AUS VS NZ: న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 ల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టి 20 సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా.. సిరీస్ కైవసం చేసుకుంది. మొదటి అలాగే మూడవ టి20 లో గెలిచి సత్తా చాటింది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 జరిగింది. ఇందులో మూడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు మిచెల్ మార్ష్ అద్భుతమైన సెంచరీ తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. 52 బంతుల్లో 103 పరుగులు చేసి.. రఫ్ ఆడించాడు మిచెల్ మార్ష్.
Also Read: Shoaib Malik Divorce: మూడో భార్యకు కూడా షోయబ్ మాలిక్ విడాకులు..? సానియా మీర్జా పాపం తగిలిందా !
న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో… మూడు వికెట్ల తేడాతో కంగారులు విజయం సాధించారు. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 156 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో కాస్త తడపబడినా… 18 ఓవర్లలో ఫినిష్ చేసింది. 18 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ చివరి వరకు ఉండి జట్టును గెలిపించాడు.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
100 UP FOR THE CAPTAIN MITCHELL MARSH. BISON, THE LONE WARRIOR FOR HIS TEAM🐂💛 pic.twitter.com/EVj0iCLirC
— Usman (@iamMrWarrior) October 4, 2025