E-Paper
Advertisement

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా

ఒక ప్రయాణం… రెండు ప్రేమకథలు… ప్రతి కుటుంబం చూడాల్సిన రోడ్ ట్రిప్ డ్రామా
Advertisement

Feel Good Road TripDrama: కొన్ని సినిమాలు రొటీన్ ప్రేమకథల మాదిరిగా ఉండవు… బంధాలను ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పిస్తాయి. అపార్థాలు, అహంకారం, స్ట్రెస్ వంటి సమస్యలతో దూరమవుతున్న మనుషులకు చిన్న ఆశను చూపిస్తాయి. అలాంటి హృదయాన్ని హత్తుకునే కథతో ప్రేక్షకుల ముందుకొచ్చింది Bhuvanam Gaganam. కన్నడలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ ఫీల్‌గుడ్ రోడ్ ట్రిప్ డ్రామాలో… ప్రేమ, కుటుంబం, స్నేహం, జీవితం విలువలను ఎంతో సహజంగా చూపించారు. అయితే ఇది ఒకే కథ కాదు… రెండు విభిన్నమైన జీవితాలను ఒకే ప్రయాణంలో కలిపి చెప్పిన స్పెషల్ మూవీ. ఈ సినిమాను ఏ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

సినిమా రెండు వేర్వేరు ప్రేమ కథలతో ప్రారంభమవుతుంది. కాలేజీలో చదువుతున్న అభి, తన జూనియర్ నందినిని ప్రేమిస్తాడు. అయితే కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంతరాల కారణంగా వారి ప్రేమకు పెద్దల నుంచి అంగీకారం దక్కదు. చివరకు ఇద్దరూ తమ జీవితాన్ని తామే నిర్మించుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ పెళ్లి తర్వాత బాధ్యతలు పెరగడంతో వారి మధ్య చిన్న చిన్న అపార్థాలు మొదలై… బంధమే ప్రశ్నార్థకంగా మారుతుంది.

Advertisement

మరోవైపు గ్రామంలో ఉండే రామ్ జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మానసిక, శారీరక ఎదుగుదలలో ఇబ్బందులు ఎదుర్కొన్న అతడిని సమాజం అంతగా అంగీకరించదు. కానీ అతని చిన్ననాటి స్నేహితురాలు భూమి మాత్రం ప్రతి క్షణం అతనికి తోడుగా నిలుస్తుంది. ప్రేమ, ఆప్యాయత, గుర్తింపు కోసం రామ్ పడే తపన మనసును తాకుతుంది.

ఇంకోవైపు జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుంచి కాస్త దూరంగా వెళ్లాలని అనుకున్న అభి, రామ్ అనుకోకుండా ఒకే ప్రయాణంలో కలుస్తారు. కన్యాకుమారి వైపు సాగిన ఆ రోడ్ ట్రిప్… వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోవడం, బంధాల అసలు విలువ తెలుసుకోవడం, జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ఈ ప్రయాణంలో జరుగుతుంది. అయితే వారి జీవితాల్లో వచ్చిన అసలు మార్పు ఏమిటి ? ప్రేమను, కుటుంబాన్ని వారు ఎలా తిరిగి అర్థం చేసుకున్నారు ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో ఉందా ?

Advertisement

ప్రస్తుతం ‘భువనం గగనం’ సినిమా ZEE5లో డిజిటల్ ప్రీమియర్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రకృతి అందాలు, హృదయాన్ని హత్తుకునే సంగీతం, సహజమైన భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. ప్రేమను కేవలం రొమాన్స్‌గా కాకుండా… ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అండగా నిలవడం అనే కోణంలో దర్శకుడు గిరీష్ మూలిమాని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. రిలేషన్‌షిప్‌లు, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో కూడిన ఫీల్‌గుడ్ సినిమా కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. నెమ్మదిగా సాగే కథ అయినప్పటికీ… ప్రతి పాత్ర, ప్రతి సంభాషణ మనసును తాకేలా ఉంటుంది. ముఖ్యంగా అపార్థాల వల్ల దూరమవుతున్న బంధాల విలువను గుర్తు చేసే ఈ సినిమా, కుటుంబంతో కలిసి చూసేందుకు మంచి ఆప్షన్.

Read Also: కొడుకుపైనే అనుమానం… శవాన్ని తవ్వించి మరీ డీఎన్ఏ టెస్ట్ చేయించే తండ్రి

Tags

Related News

తల్లికి పెళ్లి చేయాలనుకునే పెళ్లీడుకొచ్చిన కొడుకు… విజయ్ ఆంటోని ఫ్యామిలీ డ్రామా తెలుగులో

కుస్తీ పోటీల్లో ఇరగదీసే భార్య… ఇంట్లోనే స్ట్రగులయ్యే భర్త… తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు తెలుగులోనే

చెక్క వంతెన దాటితే చావు మూడినట్టే… క్లైమాక్స్‌తో పిచ్చెక్కించిన మలయాళం కల్ట్ మూవీ తెలుగులో

కొడుకుపైనే అనుమానం… శవాన్ని తవ్వించి మరీ డీఎన్ఏ టెస్ట్ చేయించే తండ్రి

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ మూవీస్.. ఒక్కరోజు 14 సినిమాలు స్ట్రీమింగ్..!

అంతరిక్షంలో ప్రతీకార ప్రయాణం… రెండు ఓటీటీల్లోకి డీసీ కొత్త సూపర్‌గర్ల్ మూవీ

చనిపోయే ముందు రాబిన్ హుడ్ చేసిన చివరి పని… గూస్‌బంప్స్ గ్యారెంటీ మావా

Big Stories

Advertisement
×