Children Kidnap: ముంబైలోని పోవై ప్రాంతంలో గురువారం పిల్లలను బందీలుగా తీసుకున్న ఘటనలో నిందితుడ్ని ముంబై పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఒక స్టూడియోలో దాదాపు 20 మంది పిల్లలను ఆ స్టూడియో ఉద్యోగి బందీలుగా తీసుకున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కిడ్నాపర్‌ను రోహిత్ ఆర్యగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నిర్వహించిన కౌంటర్ ఆపరేషన్‌లో నిందితుడు మృతి చెందినట్లుగా సమాచారం.
పిల్లల్ని కిడ్నాప్ చేశానంటూ నిందితుడు వీడియో విడుదల చేసిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి పిల్లలందరినీ ఎటువంటి హాని లేకుండా విజయవంతంగా రక్షించారు. ఘటనకు ముందు విడుదల చేసిన ఒక వీడియోలో “కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలనుకుంటున్నా. నాకు డబ్బు డిమాండ్లు లేవు. నేను ఉగ్రవాదిని కాదు. నాకు నైతిక సమాధానాలు మాత్రమే కావాలి’’ అని లేదా పిల్లలకు హాని జరుగుతుందని అతను చెప్పాడు. తాను కిడ్నాపర్ ను కాదని అన్నాడు. అయితే ఆడిషన్స్ పేరుతో పిల్లలను స్టూడియోకు పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది.
వీడియో సర్క్యులేట్ కావడం ప్రారంభించిన వెంటనే, పోలీసులు పోవైలోని ఆర్‌డి స్టూడియోకు చేరుకుని ఆ ప్రాంగణాన్ని సీజ్ చేశారు. వెంటనే రెస్క్యూ బృందాలను మోహరించామని, ఈ విషయాన్ని సున్నితంగా పరిగణించి, పిల్లలు క్షేమంగా ఉండేలా ఆర్యతో మాట్లాడామని పోలీసు అధికారులు తెలిపారు. “ఆడిషన్స్ కోసం వచ్చిన 100 మంది పిల్లల్లో 20 మందిని బందీని చేశాడు కిడ్నాపర్. కమాండో ఆపరేషన్ ద్వారా పిల్లలందరినీ సురక్షితంగా రక్షించాము.” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సంఘటనా స్థలం నుంచి ఎయిర్ గన్ లాగా కనిపించే ఆయుధాన్ని, కొన్ని రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రోహిత్ ఆర్య ఎవరు?
పిల్లల కిడ్నాప్ ఘటనలో ఎన్‌కౌంటర్ అయిన రోహిత్ ఆర్య నాగ్‌పూర్‌కు చెందిన యూట్యూబర్, టీచర్ అని జాతీయ మీడియా పేర్కొంది. ఈ సంఘటనకు ముందు, రాష్ట్ర ప్రభుత్వం తన విద్యా శాఖ నిధులను నిలిపివేసిందని ఆరోపిస్తూ, మహారాష్ట్ర మంత్రి దీపక్ కేసర్కార్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు ఆయన నాయకత్వం వహించినట్లు తెలిపింది.
#BREAKING | Children taken hostage in Mumbai's RA Studio building in Powai. Cops in talk with suspect.
More details awaited. pic.twitter.com/lIKxQr33ZU
— Harsh Trivedi (@harshtrivediii) October 30, 2025