E-Paper
Advertisement

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. లోపం ఉంటేనే స్టోరీ సక్సెస్ అవుతుందా.. మరి అఖిల్ సంగతేంటి?

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. లోపం ఉంటేనే స్టోరీ సక్సెస్ అవుతుందా.. మరి అఖిల్ సంగతేంటి?
Advertisement

Tollywood:సినిమాలో హీరో అంటే క్లైమాక్స్ లో విలన్ ని ఓడించి, విజేతగా నిలవడమే. స్టోరీ ఎలా ఉన్నా సరే క్లైమాక్స్లో కథ సుఖాంతం అవ్వాలి. ఇదే నాటి ఆడియన్స్ కి తెలిసిన కథ.. ఒకవేళ సినిమా ఎండింగ్ లో హీరో చనిపోయినా లేదా హీరోకి న్యాయం జరగకపోయినా ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చేది కాదు. అయితే ఇప్పుడు కంటెంట్ పై ఆడియన్స్ దృష్టి పూర్తిగా మారిపోయింది. సినిమాలో విజయం కోసం హీరో చనిపోయినా పర్వాలేదు.. కంటెంట్ బాగుంటే ఆ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో దర్శకులు ఎక్కువగా తమ రూటు మార్చుకున్నారనే చెప్పాలి. సినిమాలో హీరోను చంపేయడం కంటే సినిమాలో హీరోకి ఏదో ఒక లోపం పెట్టి స్టోరీని సక్సెస్ దిశగా ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా హీరోకి లోపం ఉంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా.. తాజాగా అలా విడుదలైన చిత్రాల ఫలితాలను చూస్తే మాత్రం ఇది నిజమనే అనిపిస్తుంది. పైగా అలా లోపంతో వచ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

చెవిటి వాడి పాత్రలో అదరగొట్టేసిన రామ్ చరణ్..

ఉదాహరణకు.. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం రంగస్థలం. ఇందులో హీరోకి చెవుడు.. రామ్ చరణ్ ఇందులో చిట్టిబాబు పాత్రలో చెవిటి వాడిలా అద్భుతమైన నటన కనబరిచి అందరిని ఆశ్చర్యపరిచారు .పైగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని, పలువురు సినీ ప్రముఖులు కూడా భావించారు. అలా ప్రేక్షకుల ముందుకు 2018లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది

కాలు తీసేసినా..సినిమాను భుజాలపై మోసిన చెర్రీ..

Advertisement

ఇకపోతే రామ్ చరణ్ ఇటీవల బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చేసిన పెద్ది సినిమా కూడా అంతే. ఈ సినిమాలో హీరోకి ఏకంగా కాలు తీసేశారు. ఇక ఈ సినిమా కూడా సుమారుగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది

మ*ర్మాంగా*లు కట్ చేసినా.. రూ.100 కోట్ల క్లబ్ లోకి మెగా మేనల్లుడు..

ఇక ఈ రెండే కాదు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ఉప్పెన. ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించింది ఇక ఈ సినిమా క్లైమాక్స్లో హీరోకి మ*ర్మాంగా*లు కట్ చేస్తారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

ALSO READ:యూట్యూబ్లో హీట్ పుట్టిస్తున్న ‘తబాహీ’.. ఈ బోల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి యష్!

హీరోయిన్ మరణం.. అంధుడిగా అఖిల్ మెప్పిస్తాడా?

ప్రస్తుతం అందరి దృష్టి లెనిన్ పైనే. గత కొన్ని సంవత్సరాలుగా సరైన సక్సెస్ కోసం ఆరాటపడుతున్న అఖిల్ ఈసారి ఎలాగైనా సరే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పైగా మూడేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది . అందుకే పట్టుదలతో, కసితో లెనిన్ సినిమాతో జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మరో కొత్త అఖిల్ ని చూస్తారు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.

ఇక ప్రస్తుత ట్రెండ్ ను దృష్టిలో పెట్టుకొని కథను రాసుకున్న మురళీ కిషోర్ అబ్బూరి.. ఈ సినిమా ఇంటర్వెల్ లో హీరోయిన్ చనిపోయేలా ప్లాన్ చేశారట.అలాగే ఫ్లాష్ బ్యాక్ లో హీరోకి కళ్ళు కనిపించవు. మరి గుడ్డిగా ఉన్న టైంలో అసలు ఏం జరిగింది?అనేది స్టోరీ అట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అటు హీరోయిన్ చనిపోవడం ఇటు అంధుడిగా హీరో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోబోతున్నారు తెలియాలి అంటే జూలై 10 వరకు వెయిట్ చేయాల్సిందే.. నిజానికి చాలా సినిమాలకు విడుదల రోజు కంటే ముందే ప్రీమియర్స్ వేస్తారు. కానీ ఎందుకు ఈ సినిమాకి ప్రీమియర్స్ వెయ్యలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే మేకర్స్ స్పందించాల్సిందే… మొత్తానికైతే ట్రెండీ సెంటిమెంట్ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అఖిల్ ఈ స్టోరీ తో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.

Related News

యూట్యూబ్లో హీట్ పుట్టిస్తున్న ‘తబాహీ’.. ఈ బోల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి యష్!

పవన్ కళ్యాణ్ చిన్నారి అభిమాని నిరంజన్ మృతి!

కన్నప్ప బ్యూటీ బాగా బిజీ.. మరీ ఈ క్రేజ్ ఏంటి గురూ!

వేధించేవాడు.. అహంకారపు మాటలు భరించలేకపోయా.. అంజలి షాకింగ్ కామెంట్!

బ్యాన్ చేసినా బలుపు తగ్గలేదు. ప్రకాష్ రాజ్ తీరుపై మరో నటుడు షాకింగ్ కామెంట్!

Upcoming Movies in Theater : ఈ వారంలో థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..డోంట్ మిస్..

Venuswamy : ఎన్టీఆర్ నుంచి రాజమౌళి వరకు.. సెలబ్రిటీల జోస్యం చెప్పిన వేణుస్వామి..

Big Stories

Advertisement
×