Varalakshmi Sarath Kumar..వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణమైన నటనతో జూనియర్ రమ్యకృష్ణగా పేరు సొంతం చేసుకుంది. హీరోయిన్ గా సత్తా చాటాలనుకున్న ఈమె..అక్కడ సక్సెస్ కాలేక టాలీవుడ్ లో లేడీ విలన్ గా అవతరించింది. ఇక్కడ పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోలకు లక్కీ లేడీగా మారిపోయింది. దాదాపుగా సీనియర్ హీరోలను మొదలుకొని జూనియర్ హీరోల వరకు అందరి సినిమాలలో నటించి, అందరికీ సక్సెస్ అందించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా కెరియర్ పీక్స్ లో ఉండగానే తన ప్రియుడు నికోలయ్ సచ్ దేవ్(Nikolay Such Dev)తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక వివాహం అనంతరం కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
లగ్జరీ కారుతో భార్యను సర్ప్రైజ్ చేసిన నికోలయ్..
అయితే ఇప్పుడు ఆ ప్రేమను రెట్టింపు స్థాయిలో చూపించారని తెలుస్తోంది. తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఒక లగ్జరీ కారును బహుమతిగా అందించారు. ముఖ్యంగా ఆమె ఉంటున్న ఫ్లాట్ కే ఆ బహుమతిని పంపించి, ఆమెను సర్ప్రైజ్ చేశారు నికోలయ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో విషయానికి వస్తే.. వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్లాట్ నుంచి దిగివస్తూ అక్కడ ఆ కారుని చూసి సర్ప్రైజ్ అయిపోతుంది. వెంటనే తన భర్తకు వీడియో కాల్ చేసి థాంక్స్ చెబుతుంది. అనంతరం ఆ కారుతో కాస్త డ్రైవ్ కి కూడా వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ.
కారు బ్రాండ్, ఖరీదు తెలిస్తే షాక్..
ఇక ఈ కారు చూసి అభిమానులు సైతం వరలక్ష్మి శరత్ కుమార్ చాలా అదృష్టవంతురాలు. ఇంత ప్రేమను చూపించే భర్తను ఆమె ఎంచుకోవడం నిజంగా ఆమె గొప్పతనం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక నికోలయ్ తన భార్య వరలక్ష్మి శరత్ కుమార్ కు అందించిన కార్ బ్రాండ్ ఏంటి? దాని ఖరీదు ఎంత? అనే వివరాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. పోర్స్చే బ్రాండ్ కి చెందిన పోర్స్చే 718 బాక్స్‌స్టర్ కార్ ను బహుమతిగా అందించారు. ఇది రోజ్ కలర్ లో చూసేవారు మనసును సైతం దోచుకుంటుంది. ఇది ఒక స్పోర్ట్స్ కారు. దీని ఖరీదు విషయానికి వస్తే.. రూ.1.52కోట్లు. ఇక దీని ధర తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇంత ఖరీదైన కార్ ను భార్యకు బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు నికోలయ్.
భార్య పేరునే తన పేరుగా మార్చుకున్న నికోలయ్..
ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ అటు కెరియర్ పరంగా ఇటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా ఒక అమ్మాయికి పెళ్లయితే భర్త ఇంటి పేరు తన పేరుగా మార్చుకుంటుంది. కానీ ఇక్కడ వరలక్ష్మి శరత్ కుమార్ పేరును తన పేరులో కలిపేసుకుని తన మంచి మనసు చాటుకున్నారు నికోలయ్.. తన పేరును నికోలయ్ వరలక్ష్మి శరత్ కుమార్ సచ్ దేవ్ గా మార్చుకున్నట్లు పలు ఇంటర్వ్యూలలో కూడా తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తే ఆయనకు ఈమెపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
also read : Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ స్పెషల్ థాంక్స్..ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
?igsh=MTJyNHRyM3ZtaHB5dA==