BigTV English

Camel Tear: 26 పాముల విషానికి.. ఒంటె కన్నీటి చుక్క చాలట.. తాజా స్టడీలో షాకింగ్ విషయాలు

Camel Tear: 26 పాముల విషానికి.. ఒంటె కన్నీటి చుక్క చాలట.. తాజా స్టడీలో షాకింగ్ విషయాలు

ఈ లోకంలో పన్నీటికి విలువ ఉంటుంది కానీ, కన్నీటికి కాదు. అయితే కన్నీరు అత్యంత విలువైనదని, చీటికీ మాటికీ కన్నీరు పెట్టకూడదని పెద్దలు అంటుంటారు. అంటే ఇక్కడ విలువ అనేది దాని ఖరీదు కాదు, అది అరుదైనది అని చెప్పడమే. అయితే నిజంగానే కన్నీరు విలువైనది అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే అది మనిషి కన్నీరు కాదు, ఒంటెది. ఒంటె కన్నీరు అత్యంత విలువైనది, దానిలో ఔషధ గుణాలు ఎక్కువ. ఎంత ఎక్కువంటే పాము విషానికి విరుగుడుగా పనిచేసే మందుల తయారీలో దాన్ని ఉపయోగిస్తారు. దాదాపు 26 రకాల అత్యంత విషపూరితమైన పాముల విషానికి ఒంటె కన్నీటి చుక్కని విరుగుడుగా ఉపయోగించవచ్చు.


బికనీర్ పరిశోధన..
దుబాయ్ లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (CVRL) పరిశోధనలో ఒంటె కన్నీళ్ల విలువ తెలిసింది. ఒంటె కన్నీళ్లలో ఉండే ప్రత్యేక పదార్థాలు పాము విషాన్ని తటస్తం చేస్తాయని ఆ పరిశోధన స్పష్టం చేసింది. రాజస్తాన్ లో కూడా ఈ తరహా ప్రయోగాలు జరగడం విశేషం. బికనీర్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ కేమెల్ (NRCC) చేసిన అధ్యయనంలో ఒంటె కన్నీళ్లు రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయని తేలింది. అంతే కాదు, పాము విషానికి విరుగుడుగా ఈ రోగనిరోధక శక్తి పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గతంలో గుర్రం యొక్క ఇమ్యునో గ్లోబులిన్ నుండి యాంటీవీనమ్ తయారు చేసేవారు. ఇప్పుడు అంతకంటే సులభంగా ఒంటె కన్నీటితో యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు తయారు చేయవచ్చు. ఈ పరిశోధనలు ఇప్పుడు చురుగ్గా సాగుతున్నాయి.

భారత్ వంటి దేశాల్లో..
ఒంటె కన్నీటితో పాము కాటుకి విరుగుడు మందు తయారు చేసి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే అది నిజంగా భారతీయులకు శుభవార్తే. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పాముకాట్ల మరణాలు భారత్ లోనే సంభవిస్తున్నాయి. ప్రతి ఏటా దాదాపు 58వేలమంది పాము కాటు వల్ల మృత్యువాత పడుతున్నారు. మరో 1.4 లక్షలమంది అంగవైకల్యం బారిన పడుతున్నారు. పాముకాటుకి విరుగుడు మందులు ఉన్నా కూడా అవి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటుకి గురైన వారు ఆస్పత్రికి తీసుకెళ్లినా సకాలంలో సరైన చికిత్స అందక చనిపోతుంటారు. పాముకాటు విరుగుడు మందు మరింత సులభంగా అందుబాటులోకి తెస్తే భారత్ వంటి దేశాల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అది మరింత మేలు చేస్తుందని అంటున్నారు.


ఒంటె కాపరులకు..
ఒంటె కన్నీటినుంచి విషానికి విరుగుడు తయారు చేయడం మొదలు పెడితే.. ఒంటెలను పెంచే వారికి అది ఆర్థికంగా మేలు చేస్తుంది. ఒంటెకాపరులు.. వాటి కన్నీటిని అమ్మడం ద్వారా మరింత ఎక్కువ జీవనోపాధి పొందే అవకాశముంది. ఒంటెల నుంచి కన్నీరు, రక్త నమూనాలను సేకరించే క్రమంలో స్థానిక రైతులకు బికనీర్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ కేమెల్ (NRCC) ప్రోత్సాహకాలను అందిస్తోంది. వారితో లాభసాటి ఒప్పందాలను కుదుర్చుకుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రైవేట్ ఔషధ తయారీ కంపెనీలు కూడా ఒంటె కన్నీటిని సేకరించేందుకు పోటీ పడుతున్నాయి.

Related News

Best Selling iPhone: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఐఫోన్ మోడల్ ఇదే.. తాజా రిపోర్ట్‌‌లో షాకింగ్ విషయాలు!

Iphone Air : వచ్చేసింది ఐఫోన్ ఎయిర్.. గెలాక్సీ S25 ఎడ్జ్‌కు సవాల్ విసిరిన ఆపిల్

Nothing Phone Discount: నథింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్‌పై సూపర్ ఆఫర్.. రూ.35000 డిస్కౌంట్.. ఎక్స్‌ఛేంజ్ లేకుండానే!

No network Simcard: ఫోన్‌లో సిమ్ కార్డ్ ఉన్నా నెట్ వర్క్ చూపించడం లేదా? ఇవే కారణాలు..

Samsung Copy Iphone: ఆపిల్ ఫోన్ డిజైన్ కాపీ కొట్టిన శాంసంగ్.. అచ్చం ఐఫోన్ లాగే గెలాక్సీ S26 ఎడ్జ్!

Swiggy High Bill: రెస్టారెంట్ కంటే స్విగ్గీ బిల్లు 81 శాతం ఎక్కువ.. ఆన్ లైన్ డెలివరీతో జేబుకి చిల్లు

×