BigTV English
Advertisement

Big TV Kissik Talks : సూర్యతో చేసే సినిమా ఇదే, డీటెయిల్స్ చెప్పేసిన దర్శకుడు

Big TV Kissik Talks : సూర్యతో చేసే సినిమా ఇదే, డీటెయిల్స్ చెప్పేసిన దర్శకుడు

Big TV Kissik Talks : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా నడుస్తుందో ఎవరు డిసైడ్ చేయలేరు. అది కంప్లీట్ గా టాలెంట్ పైన ఆధారపడి ఉంటుంది. నటుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు వెంకీ అట్లూరి. కానీ ఆ సినిమా తనను చాలా అసంతృప్తికి గురిచేసింది. అప్పటినుంచి కొంత గ్యాప్ తీసుకొని ఒక వైపు రచయితగా చేస్తూ మరోవైపు నటుడుగా కూడా అడుగులు వేశాడు. రచయితగా కొన్ని సినిమాలకు పని చేసిన తర్వాత తొలిప్రేమ సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు తమన్ కూడా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.


సూర్యతో సినిమా ఇలా ఉండబోతుంది

ప్రస్తుతం వరుస సక్సెస్ సినిమాలను చేస్తున్న వెంకీ అట్లూరి, సూర్యతో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏ జోనర్ లో ఉండబోతుంది అని అందరికీ ఒక రకమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అంటూ ప్రముఖ ఛానల్ బిగ్ టీవీకి ఇచ్చిన ఒక షోలో తెలిపారు. తాను చేసిన జాన్రాలో సినిమా మళ్లీ చేయకూడదు అని ఎంట్రీ ఇచ్చినప్పుడే ఫిక్స్ అయ్యారట. అందుకోసమే మొదటిసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఇక సూర్యతో చేయబోయే సినిమా ఎలా ఉండబోతుంది అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ నెలకొంది.


తీవ్రమైన ట్రోలింగ్

వెంకీ తొలిప్రేమ సినిమా సక్సెస్ తర్వాత చేసిన మజ్ను సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ రెండు సినిమాలు తర్వాత చేసిన రంగ్ దే సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ మూడు సినిమాల తర్వాత వెంకీ మీద విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ఎవరూ ఊహించని విధంగా తమిళ స్టార్ హీరోతో ప్రాజెక్టు పట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ కొట్టాడు. ధనుష్ హీరోగా వెంకి అట్లూరి చేసిన సార్ సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాతోనే ధనుష్ తెలుగుకి ఎంట్రీ ఇచ్చాడు.

మలయాళం స్టార్ హీరో తో మరో హిట్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. రెండు వరుస సక్సెస్ ల తర్వాత తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వాటన్నిటిని కూడా వెంకీ అట్లూరి చాలా సక్సెస్ ఫుల్ గా లక్కీ భాస్కర్ సినిమాతో నిలబెట్టాడు. ఈ సినిమా ఒక సెన్సేషన్. అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేయడమే కాకుండా మంచి ప్రశంసలు కూడా అందుకుంది.

Also Read : Teja Sajja: నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్, ఆ దర్శకుడితో సినిమా వద్దు

Related News

Donlee: స్పిరిట్ లో డాన్ లీ.. కన్ఫర్మ్ చేసిన కొరియన్ మీడియా

HBD Nagababu: ఆరోజు తమ్ముడి నిర్ణయం.. నేడు నిలదొక్కుకోవడానికి కారణం అయిందా?

Pawan Kalyan Next Movie : స్టార్ నిర్మాత నుంచి పవన్ కళ్యాణ్‌కు 20 కోట్ల అడ్వాన్స్?

Kantara 1 OTT: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి కాంతార 1.. కారణం చెప్పిన నిర్మాత

Star Kid’s: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న స్టార్ కిడ్స్.. ఎవరెవరంటే ?

Peddi: పెద్ది సినిమాలో సుకుమార్ జోక్యం.. అవసరం లేదంటున్న ఫ్యాన్స్

SSMB29 : మెంటలెక్కించే న్యూస్.. మహేష్ ను గుడ్డోడిని చేస్తున్న జక్కన్న.. మ్యాటర్ ఇదే..?

Idly Kottu: ఓటీటీకి స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ ఇడ్లీ కొట్టు.. ఎక్కడ చూడొచ్చు అంటే

Big Stories

×