Saiyaara: కొన్ని ప్రేమకథా సినిమాలు యువతను ఆకట్టుకోవడమే కాదు కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తాయి. అలా కొన్ని సినిమాలని థియేటర్లలో చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మళ్ళీ థియేటర్లలో కనిపిస్తోంది. అదేంటంటే బాలీవుడ్ నటుడు అహాన్ పాండే, అనిత్ పద్దా కాంబినేషన్లో వచ్చిన సైయారా (Saiyaara) సినిమా చూసిన ఎంతోమంది జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకునేంతలా అందులో ఏముంది..?ఎందుకు ఈ సినిమాకి ప్రేక్షకులు అంతలా అట్రాక్ట్ అయ్యారు? అనేది ఇప్పుడు చూద్దాం..
తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అయిన అనన్య పాండే సోదరుడు..
బాలీవుడ్ నటుడు అహాన్ పాండే (Ahaan Pandey) ఎవరో కాదు లైగర్ (Liger)బ్యూటీ అనన్య పాండే(Ananya Pandey) సోదరుడే.. మోహిత్ సూరి (Mohit Suri) డైరెక్షన్లో అహాన్ పాండే, అనీత్ పద్దా హీరో హీరోయిన్లుగా యష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా సైయారా.. ఈ సినిమా జూలై 18న విడుదలయ్యి థియేటర్లలో సందడి చేస్తోంది.ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు అయితే చివర్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
థియేటర్లలో బోరున ఏడ్చేస్తున్న యువత..
తాజాగా ఈ సినిమా థియేటర్లో చూసిన యువత మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఒక అబ్బాయి ఏకంగా బాధ తట్టుకోలేక సొమ్మసిల్లిపోతే.. మరికొంతమంది అమ్మాయిలు ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేస్తున్నారు. ఈ హృదయవిధారకర వీడియో నెటిజన్స్ ను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా సినిమా అనుభవానికి ఒక కొత్త బెంచ్ మార్కును క్రియేట్ చేసింది.. సినిమా చూస్తుంటే మైమరిచిపోతున్నాం.. ప్రేమ, త్యాగం అనే అంశాలతో కూడిన రోలర్ కోస్టర్ మూవీ అంటూ రివ్యూలు ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇది మొదటి సినిమానే.
మొదటి సినిమానే అయినా అద్భుతంగా నటించిన అనన్య సోదరుడు..
కానీ మొదటి సినిమా అనే భావన ఎక్కడ కూడా కనిపించకుండా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి, అనుభవం ఉన్న హీరో హీరోయిన్ల లాగా వీరి నటన ఉంది అని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాలోని హృదయ విధారకమైన సన్నివేశాలు ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్నాయి. ఇందులో ఉండే ప్రేమని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ప్రేమ కథను స్క్రీన్ మీద అద్భుతంగా చూపించడంతో సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా ఆదిత్య రాయ్ కపూర్ (Aditya Rai Kapoor),శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) లు నటించిన ఆషికీ 2(Aashiqui-2) కంటే మరింత అద్భుతంగా ఉంది అని ఆ సినిమాతో కంపేర్ చేస్తూ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా స్క్రీన్ ప్లే,డైరెక్షన్, మ్యూజిక్, బీజీఎమ్, నటీనటుల యాక్టింగ్ ఇలా ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు.
స్టార్ హీరో మూవీ రేంజ్ లో సినిమాకి గుర్తింపు..
ఏది ఏమైనప్పటికీ సైయారా సినిమాని థియేటర్లలో చూసిన ప్రేక్షకులంతా కన్నీళ్లు పెట్టుకొని మరీ బయటకు వస్తున్నారు. గతంలో తెలుగులో సాయి రాజేష్ (Sai Rajesh)డైరెక్షన్లో వచ్చిన బేబీ (Baby) సినిమాను చూసి ప్రేక్షకులు ఎలా అయితే కన్నీళ్లు పెట్టుకున్నారో ప్రస్తుతం సైయారా సినిమా చూసి కూడా అలాగే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం థియేటర్లో సైయారా సినిమా చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సైయారా సినిమాకి ఎంత మంచి ఆదరణ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ALSO READ:Hari Hara Veeramallu Release : మైత్రి చేతిలోకి వచ్చిన పవన్ మూవీ!
?utm_source=ig_web_copy_link