Hari Hara Veeramallu Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. అలా జ్యోతికృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో వస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’. జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై ఊహించని క్రేజ్ పెరిగిపోయింది. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, పాటలు , ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇకపోతే ఈ సినిమాకి అన్ని ఏరియాలలో బిజినెస్ బాగానే జరిగినా.. ఒక నైజాం ఏరియాలో మాత్రం ఇప్పటివరకు నిర్మాతలు తల మునకలు అవుతున్న విషయం తెలిసిందే.
నైజాం హక్కుల విషయంలో నిర్మాత తిప్పలు..
వాస్తవానికి ఏదైనా ఒక పెద్ద సినిమా విడుదలవుతోంది అంటే ప్రత్యేకించి దిల్ రాజు (Dilraju ) లేదా నాగ వంశీ(Naga Vamshi) ఆయా సినిమాల హక్కులను నైజాం ఏరియాలో కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాంటిది వారే ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేశారు అంటే.. ఈ సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం ఏ రేంజ్ లో డిమాండ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఒక నైజాం ఏరియాకే ఏఎం రత్నం భారీగా డిమాండ్ చేయడంతోనే.. దిల్ రాజు, నాగ వంశీ ఇద్దరు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయలేదని సమాచారం. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా హక్కులను ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో.. తన స్నేహితుడితో ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత అనుకున్నారట.
నైజాం హక్కులు మైత్రీ చేతికి..
అయితే ఏమైందో తెలియదు కానీ.. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను నైజాం ఏరియాలో మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నట్లు సమాచారం. అయితే మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించకుండా అడ్వాన్స్ రూపంలోనే ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి, విడుదల చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తున్నారట. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే నైజాం హక్కుల కోసం నిర్మాత ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమా హక్కులను అందులోను అడ్వాన్స్ రూపంలో మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకోవడం విశేషం. ఇక ఈ సినిమా కలెక్షన్లను బట్టి మిగతా అమౌంట్ చెల్లించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమాకు నష్టం వస్తే మాత్రం అటు మైత్రికి కూడా నష్టం రాకుండా ఇలా చేసినట్లు సమాచారం.
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సత్యరాజ్, సునీల్ తో పాటు పలువురు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాకు జూలై 23వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
ALSO READ:Star Kid: ఏకంగా 50 కథలు రిజెక్ట్ చేసిన స్టార్ కిడ్.. ఎవరు.. ఏమైందంటే?