OTT Movie : యాక్షన్ థ్రిల్లర్ సినిమా లవర్స్ పండగ చేసుకునే, ఒక అదిరిపోయే స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఒక చిన్న కన్వీనియన్స్ స్టోర్‌లో జరిగే ఒక లాటరీ టికెట్‌పై ఆశ, అత్యాశల మధ్య ఒక గ్రిట్టీ డార్క్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రం ఊహించని ట్విస్ట్‌లు, ఉత్కంఠతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘యువర్ లక్కీ డే’ (Your Lucky Day) 2023లో విడుదలైన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. దీనికి డానియల్ బ్రౌన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2023 సెప్టెంబర్ 23న ఫాంటాస్టిక్ ఫెస్ట్‌లో ప్రీమియర్ అయ్యింది. 2023 నవంబర్ 10న థియేటర్లలో విడుదలైంది. ఇది 2024 మార్చి 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఆంగస్ క్లౌడ్ (స్టెర్లింగ్), జెస్సికా గార్జా (అనా), ఎలియట్ నైట్ (అబ్రహం), స్టెర్లింగ్ బీమన్, మౌసా హుస్సేన్ క్రైష్ (అమీర్), జాసన్ ఓ’మారా (కెప్టెన్ రట్లెడ్జ్), స్పెన్సర్ గారెట్ (మిస్టర్ లెయిర్డ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వెల్ గో యూఎస్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో డానియల్ బ్రౌన్ దర్శకత్వం వహించారు.
స్టోరీలోకి వెళితే
ఈ కథ లాస్ ఏంజిల్స్‌లోని ఒక చిన్న కన్వీనియన్స్ స్టోర్ లో క్రిస్మస్ ఈవ్ రాత్రి జరుగుతుంది. స్టెర్లింగ్ ఒక చిన్న స్థాయి డ్రగ్ డీలర్. ఒక రోజు రాత్రి సమయంలో దొంగతనానికి గురవుతాడు. డిసప్పాయింట్ గా ఈ స్టోర్‌లోకి వెళ్తాడు. అదే సమయంలో మిస్టర్ లెయిర్డ్ అనే వ్యక్తి $156 మిలియన్ల విలువైన లాటరీ టికెట్ గెలుచుకున్నట్లు తెలుసుకుంటాడు. ఈ అవకాశాన్ని చూసిన స్టెర్లింగ్, ముఖానికి మాస్క్ ధరించి, గన్‌తో లెయిర్డ్‌ను బెదిరించి టికెట్‌ను దొంగిలించాలని నిర్ణయించుకుంటాడు. అయితే స్టోర్‌లో ఉన్న కోడీ అనే ఒక పోలీసు అధికారి, ఈ గొడవలో జోక్యం చేసుకుంటాడు. కానీ పొరపాటున లెయిర్డ్‌ను కాల్చి చంపేస్తాడు. దీనికి ప్రతీకారంగా స్టెర్లింగ్ కోడీని కాల్చేస్తాడు.ఈ ఘటనతో స్టోర్‌లో ఉన్న ఇతర వ్యక్తులు కూడా చిక్కుకుంటారు.