Xiaomi Mi Smart Band 6 Review: ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ పెరిగిందా? రోజూ ఎన్ని స్టెప్స్ వేస్తున్నాం, హార్ట్ రేట్ ఎలా ఉందో ట్రాక్ చేయాలనుకుంటున్నారా? అయితే.. మార్కెట్లో ఫిట్‌నెస్ బ్యాండ్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన షియోమి నుంచి వచ్చిన Xiaomi Mi Smart Band 6 మీ కోసమే! కేవలం రూ.3,699 ధరలో లభించే ఈ స్మార్ట్ బ్యాండ్‌లో లార్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 2 వారాల భారీ బ్యాటరీ లైఫ్ , స్పెషల్ విమెన్స్ హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లేటెస్ట్ ట్రెండ్స్‌కు అనుగుణంగా యూత్ మెచ్చే ఈ ఫిట్‌నెస్ పార్ట్‌నర్ కంప్లీట్ రివ్యూ ఇప్పుడు చూసేద్దాం.
పాత మోడల్స్‌తో పోలిస్తే.. ఇందులో డిస్‌ప్లే సైజ్ పెంచారు. 1.56 ఇంచుల (3.96 cm) లార్జ్ AMOLED కలర్ డిస్‌ప్లే ఉండటం వల్ల ఎండలో కెళ్లినా సరే స్క్రీన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దీని క్రిస్ప్ కలర్స్ , బెజెల్-లెస్ లుక్ చేతికి కట్టుకుంటే చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఉంటుంది.
ఈ బ్యాండ్‌కు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ. ప్రతి రోజూ ఛార్జింగ్ పెట్టాలనే తలనొప్పి అస్సలు ఉండదు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. నార్మల్ యూసేజ్‌లో ఏకంగా 2 వారాల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. దీని మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ ఫీచర్ వల్ల స్ట్రాప్ తీయకుండానే.. ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.
మీరు జిమ్‌కి వెళ్లినా, రన్నింగ్ చేసినా, జుంబా డాన్స్ చేసినా.. అన్నింటికీ ఇందులో ట్రాకర్స్ ఉన్నాయి. ఏకంగా 30 రకాల ఫిట్‌నెస్ మోడ్స్ ఇందులో ఇచ్చారు. పైగా ఇది 5 ATM వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తుంది. అంటే 50 మీటర్ల లోతు నీటిలో కూడా ఇది పాడవదు. స్విమ్మింగ్ చేసేవాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
మీ హెల్త్ కేర్ కోసం ఇందులో.. అడ్వాన్స్‌డ్ సెన్సార్లు ఉన్నాయి. రక్తంలో .. ఆక్సిజన్ శాతాన్ని చూపే SpO2 ట్రాకింగ్, రోజంతా హార్ట్ రేట్ గమనించే HR మానిటరింగ్, మీ నిద్ర నాణ్యతను అంచనా వేసే స్లీప్ మానిటరింగ్ ఫీచర్లు కచ్చితమైన డేటాను అందిస్తాయి.
Also Read: రూట్ చూపిస్తుంది.. QR కోడ్ స్కాన్ చేస్తుంది! boAt Storm Call 3 ఫీచర్లు నెక్స్ట్ లెవెల్!
అమ్మాయిల కోసం ఇందులో.. ఒక సూపర్ ఫీచర్ ఉంది. మహిళల పీరియడ్స్ సైకిల్ ట్రాక్ చేయడానికి, ఓవ్యులేషన్ డేస్ గుర్తు చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. దీంతో పాటుగా అల్ట్రా-స్మార్ట్ అలారమ్, మ్యూజిక్ కంట్రోల్ ,ఫోన్ కెమెరా షట్టర్ కంట్రోల్స్ కూడా ఇందులో ఉన్నాయి.
రోజూ ఛార్జింగ్ పెట్టే ఓపిక లేక, పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ అండ్ హెల్త్ ట్రాకింగ్ కావాలనుకునే వారికి.. Xiaomi Mi Smart Band 6 ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. రూ.3,700 లోపు బ్రాండెడ్ అమొలెడ్ ఫిట్‌నెస్ ట్రాకర్ కావాలంటే దీనికి కళ్ళు మూసుకుని ఓకే చెప్పేయొచ్చు.