చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో.. తాజాగా K13 టర్బో, K13 టర్బో ప్రో స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. అప్పర్ మిడ్ రేంజ్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ సిరీస్ ఫోన్లు తయారు చేయబడ్డాయి. అధిక పనితీరు, మెరుగైన కెమెరా శక్తివంతమైన హార్డ్‌వేర్‌తో రూపొందించబడ్డాయి. ఈ ఫోన్‌లు గేమర్స్, ఎక్కువగా ఫోన్‌ను ఉపయోగించే వారికి అనువైనవి.
మోడల్స్, ధర (చైనా మార్కెట్)
ఒప్పో K13 టర్బో
12 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ కెపాసిటీ గల వెర్షన్ ధర చైనా కరెన్సీ CNY 1,799 (అంటే దాదాపు భారత కరెన్సీ ₹21,630)
16 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ కెపాసిటీ గల వెర్షన్ ధర చైనా కరెన్సీ CNY 1,999 (భారత కరెన్సీ ₹24,000)
12 GB ర్యామ్ + 512 GB స్టోరేజ్ కెపాసిటీ గల వెర్షన్ ధర చైనా కరెన్సీ CNY 2,299 (భారత కరెన్సీ ₹27,640)
ఈ ఫోన్ మూడు కలర్స్.. వైట్, పర్పుల్, బ్లాక్ లో అందుబాటులో ఉంది.
ఒప్పో K13 టర్బో ప్రో
12 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ కెపాసిటీ గల వెర్షన్ ధర చైనా కరెన్సీ CNY 1,999 (భారత కరెన్సీ ₹24,000)
16 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ కెపాసిటీ గల వెర్షన్ ధర చైనా కరెన్సీ CNY 2,199 (భారత కరెన్సీ ₹26,440)
12 GB ర్యామ్ + 512 GB స్టోరేజ్ కెపాసిటీ గల వెర్షన్ ధర చైనా కరెన్సీ CNY 2,399 (భారత కరెన్సీ ₹28,840)
16 GB ర్యామ్ + 512 GB స్టోరేజ్ కెపాసిటీ గల వెర్షన్ ధర చైనా కరెన్సీ CNY 2,699 (భారత కరెన్సీ ₹32,450)
ఈ ప్రో ఫోన్‌లు మూడు కలర్స్.. సిల్వర్, పర్పుల్, బ్లాక్ లో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌లు ఒప్పో చైనా వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. జూలై 25 నుండి అమ్మకాలు ప్రారంభమవుతాయి.
డిస్‌ప్లే
రెండు ఫోన్‌లు 6.80-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తాయి. ఈ డిస్‌ప్లే 1,280 x 2,800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 240 Hz టచ్ సాంప్లింగ్, 1,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో, ఈ డిస్‌ప్లే ద్వారా క్లియర్ వీడియోలు స్మూత్ గా స్క్రొలింగ్ చేస్తూ చూడవచ్చు.
పర్‌ఫామెన్స్
K13 టర్బోలో MediaTek డైమెన్సిటీ 8450 చిప్‌సెట్ ఉండగా, K13 టర్బో ప్రోలో Qualcomm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ ఉంది. ఈ రెండూ అధిక పనితీరును అందిస్తాయి. రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15.0తో రన్ అవుతాయి, ఇది సులభమైన, ఫీచర్-రిచ్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.
50MP కెమెరా
ఈ ఫోన్‌లు 50 MP ప్రధాన కెమెరా, 2 MP సెన్సార్, 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తాయి. ఇంతకుముందు జెనెరేషన్ కంటే ఈ కెమెరాలు తక్కువ బ్రైట్ నెస్ ఉన్నా క్లియర్ ఫొటోలు అందిస్తాయి.
స్పెషల్ కూలింగ్ సిస్టమ్
ఈ ఫోన్‌లలో ఫ్యాన్, ఎయిర్ డక్ట్‌లు .. 7,000 mm² వేపర్ ఛాంబర్‌తో కూడిన అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్ ఉంది, ఇది గేమింగ్ లేదా భారీ వినియోగం సమయంలో ఫోన్‌ను చల్లగా ఉంచుతుంది.
హెవీ బ్యాటరీ, ఛార్జింగ్
7,000 mAh బ్యాటరీతో, ఈ ఫోన్‌లు రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ని అందిస్తాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా ఈ బ్యాటరీ త్వరగా రీఛార్జ్ అవుతుంది.
సెక్యూరిటీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ద్వారా ఈ ఫోన్‌లను సురక్షితంగా అన్‌లాక్ చేయవచ్చు.
K13 టర్బో సిరీస్ ఎందుకు ప్రత్యేకం?
భారీ బ్యాటరీ: ఈ సిరీస్‌లో 7,000 mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీ ఉండడం ప్రత్యేకం. అంటే ఫోన్ ఫుల్ చార్జ్ చేస్తే వీడియోలు చూసినా రెండు రోజులు సాఫీగా వినియోగించవచ్చు.
అద్భుతమైన కూలింగ్: ఫ్యాన్, వేపర్ ఛాంబర్ సిస్టమ్ గేమర్స్‌కు అనువైనది.
సాఫీగా డిస్‌ప్లే: 120 Hz AMOLED డిస్‌ప్లే గేమింగ్, స్ట్రీమింగ్‌ను ఆనందదాయకంగా మారుస్తుంది.
పనితీరు ఎంపికలు: డైమెన్సిటీ లేదా స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ల మధ్య ఎంచుకోవచ్చు.
మెరుగైన కెమెరా: 50 MP సెన్సార్ తక్కువ-కాంతి ఫోటోలలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.
ఒప్పో K13 టర్బో సిరీస్, CNY 3,000 (₹35,000) కంటే తక్కువ ధరలో అధిక పనితీరు, భారీ బ్యాటరీ, మెరుగైన కెమెరా, అద్భుతమైన కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తుంది. జూలై 25 నుండి అమ్మకాలు ప్రారంభమయ్యే ఈ ఫోన్‌లు, పవర్ యూజర్స్ మరియు గేమర్స్‌కు అద్భుతమైన ఎంపికగా నిలుస్తాయి. ఒప్పో ఈ సిరీస్‌ను ఒప్పో గ్లోబల్ మార్కెట్‌లోనూ విడుదల చేయనుంది. అందుకే మార్కెట్‌లో రాగానే ఈ సిరీస్ ఫోన్లు పోటీదారులకు పెద్ద సవాలు విసరనున్నాయి.