Rowdy Janardhan Movie Shooting Update: టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. డిస్ట్రీబ్యూటర్ స్థాయి నుంచి ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. సొంతంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి అందులో ఎన్నో సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్లో వచ్చిన చిత్రాలు దాదాపు హిట్స్, బ్లాక్బస్టర్సే. దిల్ రాజు ప్రొడక్షన్లో మూవీ అంటే డిస్ట్రిబ్యూటర్లకు మ్యాక్సిమమ్ గ్యారంటీ. లాభాలు రాకపోయినా.. పెట్టిన డబ్బులైన వస్తాయనే నమ్మకం. అలా అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్న ఈ బ్యానర్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉండేది.
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే మరో కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ ఉంటుంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఈ బ్యానర్లో ఎన్నో వందల చిత్రాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ బ్యానర్కు గ్యాప్ అనేది రాలేదు. కానీ ఫస్ట్ టైం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి కొత్త సినిమా షూటింగ్ ప్రకటన రావడానికి చాలా టైం పట్టింది. ఈ బ్యానర్లో చివరిగా నితిన్ ‘తమ్ముడు‘ మూవీ రూపుదిద్దుకుంది. దాని తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త సినిమాను సెట్స్పైకి తీసుకురాలేదు. నిజానికి ఈ శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో కమిటైన చిత్రాలు చాలనే ఉన్నాయి. ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ వంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి.
కానీ, వాటిని సెట్స్ పైకి తీసుకురావడానికి దిల్ రాజ్ ఎందుకు ఇంత సమయంలో తీసుకున్నారనేది తెలియడం లేదు. ఇంత పెద్ద బ్యానర్లో లాంగ్ గ్యాప్ రావడం ఇదే మొదటిసారి కావడంతో ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమౌతుంది. కాగా దిల్ రాజు బ్యానర్లో చివరిగా తమ్ముడు మూవీ విడుదలైంది. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది జూలై 4న రిలీజైంది. ఈ సినిమాసెట్స్లో ఉండగానే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ చిత్రాలను ప్రకటించారు. వీటిని ప్రకటించి ఏడాదిపైనే అవుతుంది. కానీ, ఇప్పటి ఇవి సెట్స్పైకి రాలేదు. ఈ సినిమా ప్రకటన కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Bandla Ganesh : అవును… బండ్లన్న కామెంట్స్‌లో తప్పేముంది ?
ఈ క్రమంలో తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. రౌడీ జనార్ధన్ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకువస్తున్నట్టు కాసేపటి క్రితం అనౌన్స్మెంట్ ఇచ్చింది మూవీ టీం. అక్టోబర్ 20 నుంచి రౌడీ జనార్ధన్ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందంటూ తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎట్టకేలకు ఈ బ్యానర్ నుంచి మూవీ అనౌన్స్మెంట్ రావడంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక కింగ్డమ్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న చిత్రమిది.