E-Paper
Advertisement

రోజుకు 12 బాటిళ్ళు..వ్యసనానికి బానిసై..45 ఏళ్లకే తనువు చాలించిన విలక్షణ నటుడి కన్నీటి గాథ!

రోజుకు 12 బాటిళ్ళు..వ్యసనానికి బానిసై..45 ఏళ్లకే తనువు చాలించిన విలక్షణ నటుడి కన్నీటి గాథ!
Advertisement

Kalabhavan Mani:కళాభవన్ మణి.. సిల్వర్ స్క్రీన్ పై విలనిజాన్ని తనదైన స్టైల్ లో సరికొత్త పుంతలు తొక్కించిన వెర్సటైల్ యాక్టర్ .విక్రమ్ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన జెమిని సినిమాలో ఆయన పండించిన నెగటివ్ రోల్ ని  ఇప్పటికీ మూవీ లవర్స్ మర్చిపోలేరు.అలాంటిది కేవలం 45 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన చనిపోవడం ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి కోలుకోలేని  దెబ్బ.

కేరళలోని త్రిస్సూర్ జిల్లా చలకుడిలో ఒక సాధారణ కుటుంబంలో రామన్ మణిగా జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే కళలపై ఇష్టం పెంచుకున్నాడు.మిమిక్రీ, నటన, గానం పై ఉన్న ఇష్టంతో కొచ్చిన్‌లోని ప్రసిద్ధ ‘కళాభవన్’ థియేటర్ గ్రూప్‌లో చేరాడు.ఆ వేదికే ఆయనకు ‘కళాభవన్ మణి’ అనే శాశ్వత గుర్తింపును ఇచ్చింది.కెరీర్ తొలినాళ్ళలో  తమిళంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన ‘కళాభవన్ మణి ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి మలయాళం లో హీరోగా ఎదిగి టాప్ లీగ్ లోకి దూసుకుపోయాడు.

అవార్డు (స్పెషల్ జ్యూరీ) అందుకున్న అరుదైన నటుడు 

Advertisement

‘వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్జానుమ్’ సినిమాలో గుడ్డివాడైన గాయకుడిగా ఆయన నటనకు నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపు దక్కింది.మలయాళ సినీ ఇండస్ట్రీలో జాతీయ చలనచిత్ర అవార్డు (స్పెషల్ జ్యూరీ) అందుకున్న అరుదైన నటుడిగా ఆయన చరిత్ర సృష్టించాడు మణి.ఇక ఈ సినిమానే తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమాగా రీమేక్ చేశారు RP పట్నాయక్.ఇక  కేవలం మాలీవుడ్ కే పరిమితం కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్‌లలోనూ తనదైన ముద్ర వేశాడు మణి.

ఇక తెలుగులో వెంకటేష్ జెమిని సినిమాతో పాటు మహేష్ బాబు అర్జున్, ఎన్టీఆర్ నరసింహుడు, రాజశేఖర్ ఆయుధం’ సినిమాల్లో కీరోల్స్ పోషించాడు మణి. రజనీకాంత్, కమలహాసన్,చిరంజీవి, మాధవన్ వంటి టాప్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ బెస్ట్ యాక్టర్ గా ఎదిగాడు.అంతే వందకు పైగా   జానపద మరియు సినిమా పాటలు పాడి మంచి ప్లేస్ బ్యాక్ సింగర్ గానూ మెప్పించాడు.ఇలా సినీ రంగంలో టాప్ విలన్ గా క్రేజ్ తెచ్చుకున్న మణి లో ఇంకో కోణం కూడా ఉంది.అదే నిరుపేదలకు సహాయం చేయడం.

Advertisement

ప్రతిరోజూ  వచ్చే ఆర్తులకు  అందించడమే కాకుండా, ఖర్చు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. అయితే సమాజానికి సాయం చేసిన ఆ చేతులే, ఒక వ్యసనానికి బానిసై తన స్వంత ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోయాయి.ప్రతిరోజు పదుల సంఖ్యలో వచ్చే పేదలకు ఆయన ఆర్థిక సాయం  అందించడమే కాకుండా తన వ్యక్తిగత సహాయకుడి కాలేయ మార్పిడి చికిత్స కోసం ఏకంగా పది లక్షల రూపాయలు పెట్టాడట మణి .

2016 మార్చి 3న చలకుడిలోని సొంత ఫామ్‌హౌస్‌లో మృతి 

అయితే ఇంత చేసిన మణి తన ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోలేకపోయాడు.అవును కెరీర్ పరంగా పీక్స్ చూసిన కళాభవన్ మణి  2016 మార్చి 3వ తేదీన చలకుడిలోని తన సొంత ఫామ్‌హౌస్‌లో హఠాత్తుగా అపస్మారక స్థితిలో పడి ఉండటం  స్థానికంగా సంచలనం స్ప్రుష్టించింది. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ ట్రీట్మెంట్ పొందుతూ మార్చి 6న ఆయన తుది శ్వాస విడిచారు.అయితే ఈ సడెన్ డెత్ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసిందని చెప్పాలి.

also read:800 సినిమాలు.. కోట్ల ఆస్తి.. కానీ చివరికి ఆ నటి జీవితం ఎందుకలా ?

‘ఆయన ఎదుగుదలను ఓర్వలేక  కొందరు శత్రువులు పథకం ప్రకారం చేసి చంపేశారు’ అంటూ సోషల్ మీడియాలో మరియు మీడియాలో అనేక రూమర్స్ లేదా స్ప్రెడ్ అయ్యాయి. అయ్యాయి అయితే ఈ హై ప్రొఫైల్ కేసుని కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ ఆదేశించింది.చేదించే బాధ్యతను ప్రముఖ ఐపీఎస్ అధికారి ఉన్నిరాజన్ అధికారి నేతృత్వంలో బృందానికి అప్పగించింది.

పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు బయటికి వచ్చాయి.కళాభవన్ మణి  వెనుక ఎలాంటి కుట్రలు లేవని తేలిపోయింది.ఆయనకు చాలా కాలంగా ఉన్న డ్రింకింగ్ అలవాటే  ప్రాణాలు తీసింది అని స్పష్టం చేశాయి.రోజుకు 12 నుండి 13 బాటిల్ల బీర్ తాగే అలవాటున్న మణికి  కాలేయం పూర్తిగా దెబ్బతిందని వైద్యులు ముందే హెచ్చరించారు కూడా.అయినప్పటికీ ఆయన అలవాటును కంట్రోల్ చేసుకోలేకపోయారు .

జీవితాన్ని మధ్యలోనే ముగించడం నిజంగా బాధాకరం

మరణానికి ముందు రోజు రాత్రి కూడా ఫామ్ హౌస్ లో కొందరు స్నేహితులు స్నేహితులుతో కలిసి ఆయన భారీగా మద్యం తాగినట్టు దర్యాప్తులో తేలింది.ఇక డెడ్  బాడీకి నిర్వహించిన  పోస్టుమార్టం మరియు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలలో  ఆయన శరీరంలో ప్రమాదకరమైన మిథైల్ ఆల్కహాల్ మరియు కొన్ని రసాయన అవశేషాలు లభ్యమయ్యాయి.కాలేయం పూర్తిగా విఫలం కావడంతో పాటు శరీరంలోకి చేరిన మిథైల్ ఆల్కహాల్ టాక్సిసిటీ  కారణంగానే ఆయన ఇన్నర్ ఆర్గాన్స్  దెబ్బతిని మరణించారని ఐపీఎస్ అధికారి ఐపీఎస్ అధికారి ఉన్నిరాజన్ కేస్ ని క్లోజ్ చేశారు వెండితెరపై నవరసాలు పలికించగల అద్భుతమైన నటుడు ఇలా తాగుడుకు అలవాటై  తన జీవితాన్ని మధ్యలోనే ముగించడం నిజంగా బాధాకరం!

Related News

ఆ డ్రామా నా వల్ల కాదు.. భాగ్యరాజ్ అంత్యక్రియలకు వెళ్లకపోవడంపై ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ పై విమర్శలు గుప్పించిన సోనాలి బింద్రే.. టాలీవుడ్ ఎంతో బెటర్ అంటూ!

చిన్నారి అభిమాని నిరంజన్ మృతిపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!

అమీర్ ఖాన్ మూడో పెళ్లిలో గౌరీ మెడలో మెరిసిన నిజామీ పఠానీ హార్.. ఖరీదు ఎంతంటే?

శ్రీరాముడి లుక్‌లో సూపర్‌స్టార్? ‘వారణాసి’ బర్త్‌డే గ్లింప్స్‌పై ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్.. లోపం ఉంటేనే స్టోరీ సక్సెస్ అవుతుందా.. మరి అఖిల్ సంగతేంటి?

యూట్యూబ్లో హీట్ పుట్టిస్తున్న ‘తబాహీ’.. ఈ బోల్డ్ పర్ఫార్మెన్స్ ఏంటి యష్!

Big Stories

Advertisement
×