BigTV English

OG Movie: పవనా.. మజాకానా.. భారీగా అమ్ముడుపోయిన OG థియేట్రికల్ రైట్స్

OG Movie: పవనా.. మజాకానా.. భారీగా అమ్ముడుపోయిన OG థియేట్రికల్ రైట్స్

OG Movie: హరిహర వీరమల్లు తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం OG. కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై DVV దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. మొట్ట మొదటిసారి బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. వీరితో పాటు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఇప్పటికే OG నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అన్ని బావుండి ఉంటే OG  రిలీజ్ అయ్యి ఏడాది అయ్యేది. కానీ, పవన్ రాజకీయాల వలన ఈ సినిమా వాయిదా పడుతూ చివరికి సెప్టెంబర్ 25 న రిలీజ్ కు రెడీ అవుతోంది.

అదే రోజున అఖండ 2 కూడా వస్తుందని, ఈ రెండింటి మధ్య గట్టి పోటీ ఉంటుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూసింది. కానీ, అఖండ 2 షూటింగ్ ఇంకా ఫినిష్ కాకపోవడంతో అది వెనక్కి తగ్గి పవన్ సోలోగానే రంగంలోకి దిగుతున్నాడు. ఇక పవన్ సినిమా అంటే బయ్యర్లకు పండగే. వీరమల్లు విషయంలోనే కొద్దిగా అవకతవకలు జరిగాయి. ఎన్నో ఏళ్లుగా ఆ సినిమా రిలీజ్ కు నోచుకోకపోవడం, ఆ సినిమాపై అంత నమ్మకం లేకపోవడంతో  థియేట్రికల్ రైట్స్ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదని వార్తలు వచ్చాయి.


అయితే OG విషయంలో దానికి రివర్స్ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు పోటీ పడుతున్నారు. భారీ ధరకు  థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో OG రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుతున్న సమాచారం ప్రకారం  ఉత్తరాంధ్ర రైట్స్ ను ఒక ప్రముఖ నిర్మాత రూ. 20. 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక నైజాం హక్కుల కోసం గట్టి యుద్ధమే జరిగిందని టాక్. ఎట్టకేలకు నైజాం హక్కులను రూ. 46 కోట్లకు దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే OGకి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది. ఇక దీంతో ఫ్యాన్స్.. పవనా.. మజాకానా అలా ఉంటుంది ఆయన రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఈ క్రేజ్ కు మంచి ప్రమోషన్స్ యాడ్ చేస్తే సెప్టెంబర్ 25 న OG అనుకున్న సక్సెస్ ను అందుకోగలదు. కానీ, అది  జరిగేట్టు కనిపించడం లేదు.

ఏదో విధంగా అఖండ 2 ను వెనక్కి పంపించేశారు. ఇక ఆ అవకాశాన్ని వాడుకొని మంచిగా ప్రమోషన్స్ చేసి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేలా చేయాలి. కానీ, సోషల్ మీడియాలో OGపై నెగిటివ్ క్యాంపైన్ నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తి అయినా అవ్వలేదని, వాయిదా పడే ఛాన్స్ లు ఉన్నాయని చర్చ మొదలయ్యింది. అంతేకాకుండా మెగా హీరో నటిస్తున్నాడని, మెగా వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడని కూడా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటిపై మేకర్స్ కొద్దిగా స్పందించి.. పవన్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే సినిమా గట్టెక్కుతుందని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Mass Jathara: అనుకున్నదే అయ్యింది.. మాస్ మహారాజా కూడా వెనక్కి తగ్గాడు

Sundarakanda Movie: నారా వారి మూవీలో మంచు హీరో… ఎక్కడో బంధం కలుస్తుంది

Mirai New Release Date: మళ్లీ వాయిదా పడ్డ మిరాయ్‌, ట్రైలర్‌ అప్‌డేట్‌తో షాకిచ్చిన మూవీ టీం!

The Girlfriend: రష్మిక – దీక్షిత్ మధ్య ‘ఏం జరుగుతోంది.’. ?

Madharasi OTT : భారీ ధరకు ‘మదరాసి’ ఓటీటీ డీల్ ఫిక్స్.. ఎన్ని కోట్లంటే..?

Nara Rohit: రివ్యూవర్లను వేడుకుంటున్న నారా రోహిత్.. కాస్త దయ చూపండయ్యా!

Big Stories

×