E-Paper
Advertisement

‘తలైకూత్తల్’ కరుణా మరణమా?.. సంప్రదాయం ముసుగులో హత్యలా?.. పూరీ జగన్నాథ్

‘తలైకూత్తల్’ కరుణా మరణమా?.. సంప్రదాయం ముసుగులో హత్యలా?.. పూరీ జగన్నాథ్
Advertisement

Thalaikoothal Tradition: భారతదేశంలో ఎన్నో విలక్షణమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ఆచారాలు సమాజ హితాన్ని కోరితే, మరికొన్ని ఆచారాలు మాత్రం తీవ్రమైన చర్చలకు, వివాదాలకు దారితీస్తాయి. అలాంటి ఒక విచిత్రమైన, అత్యంత బాధాకరమైన ఆచారమే తమిళనాడులో గతంలో సాగిన ‘తలైకూత్తల్’ (Thalaikoothal). దీనిని సంప్రదాయబద్ధంగా సాగే ఒక రకమైన ‘మెర్సీ కిల్లింగ్’ (కరుణామరణం) లేదా వృద్ధాప్య హత్యలుగా భావించవచ్చు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన ‘పూరి మ్యూజింగ్స్’లో ఈ భయంకరమైన సాంప్రదాయం వెనుక ఉన్న సామాజిక కోణాన్ని వివరించారు.

Read als0-బుమ్రాపై చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. అది మానవ తప్పిదమంటూ క్షమాపణ!

తలైకూత్తల్ అంటే

Advertisement

పూర్వం తమిళనాడులోని కొన్ని దక్షిణ జిల్లాల్లో (ముఖ్యంగా విరుదునగర్, మదురై వంటి ప్రాంతాల్లో) ఈ ఆచారం ఎక్కువగా అమలులో ఉండేది. ఇంట్లోని పెద్దవాళ్ళు వృద్ధాప్యం మీద పడి, రకరకాల దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ, నడవలేక కదలలేక నెలల తరబడి మంచానికే పరిమితమైనప్పుడు.. వారే స్వయంగా “ఇక చనిపోదాం” అని నిర్ణయించుకుంటారు. దాన్నే ‘తలైకూత్తల్’ అంటారు.

ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ఎక్కడెక్కడో ఉన్న కొడుకులు, కూతుళ్లు, బంధువులందరికీ సమాచారం అందిస్తారు. అందరూ ఇంటికి చేరుకున్నాక ఆ వృద్ధుడు తన చివరి రెండు రోజులను మనవళ్లు, మనవరాళ్లతో ఎంతో ఆనందంగా గడుపుతాడు. తాను చెప్పాలనుకున్న చివరి మాటలను అందరికీ చెబుతాడు. ఆ తర్వాతే అసలు కార్యక్రమం మొదలవుతుంది.

చంపే ప్రక్రియ

Advertisement

బంధువుల సమక్షంలో సదరు వృద్ధునికి ఒంటికి, తలకి నూనె రాసి బాగా మర్దన చేస్తారు. ఆ తర్వాత చన్నీళ్లతో తలస్నానం చేయించి, కడుపు నిండా కొబ్బరి నీళ్లు తాగిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న బలహీనమైన శరీరానికి ఇలా ఒకేసారి చన్నీళ్ల స్నానం, కొబ్బరి నీళ్లు ఇవ్వడం వల్ల విపరీతమైన జ్వరం వస్తుంది. దీనివల్ల కిడ్నీలు ఫెయిల్ అయి, కేవలం రెండు రోజుల్లోనే ఆ వ్యక్తి చనిపోతాడు. కొన్ని సందర్భాల్లో బలవంతంగా పాలు తాపడం లేదా విషపూరిత మూలికలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెబుతుంటారు.

ఈ ఆచారం వెనుక కారణాలు

ఈ క్రూరమైన సాంప్రదాయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి.

తీవ్రమైన పేదరికం: జబ్బు పడి మంచాన పడ్డ వృద్ధులు పేద కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద భారంగా మారేవారు. వారి వైద్యం కోసం అప్పులు చేయడం లేదా ఉన్న ఇల్లు, భూమి అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. తన వల్ల తన పిల్లలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొందరు వృద్ధులు ఈ మరణానికి అంగీకరించేవారు.

వైద్య సౌకర్యాల కొరత: అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో సరైన హెల్త్ కేర్ మౌలిక వసతులు లేకపోవడం వల్ల, నయం కాని రోగాలతో బాధపడేవారి బాధను చూడలేక కూడా ఈ పద్ధతిని పాటించేవారు.

Read also-Gundeninda GudiGantalu Today episode: రోహిణి మళ్ళీ ఇరుక్కుంటుందా..? ప్రభావతికి నిజం తెలిస్తే.. మీనా ప్లాన్ సక్సెస్..

ఆస్తుల కోసం అక్రమాలు

ప్రారంభంలో ఇది కరుణామరణంలా సాగినప్పటికీ, కాలక్రమేణా ఈ ఆచారం పూర్తిగా దుర్వినియోగమైంది. కొంతమంది స్వార్థపరులైన పిల్లలు ఆస్తుల కోసం, లేదా తల్లిదండ్రులను పోషించడం భారం అనిపించి.. వృద్ధులకు ఇష్టం లేకపోయినా ఈ ‘తలైకూత్తల్’ పేరుతో బలవంతంగా చంపడం మొదలుపెట్టారు.

ఈ దారుణాలు బయటికి రావడంతో మానవ హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. ప్రభుత్వం ఈ ఆచారాన్ని పూర్తిగా చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ నిషేధించింది. 2010 వరకు కూడా తమిళనాడులోని కొన్ని మారుమూల గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచి, ఈ తరహా ఘటనలు జరగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.

సామాజిక స్పృహ..

ఈ సున్నితమైన, హృదయ విదారకమైన సామాజిక రుగ్మతపై ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. అలాగే 2023లో తమిళంలో ‘తలైకూత్తల్’ అనే పేరుతోనే ఒక విమర్శనాత్మక చిత్రం కూడా విడుదలైంది. పేదరికం, అజ్ఞానం, సాంప్రదాయ నమ్మకాలు కలిసి ఒక సమాజంలో ఎలాంటి క్రూరత్వానికి దారితీస్తాయో చెప్పడానికి ఈ ఆచారమే ఒక సజీవ ఉదాహరణ. ప్రగతిశీల సమాజంలో వృద్ధులకు రక్షణ, సరైన వైద్యం అందించడం మనందరి బాధ్యత అని ఈ ఉదంతం గుర్తుచేస్తుంది.అంటూ పూరీ జగన్నాధ్ చెప్పిన థీరీ అందరినీ ఆలోచింపజేస్తుంది.

Related News

హాస్పిటల్ పాలైన మమితా బైజు.. వీడియో వైరల్!

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

Big Stories

Advertisement
×