Rose Water For Dark Circles: రోజ్ వాటర్ చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వర్షాకాలం వంటి తేమతో కూడిన సీజన్లలో. చర్మం జిగటగా, నిర్జీవంగా, ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉన్నప్పుడు, రోజ్ వాటర్ వాడటం మంచిది. ఇది చర్మాన్ని తాజాగా, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ప్రతి సీజన్‌లో చర్మాన్ని మెరుస్తూ ఉండేలా చేస్తాయి
వర్షాకాలం ఒకవైపు ఉపశమనాన్ని ఇస్తుండగా.. మరోవైపు, చెమట, దుమ్ము, బ్యాక్టీరియా వంటివి చర్మ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అన్ని వయస్సులతో పాటు.. ప్రతి చర్మ రకానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో డార్క్ సర్కిల్స్ తగ్గడానికి , గ్లోయింగ్ స్కిన్ కోసం రోజ్ వాటర్ ఎలా వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఫేస్ టోనర్‌గా ఉపయోగించండి:
రోజ్ వాటర్ ఒక అద్భుతమైన సహజ టోనర్. వర్షాకాలంలో.. ముఖంపై నూనె పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు.. దూదిలో ముంచిన రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది ముఖ రంధ్రాలను బిగించి చర్మానికి తాజాదనాన్ని తెస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం కూడా ఇది మేలు చేస్తుంది.బయట మార్కెట్ లో దొరికే ఫేస్ టోనర్‌లకు బదులగా రోజ్ వాటర్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖం తాజాగా కనిపించేలా చేస్తుంది.
2. మొటిమల నుంచి ఉపశమనం:
వర్షాకాలంలో చెమట, తేమ కారణంగా.. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుతుంది. రోజ్ వాటర్‌లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని వేప లేదా కలబంద జెల్‌తో కలిపి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3.మేకప్ రిమూవర్:
రోజ్ వాటర్ ఆయిల్ ఫ్రీ కాబట్టి, లైట్ మేకప్ తొలగించడానికి ఇది సరైంది. రోజ్ వాటర్‌ను కాటన్ సహాయంతో ముఖంపై సున్నితంగా శుభ్రం చేసుకోండి. ఇది గ్లోయింగ్ స్కిన్ కోసం ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మృత కణాలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.
Also Read: ఖరీదైన ఆయిల్స్ అవసరమే లేదు, జుట్టుకు ఈ ఒక్క ఆయిల్ వాడితే చాలు !
4. చర్మాన్ని హైడ్రేట్ చేసి రిఫ్రెష్ చేస్తుంది:
వేసవి, వర్షాకాలం రెండింటిలోనూ చర్మం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ముఖంపై రోజ్ వాటర్ స్ప్రే చేయడం వల్ల చర్మానికి తాజాదనం , తేమ లభిస్తుంది. ఇది ఫేస్ మిస్ట్‌లాగా పనిచేస్తుంది.
5. డార్క్ సర్కిల్స్ దూరం:
వర్షాకాలంలో నిద్ర లేకపోవడం లేదా చర్మం నీరసంగా ఉండటం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. రోజ్ వాటర్‌లో కాటన్ ప్యాడ్‌లను నానబెట్టి కళ్ళపై ఉంచండి. ఇది వాపు, డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తుంది. డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడే వారు తరచుగా రోజ్ వాటర్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. అంతే కాకుండా తక్కువ సమయంలో డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి.