E-Paper
Advertisement

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!
Advertisement

Adarsha Kutumbham:వెంకటేష్ కి ఆడియన్స్ లో.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో  ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు.ఫ్యామిలీ ఎమోషన్స్ ని ,మిడిల్ క్లాస్ కష్టాల్ని తనదైన టైమింగ్ తో అద్భుతంగా ప్రజెంట్ చేసే వెంకీ మామ ఇపుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే సినిమాని చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 2న రాబోతుంది అంటూ అనౌన్స్ చేస్తూ తాజాగా టీజర్ వదిలింది మూవీ టీం .

ఇక ఈ సినిమాలో వెంకీ మామని మరోసారి పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్ గా చూపెట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .ఇంటి ఖర్చులు ,భార్యతో గొడవలు, పిల్లల చదువులు ,అప్పులు ఆఫీస్ టెన్షన్స్ అంటూ మిడిల్ క్లాస్ మెలోడీస్ తో టీజర్ అంతా నింపేశాడు గురూజీ .

Advertisement

అయితే అన్నింటిని చూస్తుంటే గతంలో ఇదివరకే వచ్చిన సినిమాల లోని సీన్స్ అన్నిటిని మిక్సీ వేసి తీసినట్టుగా ఉంది అన్న టాక్ వినిపిస్తుంది .ముఖ్యంగా వెంకటేష్ కి ఇలాంటి రోల్స్ కొట్టినపిండి. న్యాచురల్ గా నటించినా ఆయన క్యారెక్టరైజేషన్ కొత్తగా లేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనస్ అన్న టాక్ వినిపిస్తుంది.

ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకీ మామ మళ్లీ వెంటనే ఫ్యామిలీ సినిమాలో నటించడం ఆడియన్స్ కి అంతగా రుచించట్లేదు. మళ్లీ మళ్లీ రిపీట్ గా అదే చూసినట్టు అనిపిస్తుంది.

Advertisement

ఇక అక్కడితో ఆగకుండా, అనుకోకుండా లాటరీ తగలటం, దాంతో కుటుంబం లైఫ్ స్టైల్ ఒక్కసారిగా మారిపోవడం అనే పాయింట్ కూడా ఇప్పటికీ చాలా సినిమాల్లో వచ్చిందే.ఒక మామూలు ఫ్యామిలీకి డబ్బు రావడం, ఆ తర్వాత సమస్యలు పుట్టుకు రావడం అనే కాన్సెప్ట్ ని గతంలో ఎంతో మంది ఫిలిం మేకర్స్ అరగదీసేశారు.

ఇలాంటి అరిగిపోయిన కాన్సెప్ట్ కి త్రివిక్రమ్ మళ్ళీ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో చూడాలి .ఏదైనా కొత్త ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఇలాంటి సినిమాలు అంత ఈజీగా ఆకట్టుకోవు .. పైగా టీజర్ లో ఎక్కడ చూసినా పాత సినిమాల వాసనలు అడుగడుగునా కనిపిస్తున్నాయి .

ఇక అన్నింటికన్నా ముఖ్యంగా గురూజీ గురించే డిస్కషన్ నడుస్తోంది.ఒకప్పుడు ఆయన రాసిన ఒక్కో డైలాగ్ థియేటర్లో తూటాలా పేలేది. ముఖ్యంగా స్టోరీ ఎలా ఉన్నా సీన్స్ వాటిలో వచ్చే డైలాగ్స్ తోనే సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.కానీ ఈ మధ్య కథ కంటే డైలాగులు, అందులోని ప్రాసలే ఎక్కువగా హైలైట్ అవుతున్నాన్న టాక్ వినిపిస్తుంది.ముఖ్యంగా గుంటూరు కారం తర్వాత ఈ టాక్ మరీ ఎక్కువైంది .

ఇప్పుడు ఆదర్శ కుటుంబం టీజర్ లో ప్రాసలు , పంచులే ఎక్కువగా వినిపించడంతో త్రివిక్రమ్ మళ్ళీ అదే ట్రాక్ లోకివెళ్ళాడు అనుమానాన్ని రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్.

ముఖ్యంగా టీజర్ లో నది గట్టు దాటితే వరద అంటారు సముద్రం దాటితే ఉప్పెన అంటారు అదే సామాన్యుడు దాటితే ఏమంటారో చెప్పాలి అనే డైలాగ్ వినడానికి బాగానే ఉన్నా కేవలం ప్రాసల ఆధారంగానే ఈ సినిమా నడిపించాలని చూస్తే చాలా కష్టం.

కథలో భాగంగా డైలాగు వస్తే గుర్తుండిపోతుంది కానీ కథని దాటి డైలాగు వస్తేనే ఆడియన్స్ ఈజీగా మర్చిపోతారు. టీజర్ చూశాక ఇదే అనిపిస్తుంది కూడా.

ముఖ్యంగా ఫ్యామిలీ కోసం హీరోలు యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోవడం అనేది ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసాం ఇప్పుడు వెంకీ ఫ్యామిలీ ఇమేజ్ కి యాక్షన్ ని కలపడం కూడా బలవంతంగా పెట్టినట్టే కనిపిస్తుంది .

ALSO READ:ఒక్క హిట్ పడితే ఏకంగా 60 కోట్లా? నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న రవితేజ!

ఇక టీజర్ చూస్తే కథ కంటే వెంకీ ఇమేజ్ ని కామెడీ టైమింగ్ మాత్రమే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఏదేమైనా టీజర్ చూసి సినిమా మొత్తాన్ని జడ్జ్ చేయడం తొందరపాటే. చూడాలి అక్టోబర్ 2న ఈ సినిమా ఈ ప్రశ్నలకు ఎలా జవాబు ఇస్తుందో.

Tags

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×