Oppo Wide Screen Phones: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త డిజైన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు పొడవుగా, సన్నగా కనిపించే ఫోన్లే ఎక్కువగా వచ్చాయి. కానీ ఇప్పుడు సాధారణ ఫోన్‌ల కంటే వెడల్పుగా ఉండే డిజైన్‌పై కొన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ట్రెండ్‌లో భాగంగా ఒప్పో 2027లో మూడు వైడ్ స్క్రీన్ ఫోన్లను తీసుకురావడానికి సిద్ధమవుతోందని తాజా లీక్ చెబుతోంది. ఇవి ప్రీమియం నుంచి మిడ్‌రేంజ్ వరకు వేర్వేరు ధరల విభాగాల్లో రావచ్చని సమాచారం. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి.. ఈ వివరాలను ప్రస్తుతానికి లీక్‌గానే చూడాలి.
టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఒప్పో 2027 కోసం మూడు వైడ్ క్యాండీబార్ ఫోన్లను తయారు చేస్తోంది. గతంలో ఈ తరహా ఫోన్ రెనో X పేరుతో రావచ్చని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం చూస్తే.. ఒప్పో ఈ డిజైన్‌ను ఒక్క మోడల్‌కే పరిమితం చేయకుండా మరిన్ని ఫోన్లలో ఉపయోగించాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ మూడు ఫోన్లలో మొదటిది ఒప్పో ఫైండ్ సిరీస్‌లో భాగంగా రానుందని టిప్‌స్టర్ చెబుతున్నారు. ఇందులో 6.35 అంగుళాల డిస్‌ప్లే ఉండొచ్చని, మీడియాటెక్ డైమెన్సిటీ 9 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. ఇది Find X10 సిరీస్‌లో చేరవచ్చని అంచనా. అయితే ఫోన్ పేరులో చివర ఏ నంబర్ లేదా పేరు ఉంటుందనేది ఇంకా ఖరారు కాలేదట. చిన్న డిస్‌ప్లేతో వచ్చే ఈ మోడల్ సాధారణ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు భిన్నంగా ఉండొచ్చు.
Also Read: మోటరోలా మాస్టర్ స్ట్రోక్.. ఏకంగా రూ.6,000 తగ్గింపుతో 7000mAh బ్యాటరీ ఫోన్ భారత్‌లో లాంచ్!
రెండో ఫోన్ మిడ్‌రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకోనుందని లీక్ చెబుతోంది. ఇది తక్కువ బరువు, సన్నని బాడీతో పాటు ఫోటోగ్రఫీకి ప్రాధాన్యం ఇచ్చేలా రూపొందుతోందట. గతంలో వినిపించిన Reno X ఇదే ఫోన్ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కెమెరాల సంఖ్య, సెన్సర్లు, బ్యాటరీ, ధర వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ఇక మూడో ఫోన్ విషయానికి వస్తే.. 2027 చివర్లో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉంది. మొదట రాబోయే ఫ్లాగ్‌షిప్ వైడ్-స్క్రీన్ ఫోన్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఉండబోతోంది. హువావే తమ Pura X సిరీస్‌తో ఈ వైడ్ డిస్‌ప్లే డిజైన్‌కు మళ్లీ క్రేజ్ తీసుకురావడంతో, ఒప్పో కూడా ఇదే బాటలో నడుస్తూ అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది.
Also Read: BSNL రూ.202 ప్లాన్‌తో కళ్లు చెదిరే బెనిఫిట్స్.. డేటా, కాలింగ్‌తో పాటు ఉచిత ఇన్సూరెన్స్ కూడా!