BigTV English

R Krishnaiah: హైకోర్టు వద్ద బీసీ సంఘాల ఆందోళన.. రేపు రాష్ట్ర బంద్‌కు ఆర్. కృష్ణయ్య పిలుపు..?

R Krishnaiah: హైకోర్టు వద్ద బీసీ సంఘాల ఆందోళన.. రేపు రాష్ట్ర బంద్‌కు ఆర్. కృష్ణయ్య పిలుపు..?

R Krishnaiah: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు వద్ద బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు గేట్ 4 దగ్గర బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పలువురు బీసీ సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించారు.


రేపు రాష్ట్ర బంద్‌కు పిలుపు..?

ఇప్పటికే పలువురు బీసీ సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే పై బీసీ నేత, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య రియాక్ట్ అయ్యారు. హైకోర్టు ముందు ఆయన ధర్నాకు దిగారు. బీసీల నోటికాడ ముద్ద లాక్కున్నారని ఫైరయ్యారు. ప్రభుత్వ తొందర పాటు చర్యల వల్లే అన్యాయం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం రియాక్షన్ చూసి బంద్ కు పిలుపునిస్తామని వ్యాఖ్యానించారు. బీసీలకు పదవులు వస్తున్నాయంటే.. కొందరు ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని.. బీసీల సత్తా ఏంటో త్వరలోనే చూపిస్తామని మండిపడ్డారు.


ALSO RAED: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ.. అడ్వొకేట్ జనరల్ ఏమన్నారంటే..?

జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే

అంతకుముందు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.. జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధిస్తూ తీర్పునిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది.

ALSO READ: Local Body Elections: సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

Related News

Local Body Elections: సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ.. అడ్వొకేట్ జనరల్ ఏమన్నారంటే..?

Telangana Politics: స్థానిక సంస్థల ఎన్నికలు.. జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్, క్లీన్ స్వీప్‌పై ఫోకస్

BRS: పెంచిన బస్సు చార్జీలను వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు..

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్..

Sircilla: కలర్ డబ్బా తేస్తేనే.. స్కూల్‌లోకి ఎంట్రీ.. ప్రిన్సిపాల్ వింత పనిష్‌మెంట్

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల, ఇక అభ్యర్థుల సందడి

Big Stories

×