BigTV English
Advertisement

Bhadrakaali Movie Review : భద్రకాళి రివ్యూ… అంతా ఒకే.. కానీ పేరే బాలేదు

Bhadrakaali Movie Review : భద్రకాళి రివ్యూ… అంతా ఒకే.. కానీ పేరే బాలేదు

Bhadrakaali Movie Review : విజయ్ ఆంటోని కరీర్‌లో ‘బిచ్చగాడు’ మూవీకి మించిన మూవీ మరేది రాలుదు. ఇప్పుడు ఈయనలో 25వ సినిమా భద్రకాళి వచ్చింది. ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని తెలుగులో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినా.. సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ, సినిమాపై ఎక్కడో ఒక పాజిటివిటీ. మరి ఆ పాజిటివిటీతో రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


కథ :

రాష్ట్ర సచివాలయంలో టీ, కాఫీలు అందించే ఒక చిన్న ప్యూన్… అన్నీ లోసగులు తెలిసిన మిడియేటర్ (బ్రోకర్) అవుతాడు. అతనే కిట్టు (విజయ్ ఆంటోని). ఈ కిట్టు… తన పని చేసుకుంటూనే రాష్ట్రపతిగా పోటి చేసే ఓ బడా బిజినెస్ మ్యాన్, ఎకనామిస్ట్ అబయాంకర్ కే వ్యతిరేకంగా వెళ్తాడు. ఇక్కడ హైదరాబాద్‌లో ఉండి దేశ రాజకీయాలనే కాకుండా… ప్రపంచ మార్కెట్‌ను శాసించే అబయాంకర్‌ను ఎలా ఎదుర్కొన్నాడు ? అంతటి సామార్థ్యం కిట్టుకు ఎలా వచ్చింది ? అసలు అబయాంకర్ చేసిన తప్పులేంటి ? అబయాంకర్‌కు కిట్టుకు ఉన్న సంబంధం ఏంటి ? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

సమాజంలో జరిగే అక్రమాలు. దాని వెనక ఉండే రాజకీయ నాయకలు. వారి వెనకాల ఉండే బడా వ్యాపార వేత్తలు. ఆ వ్యాపార వేత్తల స్వార్థం. ఈ లైన్‌పై చాలా సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ సినిమాలు కాస్త అటు ఇటుగా దాదాపు ఇదే లైన్‌తో ఉండేవి. ఇప్పుడు అదే లైన్‌ను ఓ బ్రోకర్‌ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాడు డైరెక్టర్ అరుణ్ ప్రభు.


సినిమా గురించి చెప్పే ముందు… మిర్చి సినిమాలో ప్రభాస్ డైలాగ్ ఒకటి చెప్పాలి. సినిమాలో హీరోయిన్‌ పెళ్లి చూపుల టైంలో… పెళ్లి కొడుకు ఎత్తు, బరువు అన్నీ బాగున్నాయి. కానీ, పేరు బాలేదు అని అంటాడు. ఇక్కడ సినిమాలో విషయంలో కూడా అదే డైలాగ్ చెప్పొకోవచ్చు. సినిమా బాగుంది. అంతా బాగుంది. కానీ పేరే బాలేదు.

పేరు ఎందుకు బాలేదు అంటే… రన్ అయ్యే సినిమాకు టైటిల్‌కు జీరో కనెక్షన్. అసలు సంబంధం లేదు. చెప్పుకోవడానికి ఆ ఒక్క మైనస్ క్లియర్‌గా ఉంది.

ఇక మిగితా సినిమా అంటే… ఫస్టాఫ్ మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కథ కూడా బాగా రాసుకున్నాడు. హీరో ఇంట్రడక్షన్… ఆయన చేసే పని.. అవన్నీ కూడా ఒక సింగిల్ సాంగ్‌లో చూపించాడు. సినిమా స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్ స్టోరీ. ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయలేదు.

కానీ, ఇంటర్వెల్ క్లైమాక్స్‌లా అనిపించడం ఒక మైనస్ అనుకోవచ్చు. దాని దాని తర్వాత స్టోరీ ఎటు వెళ్తుందో అర్థం కాలేదు. ఎక్కడ ఆపాలో కూడా డైరెక్టర్ కి అర్థం కాలేదు అనుకుంటా. సాధారణంగా మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ కథ చెప్పే టైంలో దానిలో లీనమైతే… దానికి ఎక్కడ పులిస్టాప్ పెట్టాలో అర్థం కాదు. అచ్చం అదే పరిస్థితి సెకండాఫ్. కానీ, మెసెజ్ అయితే ఇచ్చాడు.

థియేటర్‌లో కూర్చున్న ప్రతి ఆడియన్ హీరో చెప్పే మాటలు వింటాడు. అవును నిజమే అంటూ కనెక్ట్ అవుతాడు. ఒక సందర్భంలో హీరో… 3 కోట్ల మంది దించిన తల ఎత్తకుండా సోషల్ మీడియా చూస్తున్నారు అంటూ ఓ డైలాగ్ చెప్తాడు. అది నూటికి నూరు శాతం నిజం అని చెప్పొచ్చు. ఇలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. వాటి అన్నింటికి ఆడియన్ కనెక్ట్ అవుతాడు. కానీ, దురదృష్టం ఏంటంటే… ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎక్కువ ఆడవు.

ఇంత మంచి కథను సెకండాఫ్‌ను సరిగ్గా డీల్ చేస్తే విజయ్ సేతుపతి మహారాజా మూవీలా మంచి హిట్ కొట్టే ఛాన్స్ వచ్చేది.

విజయ్ ఆంటోనీ ఒంటి చేత్తో సినిమాను నిలబెట్టాడు. ఇతనికి 100 శాతం హెల్ప్ చేశాడు అబయాంకర్ పాత్ర చేసిన నటుడు. బడా నిర్మాతగా, రాష్ట్రపతి అభ్యర్థిగా, వీటితో పాటు విలన్‌గా.. కళ్లలో యాక్టింగ్ చేశాడు. స్పెషల్ ఆఫీసర్‌ రామ్ పాత్రలో చేసిన కిరణ్ తన పరిధి మేరకు చేశాడు. ఇక మిగితా పాత్రల గురించి పెద్దగా ఏం చెప్పలేం.

మ్యూజిక్ బాగుంది. కొన్ని సందర్భంల్లో సినిమాను మ్యూజిక్ కాపాడింది. సెకండాఫ్‌లో కాస్త ఎడిటింగ్ పడి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు అంటే… సినిమా కోసం నిర్మాతలు పెద్దగా కష్టపడలేదు అనిపిస్తుంది. కానీ, మంచి మూవీ అయితే ఇచ్చారు.

ప్లస్ పాయింట్స్ :

కథ, కధనం
విజయ్ ఆంటోనీ
ఫస్టాఫ్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
టైటిల్‌తో సంబంధం లేకపోవడం
ల్యాగ్ సీన్స్

మొత్తంగా… భద్రకాళి.. భద్రమే కానీ, టైటిలే సెట్ అవ్వలేదు

Bhadrakaali Movie Rating  2.75 / 5

 

Related News

Mass Jathara Movie Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ – ‘క్రాక్’ జాతర

Mass Jathara Twitter review : మాస్ జాతర ట్విట్టర్ రివ్యూ

Baahubali: The Epic Review : “బాహుబలి ది ఎపిక్” రివ్యూ… రెండో సారి వర్త్ వాచింగేనా?

Baahubali The Epic Twitter Review : ‘బాహుబలి ది ఎపిక్’ ట్విట్టర్ రివ్యూ..మళ్లీ హిట్ కొట్టేసిందా..?

Bison Movie Review : బైసన్ మూవీ రివ్యూ

Thamma Movie Review : థామా మూవీ రివ్యూ

Thamma Twitter Review: ‘థామా’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్ కొట్టిందా..?

KRamp Movie Review : కె ర్యాంప్ రివ్యూ

Big Stories

×