Vijay Devarakonda About Kingdom Part 2: విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కింగ్ డమ్’. ఎన్నో అంచనాల మధ్య జూలై 31 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసింది. కానీ, రిలీజ్ తర్వాత ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఓ వర్గం ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. కింగ్ డమ్ విజయ్ నటన అద్భుతంగా ఉంది.ః
కథలో అదే మిస్
కానీ, కథలో ఎమోషన్స్ మిస్ అయ్యాయని, సెకండాఫ్ లో ల్యాగ్ ఎక్కువ ఉండటంతో ఆడియన్స్ బోర్ ఫిలయ్యారు. ఫస్ట్ డే మూవీకి మంచి వసూల్లు వచ్చాయి. సినిమా యూనిట్ కింగ్ డమ్ హిట్ అంటూ సక్సెస్ మీట్స్ పడుతోంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా కింగ్ డమ్ సెకండ్ పార్ట్ పై అప్డేట్ ఇచ్చారు. ఇది సీక్వెల్ కాదని, ప్రీక్వెల్ అని చెప్పాడు. అంతేకాదు ఈ సినిమా ముందు అన్న అనుకున్న టైటిల్ ఇది కాదనీ, ఎన్టీఆర్ కోసం తమ మూవీ టైటిల్ మార్చమంటూ షాకింగ్ విషయం రివీల్ చేశాడు.
ఇది కింగ్ డమ్ కాదు దేవర
‘మా సినిమాకి కింగ్ డమ్ మొదటి టైటిల్ కాదు. ఫస్ట్ ఈ సినిమాకు ‘దేవర నాయక’ అనుకున్నాం. అయితే ఎన్టీఆర్ మూవీ దేవర టైటిల్ అనౌన్స్ మెంట్ రావడంతో మేం డ్రాప్ అయ్యాం. ఆ తర్వాత ఆలోచింది కింగ్ డమ్ పెట్టుకున్నాం. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. అయితే ఇది సీక్వెల్ కాదు. ప్రీక్వెల్. 1920 బ్యాక్ డ్రాప్ లో జరిగిన కథ చూట్టూ మూవీ సాగుతుంది. ఇది మికు మంచి అనుభూతి ఇస్తుంది. ఈ ప్రీక్వెల్ లో ఓ స్టార్ హీరో ఉంటారు. కానీ, రానా మాత్రం కాదు. సోషల్ మీడియాలో రానా పేరు వినిపిస్తోంది. అందులో నిజం లేదు. ఆ హీరో ఎవరన్నది మా డైరెక్టర్ గౌతమ్ చెబుతారు’ అని చెప్పుకొచ్చాడు.
నెక్ట్స్ మైత్రీ, దిల్ రాజుతో సినిమాలు
కాగా ప్రస్తుతం విజయ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో మూవీ కూడా ఉంది. ఈ రెండు సినిమాలు అయిపోయాకే కింగ్ డమ్ ప్రీక్వెల్ స్టార్ట్ చేస్తామని చెప్పాడు. ఈ లెక్కన చూసుకుంటే కింగ్ డమ్ పార్ట్ 2, 2027లో ప్రారంభమై 2028లో విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా ఈ సినిమా విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా.. నటుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం సాగింది. అన్న సెంటిమెంట్ తో ప్రధాన బలంగా ఉన్న కింగ్ డమ్ కథ, కథనం ఆ ఎమోషన్ మిస్ అయ్యిందనే ఆడియన్స్ నుంచి వస్తున్న టాక్.
Also Read: Prabhas Raja Saab: ఓజీ ఫైర్ స్ట్రోమ్ కమ్మింగ్ ఎఫెక్ట్.. రాజాసాబ్‌కి థమన్ వద్దు బాబోయ్