Remove Thaman From The Raja Saab Movie:స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. ఏంటీ థమన్ నువ్వు ఇక మారవా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నాడు. ఇక థమన్ పని చేస్తున్న ఏ సినిమా నుంచి మ్యూజిక్ అప్డేట్ వచ్చినా.. వెంటనే అతడికి కాపీ క్యాట్ ట్యాగ్ పడిపోతుంది. ఎంతో కాలంగా ఇది జరుగుతూనే ఉంది. ఎంతో స్టార్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. కానీ, తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఇతర భాష సినిమాల్లోనే సంగీతం, బీజీయంను కాపీ కొట్టడం పరిపాటిగా చేస్తున్నాడు.
మళ్లీ దొరికేసిన థమన్
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు కాపీ కొట్టాడు. అభిమానులంతా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఓజీ మూవీ ఎట్టకేలకు ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. హీరో పాత్రను ఎలివేట్ చేస్తూ సాగే ఈ పాటకు థమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఆకట్టుకుంటుంది. ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ అదరగొట్టాడంటూ అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇలా ప్రశంసలు వస్తున్న క్రమంలో సడెన్ గా మరో వీడియో తెరపైకి వచ్చింది. బాలీవుడ్ సినిమా బేబీ జాన్ లోని ఓ మ్యూజిక్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ‘ఎస్.. థమన్ మళ్లీ దొరికేసాడు. ఓజీ పాట మ్యూజిక్ ఇక్కడ నుంచి కాపీ కొట్టాడు’ అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు.
ఇదేంటి బాసూ.. మన పవర్ స్టార్ సినిమాకు కూడా కాపీయేనా.. అంటూ తలలు అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇక థమన్ పై వస్తున్న ఈ ట్రోల్ సెగ ఇప్పుడు ప్రభాస్ ‘ది రాజాసాబ్’ కి తగిలింది. ప్లీజ్.. ఈ చిత్రం నుంచి థమన్ తొలగించాలంటూ డార్లింగ్ ఫ్యాన్స్ రాజా సాబ్ టీంని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు అప్పడే అతడిపై మిమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ‘థమన్ ఇప్పటి వరకు ఏ ఏ హారర్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడో చెప్పండ్రా.. అందులోంచి రాజాసాబ్ కి ఏదోకటి కొట్టేస్తాడు’ సెటైర్స్ వేస్తున్నారు.
Also Read: Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!
రాజాసాబ్ నుంచి తిసేయండి..
అంతేకాదు #RemoveThamanFromRajasaab అంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. కాగా గతంలో థమన్ కాంచన, అనుష్క భాగమతి చిత్రాలకు సంగీతం అందించాడు. ఇప్పుడు ఆ సినిమాల నుంచి బీజీయాన్ని కాపీ చేసి రాజా సాబ్ కి కొట్టేస్తాడంటూ అసహనం చూపిస్తున్నారు అభిమానులు. ఇలా థమన్ మరోసారి కాపీ క్యాట్ ట్యాగ్ ట్రొలర్స్ కి చిక్కాడు. కాగా థమన్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా బాలయ్య సినిమాలకు అతడు కొట్టే బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్లు దద్దరిల్లాసిందే. అది అఖండ చిత్రంతో చూశాం. అంతటి గుర్తింపు పొందిన తమన్.. తరచూ ఇలా కాపీ క్యాట్ ట్యాగ్ తో ట్రోల్స్ ఎదుర్కొవడం ఏంటని అభిమానులు వాపోతున్నారు.
Thaman gadu mundu em horror movies chesado cheppandi andulo edokati kottestadu #TheRajaSaab ki #RemoveThamanFromRajasaab pic.twitter.com/giUvEvOGbN
— Siddharth Nandan Saaho (@Vikramaditya169) August 2, 2025