Why Chiranjeevi :చిరంజీవి గారు మీరే దిక్కు ..ఎలా అయినా చిరునే ఆదుకోవాలి..ఆయన తొందరగా ఆదుకుంటే ఒక ప్రాణం నిలిచేది .
ఓవరాల్ గా సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా… సోషల్ మీడియాలో మొదట వినిపించే మాట ఒక్కటే.
చిరంజీవి…చిరంజీవి…చిరంజీవి…అసలు ఈ లాజిక్ ఏంటో అర్థం కాదు.
ఎవరికైనా అనారోగ్యం వచ్చినా చిరునే కావాలి… ఆర్థిక ఇబ్బందులు వచ్చినా చిరునే కావాలి… ఎవరో చనిపోయినా చిరునే రావాలి… అంత్యక్రియలకు కూడా చిరునే ఉండాలి. మరి మిగతా హీరోలు, నిర్మాతలు, పెద్దలు… వాళ్లంతా ఎందుకు ఉన్నారు?
పావలా శ్యామల మరణం నిజంగా బాధాకరం.ఆమె చివరి రోజుల్లో పడిన కష్టాలు ఎవరినైనా కంట తడి పెట్టించేవే.తల్లిని కోల్పోయిన బాధలో ఆమె కుమార్తె మాధవి ఆవేదన వ్యక్తం చేయడం కూడా సమంజసమే.కానీ ఆ బాధ మొత్తం చిరంజీవి మీద వేయడమే ఇపుడు డిబేట్లకి దారి తీస్తుంది.
అసలు ఇండస్ట్రీ అంటే ఒక్క చిరంజీవేనా?
మెగా స్టార్ గా ఎదగొచ్చు.కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉండవచ్చు.కానీ అవే కోట్ల రూపాయలు పారితోషికాలు తీసుకునే హీరోలు ఉన్నారు… వందల కోట్ల సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారు… పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి… ‘మా’ అసోసియేషన్ ఉంది… ఇంకెంతో మంది ప్రముఖులు ఉన్నారు.కష్టాలలో ఉన్న వారి ఆక్రందన ఎందుకో ఒక్క చిరంజీవి దగ్గరే ఆగిపోతుంది.
చిరంజీవి గతంలో ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్న సినీ కళాకారులకు సాయం చేసింది మనం కళ్ళారా చూశాం.ఇక కరోనా సమయంలో వేలాది సినీ కార్మికులకు చేసిన సాయం మనం మర్చిపోలేము కూడా.ఇక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఏంటో మందికి రక్తదానం చేస్తున్నారు కూడా.ఇక మీరే ఆదుకోవాలి అంటూ దగ్గరికి వచ్చిన వారికి తన చేతనైనంత చేయడం మీడియాలో కనిపిస్తుంటునే ఉంది.
అయినా ప్రతి కష్టకాలంలోనూ మళ్లీ అదే ప్రశ్న…’చిరంజీవి ఎందుకు చేయలేదు?అని కాని అదే ప్రశ్న మిగతావాళ్ల దగ్గరికి మాత్రం వెళ్ళే సాహసం చేయదు.
మిగతా పెద్దల పాత్ర ఏమీ లేదా?
ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సమస్యకు చిరంజీవే పరిష్కారం అయితే… మిగతా పెద్దల పాత్ర ఏమీ లేదా? వాళ్ల బాధ్యత ఏంటి? ప్రతి విషయంలో ఒక్కరి వైపే వెళ్ళు వెళ్ళే కంటే మొత్తం పరిశ్రమ బాధ్యత తీసుకుంటే ఇంకా సమంజసంగా ఉంటుంది కదా.
ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీలో చివరి రోజులు వెళ్ళదీస్తున్న వాళ్ళు, సినిమా రంగాన్నే నమ్ముకొని వయసు మీద పడ్డ వృద్దుల వంటి వారి కోసం శాశ్వతంగా వైద్యం అందించే వ్యవస్థ ఏర్పాటు చేయడం, అత్యవసర పరిస్థితులలో ఇచ్చేలా నిధి,నెలవారీగా పెన్షన్ వంటి ఉంటే… ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ఇంటి తలుపు తట్టాల్సిన అవసరమే ఉండదు.
అపుడు బాధ వచ్చినప్పుడల్లా…”చిరు ఎక్కడ?” అని అడగడం కంటే…”ఇండస్ట్రీ ఎక్కడ?అని అడిగితేనే అసలు సమాధానం దొరుకుతుంది.!
also read :విశ్వంభరా… వస్తున్నావా..? లేక ఊరికే చెబుతున్నావా..?