Palak Tiwari:పాలక్ తివారీ… మనకి కాస్త కొత్తగా అనిపించినా బాలీవుడ్‌లో కాస్త పేరున్న భామే.స్టార్ కిడ్ అయినప్పటికీ తనకంటూ ఒక సొంత గుర్తింపును తెచ్చుకోవడానికి ఈ భామ చాలా కష్టపడుతుంది. ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ కుమార్తె అవడం తో పాలక్‌కు చిన్నతనం నుంచే గ్లామర్ ప్రపంచంతో మంచి పరిచయం ఉంది కూడా.
అయితే కేవలం తల్లి ఇమేజ్‌ను మాత్రమే నమ్ముకోకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు చేస్తూ తన ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేయడం విశేషం.
సోషల్ మీడియా లో సాలిడ్ ఫాలోయింగ్
అయితే సినిమాల్లో ఇంకా పూర్తి స్థాయిలో సత్తా చూపనప్పటికీ అప్పుడే సోషల్ మీడియా లో సాలిడ్ ఫాలోయింగ్ ని మూట గట్టుకోవడం విశేషం.అలా ఒక ఒక ఫ్యాషన్ ఐకాన్‌గా స్టేటస్ సంపాదించిన ఈ భామ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించినా, మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో మెరిసినా తన గ్లామర్‌తో ఫాలోవర్స్ ని ఇట్టే ఆకట్టుకోవడం విశేషం.
ఈ క్రమంలోనే తాజాగా ఒక చీరకట్టులో పలక్ ఉన్న లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సింపుల్ కలర్ కాంబినేషన్, హెవీ జ్యువెలరీ, స్టైలిష్ హెయిర్‌స్టైల్‌తో ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి
‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో కీ రోల్
పాలక్ కెరీర్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలో కీ రోల్ పోషించిన ఈ భామ మంచి పేరే కొట్టేసింది .ముఖ్యంగా2023లో వచ్చిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే వంటి పెద్ద నటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమెకు మంచి ఎక్స్‌పోజర్‌ను తీసుకొచ్చిందని చెప్పాలి.
దీనికంటే ముందే ‘యాంటిమ్’ సినిమా సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం కూడా పాలక్‌కు ఉంది. సల్మాన్ ఖాన్ సెట్స్‌లో పనిచేయడం వల్ల కెమెరా వెనుక పనుల గురించి, మేకింగ్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నానని ఆమె గతంలో చెప్పింది కూడా.
నటిని బయటకు తీసే విభిన్నమైన పాత్రలు
ఈ సినిమా తర్వాత పాలక్ తివారీ ‘ది భూత్నీ’, ‘రోమియో ఎస్3’ వంటి చిత్రాల్లోనూ కనిపించింది అలరించింది. ‘ది భూత్నీ’ సినిమాలో సన్నీ సింగ్, మౌనీ రాయ్, సంజయ్ దత్ వంటి పేరున్న నటులతో కలిసి నటించి సత్తా చాటింది .ఇక 2025లో వచ్చిన ‘రోమియో ఎస్3’ కూడా ఆమె కెరీర్‌లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది.. కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా తనలోని నటిని బయటకు తీసే విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నానని
పాలక్ పలు సార్లు తెలిపింది కూడా.
also read:ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!
ఫ్యాషన్ లుక్స్‌కి విపరీతమైన రెస్పాన్స్
ఇక ఈక్రమంలోనే 2026లో వచ్చిన ‘లుక్కే’ సిరీస్‌లో తనకు నటించడానికి మంచి అవకాశం దొరికిందని చెప్పుకొచ్చింది.ఇప్పటివరకు పాలక్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద బ్లాక్‌బస్టర్లుగా నిలవకపోయినా, ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ఫొటోలు, కొత్త ఫ్యాషన్ లుక్స్‌కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుందనడం లో సందేహం లేదు !