E-Paper
Advertisement

ప్రపంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు

ప్రపంచంలోనే తొలి సీక్రెట్ స్పై ఏజెన్సీ ఎలా పుట్టింది ? ఈ మూవీ చూస్తే షాక్ అవుతారు
Advertisement

Hollywood Spy Thriller: ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ‘Kingsman’ సిరీస్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రం ‘The King’s Man’. ప్రపంచాన్ని కాపాడే ఫస్ట్ ఇండిపెండెంట్ స్పై సంస్థ ఎలా పుట్టింది ? దాని వెనుక ఎవరి త్యాగం ఉంది ? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే కథ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ హాలీవుడ్ చిత్రంలో చరిత్ర, యాక్షన్, భావోద్వేగాలను అద్భుతంగా మేళవించారు. మరి ఈ సినిమా కథ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ ప్రభువు ఓర్లాండో ఆక్స్‌ఫర్డ్ తన భార్యను కోల్పోయిన తర్వాత హింస, యుద్ధాలకు పూర్తిగా దూరంగా జీవించాలని నిర్ణయించుకుంటాడు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని కోరుకునే అతను, తన ఏకైక కుమారుడు కాన్రాడ్ కూడా యుద్ధానికి వెళ్లకుండా కాపాడాలని ప్రయత్నిస్తాడు. అయితే ప్రపంచ పరిస్థితులు మాత్రం వేగంగా మారిపోతుంటాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇదే సమయంలో తెరవెనుక ఒక రహస్య ముఠా ప్రపంచ దేశాలను పరస్పరం యుద్ధాల్లోకి నెట్టేందుకు కుట్రలు పన్నుతుంటుంది. ఆ ముఠాకు నాయకత్వం వహించే వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియదు. అతని ఆదేశాలతో పని చేసే ప్రమాదకరమైన వ్యక్తులు ప్రపంచ రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తుంటారు.

Advertisement

ఈ కుట్రల ప్రభావంతో మొదటి ప్రపంచ యుద్ధం మరింత భీకరంగా మారుతుంది. యుద్ధాన్ని ఎంత దూరం పెట్టాలని ప్రయత్నించినా, పరిస్థితుల కారణంగా కాన్రాడ్ చివరకు యుద్ధ రంగంలోకి అడుగు పెడతాడు. అక్కడ జరిగిన ఒక విషాద సంఘటన ఓర్లాండో జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది. ఆ తర్వాత ప్రపంచాన్ని కాపాడాలంటే ప్రభుత్వాల కంటే వేగంగా, రహస్యంగా పని చేసే ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరమని ఓర్లాండో గ్రహిస్తాడు. తనకు అత్యంత నమ్మకమైన షోలా, పాలీతో కలిసి ఒక రహస్య నెట్‌వర్క్‌ను నిర్మించడం ప్రారంభిస్తాడు. దేశాలకు కనిపించకుండా సమాచారాన్ని సేకరించడం, ప్రపంచానికి ముప్పుగా మారిన శత్రువులను గుర్తించడం, వారి కుట్రలను అడ్డుకోవడమే వారి లక్ష్యం.

ఇదే సమయంలో ఆ రహస్య ముఠాలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులతో వీళ్ళు ఎదురు పడతారు. ముఖ్యంగా రష్యాకు చెందిన రాస్పుటిన్‌తో జరిగే సంఘటనలు కథను మరో స్థాయికి తీసుకెళ్తాయి. అతని తెలివితేటలు, క్రూరత్వాన్ని ఎదుర్కోవడానికి ఓర్లాండో బృందం చేసే ప్రయత్నాలు ఉత్కంఠను పెంచుతాయి. ఒక్కో మిషన్‌తో శత్రువుల అసలు ప్రణాళిక బయట పడుతుంటుంది. ప్రపంచ యుద్ధం వెనుక దాగి ఉన్న నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటాయి.

Advertisement

చివరికి ప్రపంచాన్ని యుద్ధంలోకి నెట్టిన అసలు సూత్రధారి ఎవరు ? ఓర్లాండో అతని కుట్రలను అడ్డుకోగలిగాడా ? ప్రపంచంలోనే తొలి స్వతంత్ర స్పై ఏజెన్సీ ఎలా ఏర్పడింది ? కింగ్స్ మ్యాన్ అనే పేరు వెనుక ఉన్న అసలు కథ ఏమిటి ? అనే విషయాలను సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ?

‘ది కింగ్స్ మ్యాన్’ చిత్రంలో రాల్ఫ్ ఫీన్స్, జెమ్మా ఆర్టర్టన్, జిమోన్ హౌన్సౌ, హారిస్ డికిన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలో JioHotstar, Amazon Prime Videoలో ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా రాస్పుటిన్‌తో సాగే యాక్షన్ ఎపిసోడ్, చివరి వరకు కొనసాగే సస్పెన్స్ ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి.

Read Also: డ్యాన్స్ చేస్తూ గ్యాంగ్‌స్టర్లను చితగ్గొట్టే అమ్మాయిలు… ఈ థ్రిల్లర్ నెక్స్ట్ లెవెల్

Tags

Related News

చీకటి గుహలో ఐదుగురు ఫ్రెండ్స్… వెంటాడే రాక్షస చేప.. తెలుగులో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్

ఈ రైల్వే స్టేషన్‌లో అడుగుపెడితే చావుతో చెలగాటమే… వణికించే కొరియన్ హారర్ థ్రిల్లర్ తెలుగులో

251 రూపాయలకే ఫోన్ పేరుతో దేశాన్ని మోసం చేసిన రియల్ స్కామ్… ఇప్పుడు తెలుగు సిరీస్‌గా ఓటీటీలోకి

ఏది కోరుకున్నా క్షణాల్లో ఇచ్చే గది…. బయటకు తీసుకెళ్తే మొత్తం బూడిదే

కిటికీలో నుంచి చూసి పక్కింటోడిపై పిచ్చి… సింగిల్ గా చూడాల్సిన బోల్డ్ మూవీ

వేల ఏళ్ల రహస్యం… ప్రేమిస్తే శక్తులు మాయమయ్యే తాగుబోతు సూపర్ హీరో కథ

డ్యాన్స్ చేస్తూ గ్యాంగ్‌స్టర్లను చితగ్గొట్టే అమ్మాయిలు… ఈ థ్రిల్లర్ నెక్స్ట్ లెవెల్

Big Stories

Advertisement
×