Kingdom : నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించిన విజయ్ పెళ్లిచూపులో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచి ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఒక సంచలనం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో శివ సినిమా చూపించిన ఇంపాక్ట్ ఈ సినిమా చూపించింది.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. స్టార్ హీరో అయిపోయాడు. ఎక్కడికి వెళ్లినా కూడా విజయ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాకుండా ఆఫ్లైన్లో కూడా ఫ్యాన్స్ ను విజయ్ క్రియేట్ చేసే విధానం చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. గీత గోవిందం సినిమా తర్వాత ఇప్పటివరకు విజయ్ సరైన హిట్ సినిమా పడలేదు. అయినా కూడా విజయ్ మార్కెట్ ఏమాత్రం చెక్కుచెదరలేదు.
మొత్తం తగలబెట్టేసారు
కింగ్డమ్ సినిమా గురించి నాగ వంశీ పలుసార్లు చెబుతూనే వచ్చాడు. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని. ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే ఆ మాటలు నిజం అనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ అరాచకం అని చెప్పాలి. ఒకవైపు పోలీస్ పాత్రలో, మరోవైపు ఖైదీ పాత్రలో విజయ్ కనిపించిన విధానం చూస్తుంటే రోమాలు నిక్క పొడుచుకోవడం ఖాయం. ఈ సినిమా వాయిదా అంటూ ఫ్యాన్స్ ని కొంచెం అసంతృప్తి పరిచినా కూడా, ఈ ఒక్క వీడియోతో భారీ హై క్రియేట్ చేశారు. ఈ సినిమా జులై 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ విషయాన్ని టీజర్ విడుదల చేసి మరి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు
ప్రస్తుతం విజయ్ దేవరకొండ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ సినిమాతో పాటు, మరోవైపు రాహుల్ దర్శకత్వంలో మరో సినిమాను లైన్లో పెట్టాడు. రెండు సినిమాలను కూడా మార్చిలోపు పూర్తి చేసే పనిలో పడిపోయాడు విజయ్. ఈ విషయాన్ని దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.