Akkineni Sumanth: తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగేశ్వరరావు నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకన్నారు. అద్భుతమైన సినిమాలలో నటిస్తూ చివరి శ్వాస వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఏఎన్ఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నాగార్జునతో పాటు ఆయన కొడుకులు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటుడు సుమంత్(Sumanth) తాజాగా మహేంద్రగిరి వారాహి(Mahendragiri Varahi) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
మహేంద్రగిరి వారాహి సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ మూవీ అయిన “మనం”(Manam) సినిమా గురించి సుమంత్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నాగేశ్వరరావు (Nageswara Rao), నాగార్జున(Nagarjuna), నాగచైతన్య అఖిల్ అమల ఇలా అక్కినేని కుటుంబ సభ్యులందరూ కలిసిన నటించిన చిత్రం మనం. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సక్సెస్ అందుకున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా ఏఎన్ఆర్ చివరి సినిమా అనే సంగతి తెలిసిందే.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మనం సినిమా 2014 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా అక్కినేని కుటుంబ సభ్యులకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా మారింది. ఈ సినిమా తర్వాత ఏఎన్ఆర్ గారు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని తాను చూడలేదు అంటూ సుమంత్ తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా చూస్తే తాను చాలా ఎమోషనల్ అవుతానని తన గుండె బరువెక్కుతుందని సుమంత్ తెలిపారు. అక్కినేని కుటుంబ సభ్యులందరూ కలిసి నటించిన ఈ సినిమా మాకు ఎంతో స్పెషల్ అయినప్పటికీ ఈ సినిమా చూస్తే మాత్రం తాతగారు చివరి రోజులలో పడిన ఇబ్బందులు మాత్రమే నాకు గుర్తుకొస్తాయని తెలిపారు.
మనం సినిమా షూటింగ్ సమయంలోనే ఏఎన్ఆర్ గారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే ఈయన ఐసీయూ బెడ్ మీద నుంచే డబ్బింగ్ చెప్పారంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాగార్జున వెల్లడించారు. ఇలా సినిమా అంటే ప్రాణం పెట్టిన ఏఎన్ఆర్ గారి ఆఖరి సినిమా కావడంతో సుమంత్ ఇప్పటివరకు ఈ సినిమా చూడలేదని తెలుస్తోంది. ఇలా మనం సినిమా తాను చూడలేదనే విషయాన్ని సుమంత్ తెలపడంతో అభిమానులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఇక సుమంత్ ఒకానొక సమయంలో హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే మధ్యలో చిన్నవిరామం ప్రకటించిన ఇటీవల వరుస సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన మహేంద్రగిరి వారాహి సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Also Read: ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!