Bharat Gaurav Tourist train: తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల కోసం అద్భుత అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు’ రెండు ఆధ్యాత్మిక యాత్రలను టూర్ టైమ్స్ సంస్థ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు స్టేషన్ల మీదుగా రైలు బయలు దేరే సౌకర్యం కల్పించింది. అంతేకాకుండా టికెట్ ధరలపై 33 శాతం సబ్సిడీ అందిస్తోంది రైల్వే.
తెలుగు రాష్ట్రాల మీదుగా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు
భారత రైల్వే రెండు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సర్క్యూట్‌లను ప్రకటించింది. అందులో ఏపీ, తెలంగాణలకు అవకాశం ఇచ్చింది. మొదటి యాత్ర తమిళనాడు-కేరళలోని ప్రసిద్ధ దేవాలయాల సందర్శన కోసం. నవంబర్ 16న ప్రారంభమయ్యే ఈ టూర్ 11 రోజుల పాటు సాగుతుంది.
ఇందులోభాగంగా నటరాజ స్వామి, అరుణాచలం, త్రిచీ, తంజావూర్, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, గురువయ్యూరు వంటి ప్రాంతాలను దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించారు. మహాశివరాత్రి రోజు అరుణాచలం శివుడి దర్శనం, అమావాస్య రోజు కావేరి నది ఒడ్డున పిండ తర్పణం చేయవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. టికెట్ ధరలు ఎలా ఉన్నాయి. స్లీపర్ క్లాస్‌లో రూ. 19,950 నుంచి ఫస్ట్ ఏసీలో రూ. 42,950 వరకు ఉన్నాయి.
ప్రత్యేకంగా రెండు రైళ్లు
మరొకటి పంచ ద్వారక యాత్ర. నవంబర్ 26న మొదలుకానుంది. 10రోజుల పాటు కొనసాగుతోంది. ఈ టూర్‌లో భాగంగా సముద్ర గర్భంలో వెలసిన నిష్కళంక్ మహాదేవ్ ఆలయంతోపాటు జ్యోతిర్లింగాలను దర్శించవచ్చు. ప్యాకేజీలో ద్వారక, నాథద్వార, కంక్రోలి ద్వారక, నిష్కలంక్ మహాదేవ్ సముద్ర దేవాలయంతోపాటు యాదాద్రి, స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సోమనాథ్, నాగేశ్వర్ వంతి ఇతర ప్రదేశాలు ఉన్నాయి.
మోక్షదా ఏకాదశి రోజు ద్వారకాధీశుని దర్శనం ఉండనుంది. ఈ విషయాన్ని టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ స్వయంగా తెలిపారు. ఈ ప్యాకేజీ ధరలు థర్డ్ ఏసీ రూ. 41,150 నుంచి రూ. 63 వేల మధ్య ఉంటుంది. ఇందులో సెకండ్ క్లాస్ ఏసీ కూడా ఉంటుంది.
ALSO READ: బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అంతా ఆ రైలులో
భారతీయ రైల్వే-భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైలును టూర్ టైమ్స్ నడుపుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విఘ్నేశ్ వెల్లడించారు. ఈ ప్యాకేజీలో భారతీయ రైల్వేల 33 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు. ప్రత్యేక పర్యాటక రైలులో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఖమ్మం, వరంగల్, చర్లపల్లి నుంచి బోర్డింగ్ పాయింట్లు ఉంటాయి.
వాటి నుంచి రైలు ఎక్కవచ్చు. ఫస్ట్ ఏసీ నుంచి స్లీపర్ క్లాస్ వరకు ప్యాంట్రీ కారు ఉంటుంది. 650 మంది ప్రయాణికులు సామర్థ్యం కలిగి ఉంది. వసతి, సందర్శన, బస్సు, ట్రావెల్ ఇన్సూరెన్స్, మూడు పూటలా భోజనం, యాత్రికులు ఎల్‌టీసీ, ఎల్‌ఎఫ్‌సీ సౌకర్యాన్ని పొందవచ్చు.