BigTV English

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లోకి మరో కన్నడ నటి.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లోకి మరో కన్నడ నటి.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss 9 Telugu : తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నా టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. అయితే ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అందులోనూ బిగ్ బాస్ లోకి వచ్చే కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసే విధానంలో కూడా యాజమాన్యం మార్పులు చేసింది. హౌస్ లోకి వెళ్లడానికి సామాన్యులను సెలెక్ట్ చేసేందుకు గత కొద్ది రోజులు ముందుగా బిగ్ బాస్ అగ్ని పరీక్షను నిర్వహించారు.. ఇందులో సామాన్యులను సెలెక్ట్ చేసి డైరెక్ట్ బిగ్ బాస్ లోకి పంపించమన్నారు. అయితే గత సీజన్లో ఎక్కువగా కన్నడ యాక్టర్స్ సందడి చేశారు. మరి ఈ సీజన్ లో కూడా కన్నడ సీరియల్ నటిని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆమె ఎవరు? తెలుగులో ఆమె చేసిన సీరియల్స్ ఏంటి? బిగ్ బాస్ కోసం ఆమెకు ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ 9 లోకి కన్నడ యాక్టర్..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి రాబోతున్న కంటెస్టెంట్ ల గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కంటెస్టెంట్ల లిస్టు బయటకు రాలేదు. కానీ ఎవరి ఊహలకన్ని యాక్టర్స్ ని బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ రాసిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కన్నడ నటి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు ముద్దమందారం సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి పార్వతి.. అసలు పేరు తనుజ గౌడ.. ఈ బ్యాగ్రౌండ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఒకసారి చూద్దాం..


Also Read : మహేష్ ఎఫైర్స్ ను ఎవిడెన్స్ తో బయటపెట్టిన భార్య.. బిడ్డకోసమే ఫైట్..

తనూజ కెరీర్ విషయానికొస్తే.. 

జీతెలుగులో ప్రసారం అయిన సక్సెస్ ఫుల్ సీరియల్ ముద్దమందారం.. ఈ సీరియల్ ద్వారా కన్నడకు చెందిన తనుజా గౌడ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సీరియల్ కన్నా ముందు ఆమె కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఎక్కువగా సీరియల్స్‌లోనే నటించింది. ఇది దాదాపు 5 సంవత్సరాలు ప్రసారమైన ముద్ద మందారంతో ఆమెకు తెలుగులో పాపులారటీ తెచ్చుకుంది.. ఆ తర్వాత పెద్దగా సీరియల్స్లలో కనిపించలేదు కానీ బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్లలో కనిపించింది. ఆమె చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఈమె ఇప్పుడు బిగ్ బాస్ లోకి రాబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త కనుక నిజమైతే.. జనాలకు ఎంటర్టైన్మెంట్ పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి ఇక సీజన్ 9 లోకి ఏ సీరియల్ యాక్టర్లు ఎంట్రీ ఇస్తారో…

Related News

Agni Pariksha: డైరెక్టర్ క్రిష్ కే చెమటలు పట్టించిన అగ్నిపరీక్ష.. ఇదెక్కడి ఉత్కంఠరా బాబు?

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష పై ఆడియన్స్ రియాక్షన్..ఇదొక బొ** పరీక్ష అంటూ!

Bigg Boss 9: గంటలో కేజీ వెయిట్.. ఫోర్ హెడ్ పై పచ్చబొట్టు.. ఈ ట్విస్ట్ లు మామూలుగా లేవుగా!

Bigg Boss 9: డేర్ అండ్ డై.. హౌస్ కి మించిన ట్విస్ట్ లు.. ఊహించలేదు భయ్యో!

Bigg Boss AgniPariksha: స్థానాన్ని ఖరారు చేసుకున్న 6గురు సామాన్యులు వీరే.. పెండింగ్లో మరో 16మంది!

Big Stories

×