BigTV English
Advertisement

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మూవీలో నటించాలని ఉందా…అయితే ఇలా చేయండి..!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మూవీలో నటించాలని ఉందా…అయితే ఇలా చేయండి..!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్..ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉంది.. కమెడియన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన కెరియర్ ను జబర్దస్త్ మార్చేసింది. అలా జబర్దస్త్ లో అవకాశం రాకముందు మ్యూజిషియన్ గా చిన్న చిన్న షోలు చేసుకునేవారట. అలా సుధీర్ కెరీర్ ని జబర్దస్త్ మార్చేసింది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుధీర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా రాణిస్తూనే పలు షోలకు యాంకర్ గా కూడా చేశారు. అలాగే ఢీ డ్యాన్స్ షోలో మెంటర్ గా కూడా వ్యవహరించారు. అయితే అలాంటి సుడిగాలి సుధీర్ మొదటిసారి హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ అనే మూవీతో వెండితెరపై అలరించారు..


అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుధీర్..

సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీతో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సుధీర్ కి అదృష్టం వరించింది. ఎందుకంటే మొదటి సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన గాలోడు మూవీ హిట్ అయినప్పటికీ కాలింగ్ సహస్ర ఫ్లాప్ అవ్వడంతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని మళ్లీ “హైలెస్సో” అనే పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అయితే సుడిగాలి సుధీర్ లాంటి చిన్న నటుడు హైలెస్సో అనే పాన్ ఇండియా మూవీతో రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.

సుధీర్ మూవీలో నటించాలనుకునే వారికి శుభవార్త..

ఇక హైలెస్సో మూవీ కన్నడ, తమిళ,తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది.ఇదిలా ఉంటే తాజాగా హైలెస్సో మూవీకి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే చాలామందికి సినిమాల్లో నటించాలననే కోరిక ఉన్నప్పటికీ అవకాశాలు లేక మధ్యలోనే ఆగిపోతారు. కానీ సినిమాల్లో నటించాలనే కోరిక ఉన్నవారికి హైలెస్సో మూవీ యూనిట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా హైలెస్సో మూవీ యూనిట్ తమ సినిమాకి కొంతమంది నటీనటులు కావాలని ప్రకటించింది. ఆ ప్రకటనలో ఏముందంటే.. “వజ్ర వారాహి సినిమాస్ నిర్మిస్తున్న హైలెస్సో మూవీకి సంబంధించిన కాస్టింగ్ కాల్ ప్రకటన.. అయితే గోదావరి మాండలిక భాష వచ్చిన అసలు సిసలైన తెలుగు కళాకారుల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేశారు. అచ్చ తెలుగు గోదావరి మాండలిక భాషలో 1-2 నిమిషాల నిడివి గల సెల్ఫ్ షార్ట్ వీడియో తీసి తమ hailessocasting@gmail.com కి పంపించమని తెలిపారు..


ఈ వయసు గల వారు మాత్రమే అర్హులు..

ఇందులో ఎంతమందికి అవకాశం ఉందంటే.. పురుషుల్లో 20- 30 వయస్సు ఉన్నవారు 10 మంది, 14-18 సంవత్సరాల వయసు గలవారిలో ఇద్దరికి, 30-40 ఏళ్ల వయసు ఉన్నవారిలో 10మందికి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఒకరు మరుగుజ్జు పాత్ర కోసం తీసుకోబోతున్నారు. అలాగే 18 నుండి 30 ఏళ్ల వయసు ఉన్న 6 మంది మహిళలు కూడా కావాలని మేల్, ఫిమేల్ రోల్స్ ఏజ్,మెంబర్స్ తో సహా ఒక కాస్టింగ్ కాల్ ప్రకటనని ఇచ్చారు. సుధీర్ సినిమాలో నటించాలనే కోరిక ఉన్నవారు ఈ వయసు వారు అయితే కచ్చితంగా ఒక సెల్ఫీ షార్ట్ వీడియో తీసి హైలెస్సో మూవీ gmail.com కి పంపించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.

ALSO READ:Allu Sirish: ఎంగేజ్మెంట్ పై దేవుడి స్క్రిప్ట్.. శిరీష్ ఆశలన్నీ అడియాశలేనా?

హైలెస్సో మూవీ విశేషాలు..

హైలెస్సో మూవీ విషయానికి వస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్ 29న పూజ కార్యక్రమాలతో ప్రారంభించిన హైలెస్సో మూవీ వివి వినాయక్ చేతుల మీదుగా ముహూర్తం షార్ట్ కి క్లాప్ కొట్టించారు. కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న హైలెస్సో మూవీని రవి కిరణ్, శివ చెర్రీలు నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ నటుడు బిగ్ బాస్ ద్వారా మళ్ళీ పాపులర్ అయిన శివాజీ కీ రోల్ పోషిస్తున్నారు. ఇక సుధీర్ సరసన హీరోయిన్లుగా నటాషా సింగ్,నక్ష శరణ్ లు నటిస్తున్నారు. అంతరించిపోతున్న దైవికమైన సంస్కృతికి అద్దం పట్టేలా సుధీర్ హైలెస్సో మూవీ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

Related News

Baahubali The Epic :వెయిట్ చేయక్కర్లేదు, బాహుబలి చేంజెస్ కాకుండా ఇవి ఆడ్ చేశారు

Bison: U-18 మహిళల కబడ్డీ జట్టుకు మారి సెల్వ రాజ్ విరాళం, ఇది కదా అసలైన వ్యక్తిత్వం

Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Mahesh Babu: బాహుబలి పనులలో రాజమౌళి.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న మహేష్!

The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదా.. ఆమె రిజెక్ట్ చేస్తేనే ?

Lokesh Kanagaraj: లోకేష్ కి హీరోయిన్ దొరికేసిందోచ్.. రచ్చ రాంబోలే!

Big Stories

×