E-Paper
Advertisement

విశ్వంభరా… వస్తున్నావా..? లేక ఊరికే చెబుతున్నావా..?

విశ్వంభరా… వస్తున్నావా..? లేక ఊరికే చెబుతున్నావా..?
Advertisement

Chiranjeevi Birthday: ఆగస్టు 22.. ఇది మామూలు రోజు కాదు చిరంజీవి పుట్టిన రోజు. అంటే మెగా ఫ్యాన్స్ కి పండగ రోజు.ఇక ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా బర్త్‌డే ట్రీట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.పైగా ఈ ఏడాది “మన శంకరవరప్రసాద్ గారు”తో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు కూడా.మొత్తంగా అభిమానుల రెండేళ్ళ ఎదురు చూపులకి ఈ ఒక్క సినిమాతోనే ఎండ్ కార్డ్ వేసేశాడు చిరు.ఇక ఇపుడు అందరు చూపులు ఆగస్ట్ 22న వచ్చే బర్త్‌డే ట్రీట్స్ మీదే.

బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మెగా 158 నుంచి టైటిల్‌తో పాటు టీజర్ రావడం దాదాపు ఖాయమే అంటున్నారు.తమన్ కూడా టీజర్ వర్క్ జరుగుతోందని ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు. అంటే ..ఆ విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనే లేదన్న మాట .

Advertisement

టెన్షన్ అంతా  విశ్వంభర మీదే

కానీ అసలు అభిమానుల టెన్షన్ అంతా  విశ్వంభర మీదే.ఈ సినిమా గురించి టాపిక్ వస్తే చాలు ”ఇదిగో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం, అదిగో VFX వర్క్ జరుగుతుంది, సినిమా ఎప్పుడొచ్చిన సూపర్ హిట్ కొట్టడం పక్కా” అన్న టాక్ మాత్రమే వినిపిస్తుంది తప్ప ,ఆ వచ్చేది ఎప్పుడో చెప్పలేదు.కానీ ఇప్పుడు మాత్రం అలా కాదండోయ్… అక్టోబర్ 15 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నామని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. అవసరమైతే రజనీకాంత్ జైలర్ 2తో క్లాష్ అయినా సిద్దమే అంటున్నారు కూడా.

Advertisement

also read :అరుదైన మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు..అసలు స్టోరీ ఇదే!

నిజానికి … విశ్వంభర మీద ఒకప్పుడు ఉన్న హైప్ ఇప్పుడు ఉందా అంటే అనుమానమే.కారణం అప్డేట్స్ లేకపోవడమే.గత ఏడాది లేదనకుండా ఒక పాట వదిలారు.కానీ ఇపుడు అది ఎంత మందికి గుర్తుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్.పోనీ  పండగలకైనా ఓ పోస్టర్, ఓ గ్లింప్స్, ఓ చిన్న వీడియో వదిలారా అంటే అదీ లేదు.అలాంటిది వదిలినా ఇంతటి డిస్కషన్ ఉండేది కాదేమో.

కానీ మేకర్స్ మాత్రం అబ్బే తొందర ఏముందిలే అనుకుంటూ సైలెంట్ మోడ్‌లోనే ఉండిపోయారు.ఇదిగో ఆ సైలేన్సే ఇపుడు సినిమాకి బజ్ లేకపోవడానికి కారణం అన్నది ఇన్ సైడ్ టాక్.

మరి విశ్వంభర సంగతేంటి..?

మరోవైపు మాత్రం సంక్రాంతి రేస్‌కు దూసుకెళ్ళిపోతున్నాడు బాబీ.వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేసి పెద్ద హిట్ కొట్టాలనే ప్లాన్‌లో  ఉన్నాడు.కాని దర్శకుడు వశిష్ట మాత్రం బయట ఈవెంట్లలో కనిపిస్తున్నాడు కానీ… విశ్వంభర గురించి మాత్రం నోరు విప్పడం లేదు.

ఇప్పుడు ఫ్యాన్స్ అడిగేది ఒక్కటే…మెగా 158 టీజర్ ఓకే… మరి విశ్వంభర సంగతేంటి..?అని

బర్త్‌డే రోజు రెండు ట్రీట్స్ ఇస్తారా..? లేక ఒకదానితోనే “సర్దుకోండి బాబూ” అంటారా..?అనేది చూడాలి.ఎందుకంటే… ఇప్పటివరకు “వస్తుంది… వస్తుంది…” అని చెప్పడమే తప్ప… “ఇదిగో వచ్చేసింది” అని చెప్పింది లేదు మరి.

అందుకే మెగా ఫ్యాన్స్ కూడా ఈసారి క్లియర్‌గా అంటున్నారు…మాటలు కాదు బాస్… అప్డేట్ పడాలి… లేదంటే మళ్లీ అదే కథ అనుకుంటాం!

మరి ఆగస్టు 22న నిజంగానే రెండు మెగా ట్రీట్స్ పడతాయా..? లేక ఫ్యాన్స్‌కు మరోసారి వెయిటింగ్ తప్పదా అనేది కాలమే డిసైడ్ చేయాలి.

also read :అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?

Related News

ఎవరికి ఏం జరిగినా చిరునే కావాలా..? ఇదేం లాజిక్..!

అరుదైన మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు..అసలు స్టోరీ ఇదే!

అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?

బోయపాటి నన్ను చూసి మోసపోయాడు….తీన్మార్ చంద్రవ్వ షాకింగ్ కామెంట్స్ !

కామెడీతో ఆకట్టుకుంటున్న పళ్ళబురుసు టీజర్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సర్జరీ తర్వాత తొలిసారి రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లారో తెలుసా?

రుక్మిణి వసంత్ నెలకి ఎంత సంపాదిస్తుందో తెలుసా ?

Big Stories

Advertisement
×