Telangana: సంగారెడ్డి జిల్లా ఝారసంగం మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన చిన్నారులు దేవాన్ష్, రహస్యలు తమ తల్లి సునీత కు బ్యాంకు లో పనివుండటం తో ఆమెతో కలిసి చిన్నారులు బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారట అని తెలుసుకుని నేరుగా బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి మాకు సైకిల్ కొనేందుకు డబ్బులు కావాలి అని అడిగారు. అప్పుడే ఆశ్చర్యానికి గురైన మేనేజర్, బ్యాంకులో ఏదైనా తాకట్టు పెట్టాలి మీ దగ్గర ఏముంది అని ప్రశ్నించాడు. దానికి చిన్నారులు “మా దగ్గర భూమి ఉంది… బంగారం కూడా ఉంది అని అమాయకంగా సమాధానం ఇవ్వడంతో మేనేజర్ నవ్వుతో పాటు ఆనందానికి గురయ్యాడు. వారి అమాయకపు సమాధానం విన్న సిబ్బంది, అక్కడ ఉన్న కస్టమర్లు నవ్వులు పూయించగా.. చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.
బ్యాంక్ మేనేజర్లను ఆశ్యర్యపరిచే చిచ్చర పిడుగుల ప్రశ్నలు..
ఈ సంఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝారసంగం మండలం గ్రామీణ ప్రాంతాలకు ప్రసిద్ధి. బర్దీపూర్ గ్రామం చిన్న గ్రామం, ఇక్కడ ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడతారు. చిన్నారుల తల్లి సునీత బ్యాంకులో పని ఉండి బ్యాంక్ దగ్గరకు వెళ్లది.. కానీ, ఆమెతో పాటు చిన్నారులు కూడా బ్యాంకుకు వెళ్లడం ఈ సరదా సంఘటనకు కారణమైంది.
Also Read: నేడు వైసీపీ కీలక సమావేశం.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ మీటింగ్
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో..
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో కూడా ఈ స్టోరీ షేర్ అవుతోంది.. అయితే పిల్లలు ప్రపంచాన్ని ఎంత సరళంగా చూస్తారో, బ్యాంకులు డబ్బులు ఇస్తాయని విశ్వసిస్తారో ఇది ప్రపంచానికి ఉదాహరణగా చూపిస్తుంది. వాస్తవానికి, బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు తాకట్టు, ఆదాయం, క్రెడిట్ స్కోర్ వంటివి పరిశీలిస్తాయి. కానీ చిన్నారులు దీనిని అర్థం చేసుకోలేదు, తమ దగ్గర ఉన్న భూమి, బంగారం తాకట్టు పెట్టవచ్చని అనుకున్నారు. కానీ, మేనేజర్ వారి అమాయకపు సమాదానం విన్న తర్వాత.. చిన్నారులను ప్రేమగా పలకరించి ఇంటికి పంపించారు.