E-Paper
Advertisement

Rajya Sabha: ఏపీలో మొదలైన రాజ్యసభ రేస్.. పెద్దల సభకు ఓ యువనేత..?

Rajya Sabha: ఏపీలో మొదలైన రాజ్యసభ రేస్.. పెద్దల సభకు ఓ యువనేత..?
Advertisement

Rajya Sabha: నేటి రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొడుకులు అంటే నేరుగా ఎమ్మెల్యే పదవులనో, ఎంపీ సీట్లనో ఆశిస్తారు. కానీ చింతకాయల విజయ్ గారి ఆలోచన వేరు, ఆయన పంథా వేరు. ఆయనకు పదవుల కంటే తనను నమ్ముకున్న కార్యకర్తల ధైర్యమే ముఖ్యం! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలు తారాస్థాయికి చేరినప్పుడు, కార్యకర్తలను భయపెట్టి అణచివేయాలని చూస్తున్న సమయంలో.. ఎవరూ ముందుకు రావడానికి సాహసించని ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన క్యాడర్‌లో ధైర్యం నింపడానికి తన సొంత తమ్ముడిని వార్డు మెంబర్‌గా పోటీ చేయించారు. ఒక ఉన్నత విద్యావంతుడు, పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి కూడా, కేవలం కార్యకర్తలకు “మేము మీ వెంటే ఉన్నాం, చిన్న పదవైనా సరే మీతో కలిసి పోరాడతాం” అని నిరూపించిన గొప్ప మనసు ఆయనది.

యువనేత చింతకాయల విజయ్..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే తెలంగాణ, బిహార్, హర్యానా, తమిళనాడుకు చెందిన రాజ్యసభకు సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. తాజాగా ఏపీలో జూన్ లో రాజ్యసభకు సంబంధించిన నోటికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీలో రాజ్యసభ రేసులో అనూహ్యంగా నారా లోకేష్ కు చెందిన యువనేతకు ఖచ్చితంగా రాజ్యసభ సీటు దక్కవచ్చనే వార్తలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత అనే విషయానికొస్తే.. దేశ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన రాజ్యసభ స్థానాలకు జూన్ లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్విలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Also Read: TG Education Reform: విద్యాశాఖలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక.. ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి..!

జనసేన అభ్యర్ధులు..

ఇక ఏపీలో రాజ్యసభకు వైఎస్సార్‌సీపీకి చెందిన అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వానీ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అలాగే తెలుగు దేశం పార్టీకి చెందిన సానా సతీష్‌బాబు తమ పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఈ నాలుగు స్థానాలూ రాబోయే ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలకే దక్కనున్నాయి. అయితే ఈ నాలుగు సీట్లలో రెండు తెలుగు దేశం పార్టీ, చెరో ఒకటి బీజేపీ, జనసేన అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నట్టు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీకి దక్కే రెండు రాజ్యసభ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. అటు సీనియర్లు, ఇటు జూనియర్లు మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. అయితే సానా సతీష్ కు మరోసారి రాజ్యసభ సీటు తిరిగి రెన్యూవల్ చేయనున్నారు. అటు మరో సీటు కోసం తెలుగు దేశం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీలో మంత్రి నారా లోకేష్ టీమ్ మెంబర్స్ చుట్టే తిరుగుతుంది. ఈ సారి రాజ్యసభ బరిలో చింతకాయల విజయ్, కీలారు రాజేష్, మహాజన్ రాజేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

టీడీపీ అంతర్గత వర్గాలు

Advertisement

ముఖ్యంగా నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే చింతకాయిల విజయ్ పేరు రేసులో ముందుందనేది టీడీపీ అంతర్గత వర్గాలు చెబుతున్న మాట. ముఖ్యంగా రాజ్యసభ సీటు ఎన్నికల్లో కులాలు, ప్రాంతాలు, సామాజిక సమతుల్యం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొనున్నారు. ఇక చింతకాయల విజయ్.. ఆంధ్ర ప్రదేశ్ శాసన స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడిగా తెలుగు దేశం పార్టీలో ముందు నుంచి చురుకుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీలో నైపుణ్యాలు ఢిల్లీ రాజకీయాల్లో పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఆయన్ని పెద్దల సభకు పంపడం ద్వారా తెలుగు దేశం పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతం ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. పైగా సామాజిక సమీకరణాలు వన్ని కలిసొచ్చే అంశాలని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. ముఖ్యంగా నాయకత్వానికి నమ్మకస్థుడిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఆయన పేరు మొదటి ప్రాధాన్యంగా వినిపిస్తోంది.

Also Read: BRS Rivalry: సోషల్ మీడియాలో.. బావ బామ్మర్దుల పోటాపోటీ ట్వీట్లు!

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×