C.M.Vijay -Ajith Kumar: తమిళనాడు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటులు అజిత్ కుమార్(Ajith Kumar) అలాగే నటుడు విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వీరిద్దరూ ఒకేసారి తమ కెరియర్ ప్రారంభించి ఇండస్ట్రీలో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం అజిత్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రేసింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇక మరోవైపు నటుడు విజయ్(Vijay) ఊహించని విధంగా టీవీకే పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేసి తమిళనాడు ముఖ్యమంత్రిగా (Tamilanadu Cheif Minister) బాధ్యతలు తీసుకున్నారు.
ఈ విధంగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలను దూరం పెట్టారు. ఇకపోతే విజయ్ సీఎం అయిన తర్వాత మొదటిసారి రాష్ట్ర పెట్టుబడుల కోసం ఈయన యూకే వెళ్లారు. నటుడు అజిత్ కుమార్ సైతం తన రేసింగ్ టీమ్ తో కలిసి యూకేలో ఉన్న నేపథ్యంలో సీఎం విజయ్ ఊహించని విధంగా నటుడు అజిత్ కుమార్ ను కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యూకే పర్యటనలో భాగంగా సరదాగా రేసింగ్ ఈవెంట్ కు సీఎం విజయ్ వెళ్లారు. అయితే అక్కడ అజిత్ ను చూడగానే పరుగులు తీస్తూ తన స్నేహితుడిని గట్టిగా హగ్ చేసుకున్నారు .అనంతరం వీరిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నిన్న యూకే లోనే ఉన్నటువంటి నటి త్రిష సైతం హీరో అజిత్ ను కలిసిన సంగతి తెలిసిందే. నటి రాధికతో పాటు ఈమె రేసింగ్ ఈవెంట్ కు వెళ్లారు. ఇక తాజాగా సీఎం విజయ్ వెళ్ళటం గమనార్హం. ఇక వీరిద్దరూ హీరోలుగా సినిమాలు చేస్తున్న సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఇద్దరు మధ్య పోటీ ఉండేది.
That Hug🫂🫶
Petetion to Director #ALVijay to add this clip on #Gladiators 🙇♂️🛐
We would be able to witness ONE LAST TIME Thala – Thalapathy onscreen together 🤩 pic.twitter.com/pZKwwqGZE6
— AmuthaBharathi (@CinemaWithAB) September 12, 2026
ఈ హీరోల సినిమాల మధ్య మాత్రమే కాకుండా వీరి అభిమానుల మధ్య కూడా పచ్చి గడ్డి వేస్తే బగ్గు మనేలా సోషల్ మీడియా వేదికగా గొడవలు జరిగేవి అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలని ఇలా చూడటంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం విజయ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వగా అజిత్ మాత్రం ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. ఈయన అధిక్ రవి చంద్రన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అజిత్ కెరియర్లో 64వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా AK 64 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాకు విడాముయర్చి అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.
Also Read: ఆ అక్కినేని హీరో ‘మనం’ సినిమా చూడలేదా? కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?