ఇంటర్నెట్ లో సక్సెస్ కిడ్ అని కొట్టగానే ఓ బుజ్జోడి ఫోటో దర్శనం ఇస్తుంది. గ్రీన్, వైట్ కలర్ టీ షర్ట్ లో బీచ్ లో కూర్చొని చేతిలో ఇసుక పట్టుకుని ఏదో విజయం సాధించిన వాడిలా ఓ ఫోజు ఇస్తూ కనిపిస్తాడు. ఈ బుడ్డోడి పేరు సామీ గ్రైనర్. 2007లో అమెరికాలోని ఫ్లోరిడా బీచ్ లో అతడి తల్లి లానీ గ్రైనర్ ఈ ఫోటోను తీసింది. అప్పుడు సామీ వయసు కేవలం 11 నెలలు. ఈ ఫోటోను లానీ మొదట ఫోటో షేరింగ్ వెబ్ సైట్ అయిన ఫ్లిక్ర్ లో షేర్ చేసింది. ఆ తర్వాత ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెమ్మదిగా మీమ్ గా మారింది. చిన్న విన్నింగ్ మూమెంట్స్ ను చూపించడానికి నెటిజన్లు ఈ ఫోటోను ఉపయోగించడం మొదలు పెట్టారు. ఇంటర్నెట్ అంతా హల్ చల్ చేసింది. ఆ తర్వాత ఈ అబ్బాయి సక్సెస్ కిడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రాణాన్ని నిలబెట్టిన సామీ గ్రైనర్ ఫోటో
ఈ ఫోటో మీమ్ గా వినోదాన్ని పంచడమే కాదు.. ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. సామీ తండ్రి జస్టిన్ గ్రైనర్ ఒకానొక సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కచ్చితంగా కిడ్నీ మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారు. కానీ మూత్రపిండ మార్పిడి చికిత్స చాలా ఖరీదైనది. కుటుంబం అంత ఖర్చును భరించే స్థితిలో లేదు. లానీ, తన భర్త జస్టిన్ వైద్య చికిత్స కోసం డబ్బును సేకరించడానికి ‘GoFundMe’ అనే ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ ప్రచారానికి మద్దతు కోసం ఆమె తన కొడుకు ఫోటోను జోడించింది. ఈ ఫోటోను చూసి యావత్ ఇంటర్నెట్ స్పందించింది. ఆ అబ్బాయి మీద ప్రేమను కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆ బాబును చూసి సాయం అందించారు. కిడ్నీ మార్పిడి చికిత్స కోసం 75,000 డాలర్లు సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 100,000 డాలర్ల కంటే ఎక్కువ విరాళాలు వచ్చాయి. జస్టిన్ కు కిడ్నీ మార్పిడి చికిత్స జరిగి.. అతడు ఆరోగ్యవంతుడిగా మారాడు. సామీ, చిన్నప్పుడే తన తండ్రిని కాపాడుకున్నాడు తన వైరల్ ఫోటో సాయంతో.
సామీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
ఇప్పుడు సామీ టీనేజర్ గా మారాడు. అతడి కుటుంబ హ్యాపీగా ఉంది. కానీ, అతడు పిల్లాడిగా ఉన్నప్పుడు వైరల్ అయిన ఫోటోను, నెటిజన్లు ఇప్పటికీ మీమ్ గా ఉపయోగిస్తూనే ఉన్నారు. గ్రైనర్ కుటుంబానికి, సక్సెస్ కిడ్ అనేది కేవలం ఇంటర్నెట్ జోక్ కాదు. ఇది వారి కొడుకు ఫోటో ఒక ప్రాణాన్ని ఎలా కాపాడిందో గుర్తు చేస్తుంది.
Sammy Griner, 10 years old, today at the same beach the Success Kid photo was taken ten years ago 8/26/07 pic.twitter.com/SE3ArVLeP4
— Laney Griner (@laneymg) August 26, 2017
No one does Success Kid like #SuccessKid. pic.twitter.com/ZxAx4mCi20
— Laney Griner (@laneymg) November 20, 2015
Read Also: కారు అంత బరువున్న రాకాసి పాము.. ఇంకా పెరుగుతూనే ఉందట!