Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు (HHVM). పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపుకు కూడా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అటు స్పెషల్ షోస్ కి కూడా అనుమతి లభించింది. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న అనగా జూలై 21న హైదరాబాద్ శిల్పకళా వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ స్పెషల్ థాంక్స్..
ఈ వేదికపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పలు విషయాలపై మాట్లాడారు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేశారు. వేదికపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “తానెప్పుడూ రికార్డుల కోసం సినిమాలు చేయలేదు. సగటు మనిషిగా బ్రతుకుదాం అన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి, పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది డబ్బు కోసమో.. రికార్డుల కోసమో కాదు.. ఇది ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం అంటూ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరొకవైపు వైసీపీ శ్రేణులు మాత్రం ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ గేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తన స్పీచ్ తో రాజకీయ రచ్చ లేపిన పవన్ కళ్యాణ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్పీచ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇప్పుడు ఈ సినిమా బాయికాట్ అంటూ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఒక రకంగా చూసుకుంటే దాదాపు వైసీపీ అభిమానులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇక వారంతా కూడా ఈ సినిమా చూస్తారన్న నమ్మకం కొంచెం కొంచెంగా కోల్పోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ అంటున్న వైసీపీ శ్రేణులు..
అందుకే ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు తలెత్తితే అటు తెలంగాణ నుంచి అయినా కలెక్షన్స్ వసూలు చేయాలి అనే కోణంలోనే ప్రత్యేకంగా తెలంగాణ ముఖ్యమంత్రికి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేసి మరి అక్కడి ప్రజల మన్ననలు పొందాలని, థియేటర్లను హౌస్ ఫుల్ చేయడమే లక్ష్యంగా ఇప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మాటలు మాట్లాడుతున్నారు అని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రాటజీ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి అంటూ కూడా వైసీపీ అభిమానులు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడినా రెండు అర్థాలు తీసేలా ఉన్నాయని అటు నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
also read:Boycott HHVM: ట్రెండింగ్లో #Boycottహరిహర వీరమల్లు.. సిగ్గున్నవాడు సినిమా చూడడంటూ?