Karachi Hotels: అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇటీవల పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలోని ఉన్నత స్థాయి హోటళ్లపై భద్రతా ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కరాచీలోని అమెరికా కాన్సులేట్ జనరల్‌కు ఈ హోటళ్లపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం అందడంతో.. అమెరికా ప్రభుత్వ అధికారులు ఈ హోటళ్లకు వెళ్లకుండా తాత్కాలిక నిషేధం విధించారు. శుక్రవారం రోజున అమెరికా ప్రభుత్వ అధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇది పాకిస్థాన్‌లోని అస్థిర భద్రతా పరిస్థితులను స్పష్టం తెలియజేస్తోంది.
పాకిస్థాన్‌లో ఉగ్రవాదం, సాయుధ సంఘర్షణలు వంటి భద్రతా సమస్యలు ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఎప్పటికీ ఏదో ఒక హింసాత్మక దాడులు జరుగుతూనే ఉంటాయి. కరాచీ ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉన్నప్పటికీ, ఉగ్రవాద ప్రాంతంగా మారిందని చాలా మంది చెబుతుంటారు. అమెరికా కాన్సులేట్ జనరల్ ఈ ముప్పు గురించి సమాచారం అందుకున్న తర్వాత, అధికారులకు హోటళ్లతో పాటు పర్యాటక ఆకర్షణలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల వంటి ప్రదేశాలను నిషేధించింది. అమెరికా పౌరులకు ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే ఆ ప్రదేశాలను వెళ్లొద్దని సూచించింది.
ALSO READ: Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!
ఈ హెచ్చరిక పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఉగ్రవాద ముప్పు ఉందన్న ఆందోళనలను స్పష్టంగా తెలియజేస్తోంది. జూన్ నెలలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది, ఎందుకంటే అక్కడ డేంజర్ ఉగ్రవాదులు సంచరిస్తారని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఉగ్రవాదులు పౌరులు, ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తాయి. అమెరికా పౌరులు పాకిస్థాన్‌కు ప్రయాణం గురించి పునరాలోచన చేయాలని, ఉగ్రవాదం, సాయుధ సంఘర్షణల కారణంగా ఆగస్ట్ 1న హెచ్చరికలు జారీ చేశారు.
ALSO READ: Hyderabad News: హైదరాబాద్‌లో ఆవులు కిడ్నాప్.. ఏకంగా కార్లలో ఎక్కించుకుని.. ఇదిగో ఇలా దొరికారు!
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ సలహా ప్రకారం.. కరాచీలోని పర్యాటకులు, పశ్చిమ దేశాల పౌరులు తరచూ వచ్చే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈ హెచ్చరిక బ్రిటన్ వంటి ఇతర దేశాలు కూడా పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలకు అత్యవసరం కాని ప్రయాణాలను నిషేధించిన నేపథ్యంలో అమెరికా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అమెరికా పౌరుల భద్రతను కాపాడేందుకు, హోటళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సంభవించే సంఘటనలను నివారించేందుకని అమెరికా తెలిపారు.