Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ వెండితెర ఎంట్రీ కోసం అభిమానులు మాత్రమే ఇండస్ట్రీ వర్గాలు సైతం ఎదురుచూస్తున్నారు. అకీరాని లాంచ్ చేయసేందుకు దర్శక–నిర్మాతలు క్యూలో ఉన్నారు. అకీరా హు అంటే చాలు.. స్క్రిప్ట్ చెప్పి ఒకే చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు దర్శకులు. ఇలా దర్శక నిర్మాతలంతే పవన్, అకీరా పర్మిషన్ కోసం ఎదురుచూస్తుంటే.. ఓ లేడీ యూట్యూబర్ ఏకంగా అకీరాను లాంచ్ చేసేంది. అంతేకాదు అకీరాతో డ్యుయేట్ సాంగ్ కూడా ప్లాన్ చేసి తన యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసింది.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనకు మేల్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉన్నారో లేడీ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. బద్రి, ఖుషి వంటి చిత్రాలతో యూత్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ, ఆయన కొడకు అకీరా మాత్రం సినిమాల్లోకి రాకముందే ఆ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీనికి ఈ తాజా వీడియోనే ఉదాహరణ. కాగా అకీరా ఈ మధ్య తరచూ మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. తన తండ్రి, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా గెలిచినప్పటి నుంచి అకీరా బాగా వైరల్ అవుతున్నాడు. తండ్రి రాజకీయాలకు రావడంతో ఇక కొడుకు సినీ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని అంత అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో అకీరాకు ఎలాంటి స్క్రిప్ట్ అయితే బాగుంటుంది.. అతడి కటౌట్ కి ఏలాంటి పాత్ర సరిపోతుందంటూ తరచూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు ఇదిగో అకీరా ఆరంగేట్రం ఖాయమైందంటూ నెట్టింట తరుచూ ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ఓజీ సినిమాతో అకీరా సినీరంగ ప్రవేశం చేస్తున్నాడని, ఇంతులో పవన్ యంగ్ ఏజ్ లుక్‌లో కనిపిస్తాడని చర్చ జరిగింది. కానీ, అది అబద్దమే అని తేలిపోయింది. కానీ, తన కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీపై రేణు దేశాయ్ మాత్రం స్పష్టం చేయడం లేదు. తన కొడుకు ఎప్పుడు రెడీ అయితే అప్పుడే అంటుంది.. కానీ, ఆ సమయంలో ఎప్పుడనేది మాత్రం చెప్పడం లేదు. ఇటూ పవన్ కూడా అకీరా వెండితెర ఎంట్రీపై మౌనం వీడటం లేదు. దీంతో అకీరా ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అకీరాకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ యువతి అకీరాతో రొమాంటిక్ సాంగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏకంగా ఓ యువతి అకీరాను తన కలల రాకుమారుడిగా ఊహించుకుంటూ కలలో తేలిపోతుంది. చూట్టు అకీరా ఫోటోలు పెట్టుకుని రొమాంటిక్ సాంగ్ తో డ్యుయేట్ పాడుతోంది. సీతయ్య సినిమాలోని రొమాంటిక్ సాంగ్‌ని రీక్రియేట్ చేసింది. “సిగ్గెస్తుంది నిను చూస్తుంటే పాటను ఈ యువతి రీక్రెట్ చేసింది. అక్కడ సిమ్రాన్.. దివంగత నటుడు హరికృష్ణ ఫోటోలను పెట్టుకుంటే.. ఈ అమ్మాయి అకీరా ఫోటోలను పెట్టుకుంది. ప్రస్తుత ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది కానీ, వాళ్ల అమ్మ (అకీరా తల్లి రేణు దేశాయ్) చూస్తే నీకు ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమ ఏంటమ్మా.. ఏకంగా పవన్ కోడలే అయిపోదామనుకుంటున్నావా? అంటూ సెటైరికల్గా కామెంట్స్ చేస్తున్నారు. వెండితెర ఎంట్రీ ఇవ్వకముందే అకీరా ఇలా అమ్మాయి కలల రాకుమారుడు అయితే.. ఇక ఎంట్రీ ఇచ్చాక అమ్మాయిల పరిస్థితేంటో అంటున్నారు ఫ్యాన్స్.
వాళ్ల అమ్మ చూడాలి ఇవన్నీ 🤦♂️ pic.twitter.com/os58b0LdVv
— Kishan JSP ✊ (@Kishan_Janasena) October 22, 2025