BigTV English

War 2 Sequel : ‘వార్ 2’ ఎండ్ కార్డ్ టైటిల్స్‌లో సర్ప్రైజ్… బడా హీరోలు బ్యాక్ టూ బ్యాక్

War 2 Sequel : ‘వార్ 2’ ఎండ్ కార్డ్ టైటిల్స్‌లో సర్ప్రైజ్… బడా హీరోలు బ్యాక్ టూ బ్యాక్

War 2 sequel: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం వార్ 2.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీ గురించి గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక నిన్న జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా ఈ మూవీ క్లైమాక్స్ గురించి ఓ న్యూస్ నెట్టింట ప్రచారంలో ఉంది.


‘వార్ 2’ క్లైమాక్స్ లో ట్విస్ట్.. 

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ సీక్వెల్ గా రాబోతున్న మూవీ ఇది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమా.. ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందా? మరో హిట్ సినిమా ఎన్టీఆర్ ఖాతాలో పడుతుందా అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తున్నాయి.. ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ మూవీ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని కథనాలు వినిపిస్తున్నాయి. YRF లో తర్వాత రాబోయే సినిమాలకు సంబంధించిన పాత్రల ఎంట్రీ ఉండబోతుంది. దానికి సంబంధించిన విషయాలను బయటికి రాకుండా నిర్మాత ఆదిత్య చోప్రా చర్యలు తీసుకుంటున్నాడట.. అంటే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. దీనిపై క్లారిటీ రావాలంటే మరో రెండు రోజులు వెయిట్ చెయ్యక తప్పదు. చూద్దాం సీక్వెల్ ఉంటుందా? లేదా..?


Also Read: కూలీ, వార్ 2 సినిమాలను గజగజ వణికిస్తున్న చిన్న సినిమా… అవేం బుకింగ్స్ రా అయ్యా..

స్పై ఆఫీసర్ గా ఎన్టీఆర్.. 

హృతిక్ రోషన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.. ఎన్టీఆర్ స్పై ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు అని తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు హీరోగా అవతరిస్తారు. ఎవరు ఎవరిని డామినేట్ చేసి ముందుకు సాగుతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ ని చూస్తే హాలీవుడ్ రేంజ్ లో మైండ్ బ్లాక్ అయ్యే యాక్షన్ సన్ని వేశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ సినిమాని చూస్తే గాని ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు. మరి హృతిక్ రోషన్ ను పూర్తిగా డామినేట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ తన నటన ప్రతిభను చూపించి బాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటాడా? లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ మూవీకి బిజినెస్ కూడా భారీగానే జరిగింది..ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

Lokah: Chapter 2: ‘లోకా’ పార్ట్‌ 2 అప్‌డేట్‌ వచ్చేసింది.. సూపర్‌ హీరోగా దుల్కర్‌, విలన్‌గా టోవినో థామస్‌!

Sai Pallavi: ఏది ఇప్పుడు చెప్పండ్రా.. సాయిపల్లవి బికినీ వేసుకుందని..

Devara 2: దేవర 2 వున్నట్టే.. మరి సెట్ పైకి వెళ్ళేదెప్పుడు ?

Allu Arjun: ఏం బన్నీ.. ఓజీ చూడడమేనా.. రివ్యూ ఇచ్చేదేమైనా ఉందా.. ?

OG Child Artist: ఓజీ కూతురు బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా.. ఆదాయం కూడా అదే రేంజ్‌లో!

Ameesha Patel: ఆ హీరో ఒప్పుకుంటే.. ఒక రాత్రి గడపాలని ఉంది

The Paradise: షికంజా మాలిక్ గా మోహన్ బాబు.. ఏం లుక్ రా బాబు.. నెక్స్ట్ లెవెల్ అంతే

Allu sirish: పెళ్లి పీటలెక్కుతున్న అల్లు హీరో.. అమ్మాయి ఎవరంటే..?

Big Stories

×