E-Paper
Advertisement

చిన్నారి అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

చిన్నారి అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
Advertisement

Pawan Kalyan: వరంగల్ జిల్లా హనుమకొండ లోని హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే పవన్ కళ్యాణ్ చిన్నారి అభిమాని గత దశాబ్ద కాలంగా డ్యూచన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన జన్యుపర వ్యాధితో బాధపడుతూ.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయంపై నెటిజన్లు, జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు పెద్ద ఎత్తున సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో ఆయన కన్నీటి పర్యంతమవుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

అభిమాని మృతిపై పవన్ కళ్యాణ్ కన్నీళ్లు..

“నిరంజన్ ఇక లేరు అనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలిచి వేసింది. కొన్ని రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే.. నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు.. ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. అతని శరీరం వ్యాధితో పోరాడినా.. అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా.. జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..

Advertisement

ప్రియమైన నిరంజన్.. నువ్వు చూపించిన చిరునవ్వు , ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ, నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ పవన్ కళ్యాణ్ ద్రవిస్తున్న హృదయంతో నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పోస్ట్ షేర్ చేశారు.

ALSO READ:అమీర్ ఖాన్ మూడో పెళ్లిలో గౌరీ మెడలో మెరిసిన నిజామీ పఠానీ హార్.. ఖరీదు ఎంతంటే?

చిన్నారి అభిమానిని కలిసిన కొన్నాళ్లకే విషాదం..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ఏడేళ్ల వయసు వరకూ చక్కగా అందరితో పాటే ఆడుకుంటూ.. పాడుకుంటూ తిరిగిన ఒక చిన్నారి జీవితానికి అరుదైన వ్యాధి పెను సంకటంగా మారింది.జన్యు పరమైన వ్యాధి సోకడంతో అప్పటివరకు ఆడుకున్న ఆ చేతులు, ఎగిరిన ఆ కాళ్లు ఒక్కసారిగా మంచానికే పరిమితమయ్యేలా చేశాయి. శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడుతూ ఆ చిన్నారిని మంచానికే కుదిపేసాయి. ఇక ఆ వ్యాధి బారిన పడ్డ నిరంజన్ పవన్ కళ్యాణ్ ను చూడాలని ధైర్యంతో దశాబ్ద కాలానికి పైగా ఆ వ్యాధితో పోరాడుతూ వచ్చారు. కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, సోషల్ మీడియా సహాయంతో ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో.. గత నెల 17వ తేదీన నిరంజన్ ఇంటికి స్వయంగా వచ్చి నిరంజన్ ను కలిశారు పవన్ కళ్యాణ్. అభిమానిని పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆర్థికంగా సహాయం కూడా చేశారు. అంతేకాదు కలసి ఓజి 2 సినిమా చూద్దామని హామీ కూడా ఇచ్చారు. ఇక ఆ కోరిక నెరవేరకుండానే నిరంజన్ మరణించాడు.

Related News

మల్లె పూల పల్లకి వెనుక ఇంత కథ ఉందా?

‘ఇరుముడి’ థియేటర్లపై ఎగ్జిబిటర్ల ఆవేదన.. న్యాయమేనా?

చిరంజీవి డేట్ పై త్రివిక్రమ్ కన్ను!

బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ నక్షత్ర.. హీరోయిన్ గా తొలి ఛాన్స్?

నాని ‘ ప్యారడైజ్ ‘ కు ఆ టైం ఉండదా? ఇదేం ట్విస్ట్ మావా..

‘వారణాసి’ మూవీకి అలాంటి లేవట.. అసలు జక్కన్న ప్లానేంటబ్బా..?

బేబీ నక్షత్ర జీవితంలో ఇంత విషాదమా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్!

రవితేజ ‘ఇరుముడి’ వివాదం.. ఆ ఒక్కటే డైరెక్టర్ మిస్టేకా..?

Big Stories

Advertisement
×