Bandla Ganesh Comments: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఇండస్ట్రీ మాఫీయా.. ఈ మాయలో పడకంటూ లిటిల్ హార్ట్స్ హీరో మౌళిని ఆయన హెచ్చరించిన తీరు.. ఇండస్ట్రీ వర్గాలకు చురక అనిపిస్తోంది. ప్రస్తతం దీనిపై ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలు పరిశ్రమలో ఎలాంటి దుమారం రేపుతాయో అని అంతా భయపడుతున్నారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ పెద్దలు, స్టార్స్కి కౌంటర్లా ఉన్నా.. ఆయన చేసిన కామెంట్స్లో తప్పేముంది అనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే సినీ పరిశ్రమకు వచ్చిన ఎంతో అప్కమ్మింగ్ స్టార్స్.. ఒకటి రెండు చిత్రాలతోనే మాయమైన సందర్భాలు ఉన్నాయి.
నిజానికి సినీ పరిశ్రమ అనేది రంగురంగుల ప్రపంచం. కానీ, ఈ రంగుల ప్రపంచం వెనక నలిగిపోయిన జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికి ప్రత్యేక ఉదాహరణ ఓ యువ హీరో మరణం. సొంత టాలెంట్తో ఇండస్ట్రీకి వచ్చి బ్యాక్ ట్యూ బ్యాక్ హిట్స్ కొట్టాడు. వరుస హిట్స్ మూడు పూలు, ఆరు కాయలుగా వెళుతున్న ఆయన కెరీర్కి సడెన్గా బ్రేక్ పడింది. అప్పటి వరకు ఆహా.. ఓహో అంటూ పొగిడిన ఆ నటుడిని ఇండస్ట్రీ మొత్తం పక్కన పెట్టింది. చివరికి ఆఫర్స్ లేక.. మానసిక వేదనతో ఊపీరి వదిలాడు ఆ యంగ్ హీరో. నిజానికి సినిమాల్లోకి వచ్చే కొత్త నటీనటులకు ఇండస్ట్రీ మంచి మంచి ప్రోత్సాహకం ఉంటుందన్నది నిజమే. కానీ, అది ఎప్పటి వరకు అన్నదే ప్రశ్న. మొదటి సినిమా హిట్ అయితే మాత్రం ఇండస్ట్రీ మొత్తం భుజం తట్టి ప్రొత్సహిస్తుంది. ట్విట్స్, స్పీచ్లతో ఆ నటుడిపై ప్రశంసలు కురిపిస్తుంది.
దీంతో ఆ నటుడు ఇక తాను స్టార్ అయిపోయాననే గర్వాన్ని నెత్తికి ఎక్కించుకుంటాడు. ఇక ఇండస్ట్రీలో తనకు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్.. హిట్స్ అంటూ ఊహాలోకంలో తేలుతుంటాడు. అలా కలల ప్రపంచలో తేలుతున్న ఆ నటుడిని.. చివరకు అదే ఇండస్ట్రీ ఒక్కసారిగా కింద పడేస్తుంది. నీ నటన అద్బుతం, స్క్రిన్ లుక్ సూపర్ అంటూ పొగిడిన వారే.. ఆఫర్ కోసం వెళితే ముఖం చాటేస్తారు. ఒకవేళ మాట సాయంగా ఆఫర్స్ ఇచ్చినా.. ఒకటి రెండు సినిమాల వరకే. ఆ తర్వాత అతడి కెరీర్ ప్రశ్నార్థకమే. ఇలా ఎన్నో ఆశలు, కలలతో వచ్చిన కొత్త స్టార్స్ కెరీర్ చివరికి ప్రశ్నార్థకంగానే అవుతుంది. ఇండస్ట్రీ మాఫియాకు బలైన అప్కమ్మింగ్ స్టార్స్కోకొల్లలుగా ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు తప్పితే.. చాలా మంది ఆడియాశలతో సినీ పరిశ్రమకు దూరమైన వారే.
Also Read: Director Bobby: ‘మన శంకర వరప్రసాద్ గారూ’ మూవీపై డైరెక్టర్ బాబీ రివ్యూ.. ఏమన్నారంటే!
‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత విజయ్ పరిస్థితి కూడా అదే. ఈ సినిమా విజయ్ నటనని స్టార్స్, స్టార్ దర్శకులు అంత పొగిడారు. కానీ, ఆ వెంటనే విజయ్ సినిమా తీసింది లేదు. మళ్లీ అతడు సినిమా చేయడానికి కొన్నేళ్లు పట్టింది. అలా ఎంతోమంది యువ హీరోలు, అప్కమ్మింగ్స్ స్టార్స్కి ఇలాంటి చేదు అనుభం ఎదురైంది. ఇప్పుడున్న సక్సెస్, పేరు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి.. స్టార్స్ పొగడ్తలను నెత్తికి ఎక్కించుకోకుండా.. ఒక్క హిట్కే గర్వపడకుండా… ఎప్పుడు అప్కమ్మింగ్ యాక్టర్‌గానే ఉండాలన్నదే బండ్లన్న ఉద్దేశం. అదే మౌళిని కూడా హెచ్చరించాడు. అందుకే బండ్లన్న అన్నదాంట్లో దప్పేముందని నెటిజన్స్, సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇక్కడ ఇండస్ట్రీ మాఫియా అంటే ఈ స్టార్ హీరోలు, దర్శక–నిర్మాతలు నుంచి వచ్చే ప్రశంసలు, పొగడ్తలు అనేది బండ్ల గణేస్ వ్యాఖ్యలు ఉద్దేశమని స్పష్టం అవుతుంది.