Thamma Collections:ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గోల్డెన్ లెగ్ గా పేరు సొంతం చేసుకుంది రష్మిక మందన్న (Rashmika Mandanna). అతి తక్కువ సమయంలోనే ఊహించని విజయాలను సొంతం చేసుకున్న ఈమె ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సినిమాలతో భారీ కలెక్షన్లు దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ ను అందుకుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరో, హీరోయిన్లు కూడా సాధించని రికార్డులను రష్మిక అవలీలగా సాధించింది. ఇప్పటికే పుష్ప, పుష్ప 2, ఛావా, యానిమల్ , కుబేర చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న ఈమె.. ఇప్పుడు థామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న , ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రలు పోషించారు. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మరొకసారి రష్మికను గోల్డెన్ లెగ్ అని నిరూపించింది. ఇకపోతే ఈ సినిమా నిన్న థియేటర్లలోకి రాగా.. ఎన్ని కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం వైరల్ గా మారుతోంది. ఇకపోతే మొదటి షోతోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. మొదటిరోజు 25.1 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. మొత్తానికి అయితే మొదటి రోజే భారీ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.
ALSO READ:Gun Fire on Singer : ప్రముఖ సింగర్ పై కాల్పులు.. చంపేస్తామని బెదిరింపులు
థామా సినిమా విషయానికి వస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఒక జర్నలిస్టు. అడ్వెంచర్ చేయడం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఏదైనా ఒక వైరల్ వీడియో షూట్ చేద్దామనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తారు. అనుకోకుండా ఎలుగుబంటి దాడి చేయడంతో తప్పించుకునే ప్రయత్నంలో స్నేహితుల నుంచి వేరు పడిన అలోక్ ను భేతాళ జాతికి చెందిన తడక రక్షిస్తుంది. పైగా అతడిని చూసిన మొదటి చూపులోనే అతడితో ప్రేమలో పడిపోతుంది. పైగా అతడిని తమ జాతి వారు బలి తీయడానికి సిద్ధమైన సమయంలో కూడా కాపాడుతుంది. అక్కడే ఉంటే తన ప్రియుడికి అపాయం అని భావించిన తడక వెంటనే తన జాతిని వదిలి జనజీవనంలోకి వస్తుంది. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ ప్రయాణం ఎన్ని మలుపులు సాగింది. అలోక్ ను తడక ఒక బేధాలిని అని ఎప్పుడు తెలుస్తుంది. ఆమె బేతాళ జాతి పుట్టుక వెనుకున్న కారణం ఏమిటి? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమాకి బేడియా, ముంజ్య , స్త్రీ 2చిత్రాలతో ఉన్న లింకుని కూడా తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.