తిరుపతి నుంచి నడిచే వీక్లీ రైళ్లకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసకుంది. 10 వారపు ప్రత్యేక రైళ్లను తిరుపతి నుంచి కాకుండా తిరుచానూరు నుంచి నడపనున్నట్లు ప్రకటించింది. ఆపరేషనల్ రీజన్స్ కారణంగా ఈ నిర్ణం తీసుకున్నట్లు వెల్లడించింది. సవరించిన షెడ్యూల్ అక్టోబర్ 9 నుంచి దశల వారీగా అమలులోకి వస్తుందని తెలిపింది. SCR తాజా నిర్ణయంతో జల్నా, చర్లపల్లి, సికింద్రాబాద్, నాందేడ్ వెళ్లే రైళ్లు ప్రభావింతం కానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త టెర్మినల్ సమయాలను ఈ 10 రైళ్లకు అనుగుణంగా సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ఆయా రైళ్లు వెళ్లే రూట్ లోని స్టేషన్లలో షెడ్యూల్ మారదని ప్రకటించారు.
⦿ అక్టోబర్ 9 నుంచి రైలు నెంబర్- 07009/07010 సికింద్రాబాద్ – తిరుచానూర్ / తిరుచానూర్ – సికింద్రాబాద్ రైళ్లు ఉదయం 10.30 గంటలకు తిరుచానూర్ చేరుకుని సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరుతాయి.
⦿ అక్టోబర్ 11 నుంచి రైలు నెంబర్- 07015/07016 నాందేడ్–తిరుచానూర్ / తిరుచానూర్–నాందేడ్ రైళ్లు ఉదయం 11.30 గంటలకు చేరుకుని సాయంత్రం 7.50 గంటలకు బయలుదేరుతాయి.
⦿ అక్టోబర్ 12 నుంచి రైలు నెంబర్ – 07017/07018 చర్లపల్లి – తిరుచానూర్ / తిరుచానూర్ – చర్లపల్లి రైళ్లు ఉదయం 11.15 గంటలకు తిరుచానూర్ చేరుకుని సాయంత్రం 4.40 గంటలకు బయలుదేరుతాయి.
Read Also: లక్నో నుంచి ముంబైకి జస్ట్ 12 గంటల్లోనే.. వచ్చేస్తోంది వందే భారత్ స్లీపర్!
⦿ అక్టోబర్ 13 నుంచి రైలు నెంబర్ – 07609/07610 జల్నా–తిరుచానూర్ / తిరుచానూర్–జల్నా రైళ్లు ఉదయం 10.45 గంటలకు తిరుచానూర్ చేరుకుని మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరుతాయి.
⦿ అక్టోబర్ 15 నుంచి రైలు నెంబర్ – 07251/07252 చర్లపల్లి–తిరుచానూర్ / తిరుచానూర్–చర్లపల్లి ఉదయం 8 గంటలకు చేరుకుని సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరుతాయి.
ఇక ఈ రైళ్లకు సంబంధించి అన్ని ఎన్‌రోట్ స్టేషన్ల సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైళ్ల ఆపరేషన్స్ ను క్రమబద్ధీకరించడానికి, అధిక ట్రాఫిక్ ఉన్న తిరుపతి టెర్మినల్ లో సమయపాలనను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు తిరుచానూర్ రైల్వే స్టేషన్ సవరించిన టైమింగ్స్ ను చెక్ చేసుకోవాలని సూచించారు. రాకపోకలకు సంబంధించిన వివరాలను ముందుగా తెలుసుకుని ప్రయాణీలను కొనసాగించాలని అధికారులు సూచించారు.
Read Also: ఆ దేశంలో కేవలం 8 సెకన్లలోనే పాస్ పోర్ట్ చెకింగ్ కంప్లీట్.. అదెలా సాధ్యం?