన్న ఎలాంటి మ్యాజిక్ ఈ సినిమాతో చేస్తాడో చూడాలి. ఏది ఏమైనా జక్కన్నా.. ఆ ప్యాచ్ వర్క్ పంచాయితీలు ,గ్రాఫిక్స్ గలాటలు ఎప్పుడూ ఉండేవే కాని ఈ బర్త్ డేకేనా కరుణించి సాలిడ్ అప్ డేట్ వదలవూ !
also read:16 ఏళ్ళ వయసులో ఎన్‌సీసీ క్యాంప్‌లో ప్రేమ.. అనసూయ రియల్ లైఫ్ బయోపిక్!